»   » నాన్న‌కు ఇష్టం, అందుకే ఆయతో గెస్ట్‌రోల్: నాగార్జున

నాన్న‌కు ఇష్టం, అందుకే ఆయతో గెస్ట్‌రోల్: నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'మనం' చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో అతిథి పాత్ర చేయించడంపై నాగార్జున స్పందిస్తూ....'నాన్నకి అమితాబ్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసినప్పుడల్లా అరే ఎంత బాగా చేసాడురా.. చూడటానికి చక్కగా ఉందికదరా అనే వాడు. అమితాబ్ సినిమాలు ఒక్కటి కూడా మిస్ అయ్యేవాడు కాదు. అలాగే వీరిద్దరికీ మంచి అనుబంధం ఉంది. నేను అడగ్గానే అమితాబ్ గారు వెంటనే ఒప్పుకున్నారు. నాన్న గారి చివరి సినిమాలో ఆయన కనిపించడం స్పెషల్ అట్రాక్షన్ అని' అన్నారు.

అక్కినేని మూడు తరాల హీరోలు నటించిన మల్టీ స్టారర్ మూవీ 'మనం' చిత్రం ఈ నెల 23న విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటించి చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ద్వారా అక్కినేని ఎప్పటికీ జీవించే ఉంటారని నాగార్జున అంటున్నారు.

Amitabh Bachchan’s cameo is a tribute to ANR- Nagarjuna

కాగా...'మనం' చిత్రం ఆడియో ఎలాంటి ఆర్భాటాలు, వేడుక లేకండా డైరెక్టుగా మార్కెట్‌లోకి విడుదల చేసారు. 'మనం' ఆడియో పంక్షన్ గ్రాండ్ గా చేస్తారని,ప్యాన్స్ అంతా వెళ్లవచ్చని భావించారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు మరణించిన ఇంకా సంవత్సరం కూడా గడవకముందే ఇలాంటి పంక్షన్ జరుపుకోవటం పద్దతి కాదని, తాను స్టేజిపై ఎమోషన్ అయ్యే అవకాసం ఉందని భావించిన నాగార్జున ఫంక్షన్ ని రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.

అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రీయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

English summary
“My father had great respect for Amitabh. In fact, he considered Amitabh as one of the greatest actors India has ever produced. I thought having Bachan Saab in our film would be a great honour to my father. I requested him to play a guest role and he immediately accepted.” said Nagarjuna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu