»   »  'మనం' లో అమితాబ్ చేయటానికి కారణం

'మనం' లో అమితాబ్ చేయటానికి కారణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మనం చిత్రంలో అమితాబ్ గెస్ట్ రోల్ లో కనపడనున్నాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు సినిమాలో అమితాబ్ చేయటం ఏమిటి...రూమర్ అయ్యింటుంది అని అంతా కొట్టి పారేసారు. అయితే తను నిజంగానే ఈ చిత్రంలోనే చేస్తున్నట్లు అమితాబ్ స్వయంగా ట్వీట్ ద్వారా తెలియపరిచారు. ఈ విషయాన్ని నాగార్జున సైతం సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు.

ఈ విషయాన్ని ఆయన తన బ్లాగులో ''నా మిత్రుడు నాగార్జున, అతని తండ్రి నాగేశ్వరరావు కలిసి నటించిన సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తాను. ఇటీవల చిత్రీకరణ కూడా పూర్తి చేసుకున్నాను'' అంటూ రాసుకొచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రమిది. అక్కినేనిపై అభిమానంతో బిగ్‌బీ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారని సమాచారం.

Amitabh Bachchan playing guest role in Manam

అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు కలిసి నటించిన చిత్రం 'మనం'. సమంత, శ్రియ హీరోయిన్స్. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మాణంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో ఇప్పుడు మరో ప్రత్యేకత చేరింది. బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు.

'మనం' పాటలను ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఒక పాటను విడుదల చేశారు. ఈ చిత్రానికి అనూప్‌ సంగీతం అందించారు.

అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రెయహీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

English summary

 "Did a quick cameo shoot for Nag, son of the legendary Late Akkineni Nageshwar Rao, and a dear friend, for the film he has made in Telugu along with his Father" - Amitabh Bachchan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu