»   » అప్పటి తాప్సీ కాదు..మొత్తం మారిపోయింది, చూస్తే ఆశ్చర్యపోతారు (ఫొటోలు)

అప్పటి తాప్సీ కాదు..మొత్తం మారిపోయింది, చూస్తే ఆశ్చర్యపోతారు (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఢిల్లీ డాల్ తాప్సీ ప్రారంభ రోజుల్లో తెలుగులో మంచి ఆఫర్లనే దక్కించుకోగా ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో సరైన ప్రాజెక్టులు ఏమి లేవు. దాంతో సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పరిచయమైన తాప్సీ ఆ తర్వాత బాలీవుడ్ ఫ్లైటెక్కేసింది. అక్కడ కూడా ఈ అమ్మడు సరైన సక్సెస్‌లను సాధించలేక చతికిలపడింది అనుకున్న సమయంలో ఆమెకు అదృష్టం పింకి రూపంలో పలకరించింది.

ఆ చిత్రంపై తాప్సీ చాలా ఆశలు పెట్టుకుంది. అంతేకాదు చిత్రం ప్రమోషన్ లో చాలా ఉత్సాహంగా పాల్గొంటోంది. ఇందుకోసం ఆమె వేసుకున్న డ్రస్ లు చూస్తే కుర్రకారుకు మతిపోతోంది. తెలుగువాళ్లేమో ..అరెరే ఆమెతో అంత సెక్సీ లుక్ ఉందా....మనం ఎలివేట్ చెయ్యలేకపోయామే అని ఫీలవుతున్నారు. ఆ ఫొటోలు మీరూ చూసేయండి. మీకు ఏమి అనిపించిందో క్రింద రాయటం మాత్రం మర్చిపోకండి.

తాప్సీ ప్రస్తుతం ఓ తమిళ సినిమాతో పాటు రెండు హిందీ సినిమాల్లో నటిస్తోండగా ఇటీవల ఈ అమ్మడు నటించిన బాలీవుడ్ మూవీ 'బేబి' చిత్రం తాప్సీకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లో సూజిత్ సర్కార్ డైరెక్షన్‌లో ఓ సందేశాత్మక చిత్రం తెరకెక్కుతుండగా ఇందులో అమితాబ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో తాప్సీకు ఓ బంపర్ ఆఫర్ రాగా ఈ అమ్మడు తెగ సంబరపడిపోతుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో సెట్స్ పైకి తీసుకెళ్ళాలని చిత్ర యూనిట్ భావిస్తోండగా, తాప్సీ లక్ ఈ చిత్రంతో అయిన మారుతుందా లేదా అనేది చూడాలి.

స్లైడ్ షోలో తాప్సీ ఫొటోలు, మరిన్ని విశేషాలతో కలిపి చూడండి

టైం స్టార్టైంది

టైం స్టార్టైంది

ఇటీవల కాలంలో చాలా మంది దక్షిణాది తారలు బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నారు. ఆసిన్‌.. త్రిష.. జెనీలియా.. ఇలియానా వంటి తారలు అడపాదడపా సినిమాలే చేస్తున్నారు. కానీ.. 2103లో 'ఛస్మే బద్దూర్‌' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తాప్సీకి అప్పట్లో ఎక్కువ అవకాశాలు రాకపోయినా.. ఇప్పుడు మాత్రం వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటోంది.

 అక్కడ నుంచే కెరీర్ మొదలైంది

అక్కడ నుంచే కెరీర్ మొదలైంది

ప్రస్తుతం అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి తాప్సీ నటించిన 'పింక్‌' చిత్రం ట్రైలర్‌ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే రానా దగ్గుపాటితో 'ఘాజి'..ప్రకాశ్‌రాజ్‌ దర్శకత్వంలో 'తడ్కా' చిత్రాల్లో నటిస్తోంది. అయితే.. 'బేబీ' సినిమాలో తాప్సీ నటనకు ముగ్ధుడైన ఆ చిత్ర దర్శకుడు నీరజ్‌ పాండే.. తన తదుపరి రెండు సినిమాల్లో ఈమెనే ఎంచుకున్నాడు.

దర్శకుడుకి నచ్చేసింది అందుకే

దర్శకుడుకి నచ్చేసింది అందుకే

'బేబీ' చిత్రం తర్వాత నీరజ్‌ పాండే 'ఎం.ఎస్‌.ధోని' బయోపిక్‌ను తెరకెక్కించాడు. ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది. ఇప్పుడు 'బేబీ'కి సీక్వెల్‌ చేయాలని ఆలోచిస్తున్నాడట నీరజ్‌. ఇందుకోసం మహిళా ప్రాధాన్యత ఉన్న కథను సిద్ధం చేసి.. ఆ పాత్రకు తాప్సీనే ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నాడట.

 టాప్ స్టార్ అవుతుంది

టాప్ స్టార్ అవుతుంది

అలాగే నీరజ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న 'మీరా' అనే చిత్రంలో తాప్సీకే అవకాశం ఇచ్చాడు. ఇలా బాలీవుడ్‌లో వరస అవకాశాలు కొట్టేస్తోంది ఈ భామ.ఇక ఈ చిత్రాలన్నీ విజయం సాధిస్తే బాలీవుడ్‌ అగ్ర నటీమణుల సరసన తాప్సీ చేరినట్లే. ఈ రోజు కోసమే తను ఇంతకాలం వెయిట్ చేసింది అంటోంది తాప్సీ.

తెలివైందే...తాప్సీ

తెలివైందే...తాప్సీ

'' నేను ఇంజనీరింగ్‌ చేసేటప్పుడు నాతో పాటు ముగ్గురం కలసి ఫైనల్‌ ఇయర్‌లో ఐఫోన్‌లో ఫాంట్స్‌ మార్చుకునేందుకు వీలుగా ఉండేట్టువంటి యాప్‌ను తయారు చేశాం. ఇప్పుడు చాలా యాప్స్‌ వచ్చాయి కానీ అప్పట్లో (ఆరాడేళ్ల క్రితం) ఇటువంటివి రాలేదు. కానీ మేము తయారు చేసిన యాప్‌ను మాత్రం యాప్‌ స్టోరీస్‌ వారికి మాత్రం అందజేయలేదు. ఎందుకంటే అప్పట్లో ఇటువంటి యాప్స్‌కు అనుమతి ఇవ్వడానికి దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకే అలా చేశాం'' అంటోంది తాప్సి.

నేనూ అలాగే ఫిక్సయ్యా

నేనూ అలాగే ఫిక్సయ్యా

''నేను ఇంతకు ముందు విభిన్నమైన పాత్రలు చేసేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను. అందువల్ల ఇప్పుడు అటువంటి పాత్రలు చేసేందుకు ఇష్టపడడం లేదు. ప్రేక్షకులు కూడా నన్ను అలా చూడదలుచుకోవడం లేదు. నన్ను ఓ మంచి నటిగా, చూడ్డానికి డీసెంట్‌ యాక్టర్‌గా ఓ సాధారణ హీరోయిన్ గా ప్రేక్షకులు చూడాలనుకుంటు న్నారు. నేనూ అలాగే ఉండాలనుకుంటున్నాను'' అని తాప్సీ అన్నది.

 జాబ్ వద్దనకునే ఇలా వచ్చా

జాబ్ వద్దనకునే ఇలా వచ్చా


ఇంజనీరింగ్‌లో డిగ్రీ అయిపోయిన తర్వాత ఇన్ఫోసిస్‌లో వచ్చిన జాబ్‌ను వదిలేకున్నానని చెప్పింది. తనకు 9-5 గంటల జాబ్‌ చేయడం ఇష్టముండదని పేర్కొంది. హిందీలో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన ఈమె ప్రస్తుతం అమితాబ్‌తో 'పింకు' చిత్రంలో కో స్టార్‌గా నటిస్తోంది. సినిమాల్లో ఇక నుంచి ఏదో ఇలా కన్పించి అలా తెరమరుగయ్యే పాత్రలు మాత్రం చేయబోనని స్పష్టం చేసింది.

 బంగ్లాదేశ్ శరణార్దురాలిగా

బంగ్లాదేశ్ శరణార్దురాలిగా

తానొక పెద్ద హీరోయిన్‌గా స్థిరపడే క్యారెక్టర్స్‌లో మాత్రమే చేయడానికి సిద్ధమవుతున్నానని చెప్పింది. 'పింక్‌' చిత్రం ఓ థ్రిల్లర్‌ అని, ఓ నటిగా తనను మరో డిఫరెంట్‌ కోణంలో చూస్తారని చెప్పుకొచ్చింది. ఈ సినిమా తర్వాత ప్రేమకథా చిత్రం 'ఘాజీ'లో చేస్తున్నట్టు పేర్కొంది. ఆ సినిమాలో బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన శరణార్థురాలుగా కనిపిస్తానని వెల్లడించింది. బాలీవుడ్‌లో విభిన్నమైన క్రేజీ పాత్రల్లో చేసేందుకు అవకాశాలు వస్తున్నాయని తెలిపింది.

 కళ్లు మూసుకు ఉండలేకపోయా

కళ్లు మూసుకు ఉండలేకపోయా

అమితాబ్‌తో చేసిన ఫస్ట్‌ షాట్‌ ఎప్పటికీ మరిచిపోనని అన్నది. ఆ షాట్‌కు చాలా టేక్స్‌ తీసుకున్నానని, ఎందుకంటే ఆ సన్నివేశంలో తాను కళ్లు మూసుకుని ఉండలేకపోయా నని చెప్పింది. తాప్సీ త్వరలో ప్రకాష్‌ రాజ్‌ దర్శకత్వంలో తీయనున్న ఓ హిందీ చిత్రంలో హీరోయిన్‌గా చేయనుంది. 'అతనితో కలసి రెండు చిత్రాల్లో నటించాను. ఇప్పుడు ఆయన దర్శకత్వం చేసే సినిమాలో అవకా శం రావడం అదృష్టం గా భావిస్తున్నానని తెలిపింది.

 స్పెషల్ షోలకు రెస్పాన్స్

స్పెషల్ షోలకు రెస్పాన్స్

తాప్సీ, కీర్తి కులకర్ణి, అమితాబ్‌బచ్చన్ లీడ్ రోల్స్‌లో నటించిన పింక్ చిత్రంపై బాలీవుడ్ హీరోయిన్లు ప్రశంసల వర్షం కురిపించారు. సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన పింక్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ముంబైలో స్పెషల్ షో వేశారు. స్పెషల్ షోను వీక్షించిన యామీగౌతమ్, దియా మీర్జా, నేహాదూపియా, సునిధి చౌహాన్, శాల్మలి ఖోల్గాడే ప్రశంసలు కురిపించారు.

 అందరూ చూడాల్సిన సినిమా

అందరూ చూడాల్సిన సినిమా

ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే ఇతివృత్తంతో తెరకెక్కిన పింక్‌పై సునిధి చౌహాన్ స్పందిస్తూ తాప్సీ, కీర్తికులకర్ణితోపాటు ఇతర స్టార్లు బెస్ట్ ఫర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. ఇలాంటి సినిమాను ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిన అవసరముందంటూ ట్వీట్ చేసింది. చిత్రంలోని నటీనటులందరికి హ్యాట్సాఫ్, మనకు ఇటువంటి సినిమాలు కావాలి..పింక్‌ను తప్పక చూడండి అంటూ యామిగౌతమ్ ట్వీట్ చేసింది.

 ఆయన అద్బుతం...తాప్సీ

ఆయన అద్బుతం...తాప్సీ

ప్రస్తుతం తన ఫోకస్‌ అంతా బాలీవుడ్‌ వైపు మరల్చిన ఈ అమ్మడు విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాశ్‌రాజ్‌ను ఓ పవర్‌హౌస్‌ అంటూ ఆకాశానికి ఎత్తేస్తోంది. ప్రస్తుతం అమితాబ్‌ సరసన 'పింక్‌' చిత్రంతో పాటు ప్రకాష్‌ రాజ్‌ దర్శకత్వంలో రూపొందిన 'ఉలవచారు బిర్యానీ' బాలీవుడ్‌ రీమేక్‌లో నటిస్తోంది తాప్సీ. ఈ సందర్భంగా ఆయన గురించి ఇలా చెప్పుకొచ్చింది.

 ప్రేమగా పలకరిస్తారు అంటూ తాప్సీ

ప్రేమగా పలకరిస్తారు అంటూ తాప్సీ


ప్రకాశ్‌రాజ్‌ గురించి నాకు చాలా కాలంగా తెలుసు. నటుడిగా కాకుండా బయట కూడా పరిచయం ఉంది. అందరినీ చాలా ప్రేమగా పలకరిస్తుంటారు. ఆయన ఓ పవర్‌హౌస్‌ పర్ఫార్మర్‌. ఆయనతో కలిసి ఎప్పుడెప్పుడూ పనిచేస్తానా అని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను' అని చెప్పుకొచ్చింది ఇటీవల వచ్చిన అవకాశాలతో అమితాబ్‌ ప్రశంసలను కూడా అందుకున్న తాప్సీ.. మరిన్ని అవకాశాలు పెంచుకునేందుకే ఇలా అందర్ని పొగడ్తలతో ముంచెత్తుతోందని అనుకుంటున్నారు బీటౌన్‌ జనాలు.

English summary
Taapsee Pannu has been wearing the trendiest of fashion lately! The lass has been touring across India to promote her upcoming film Pink. Let’s take a look at the outfits she’s been donning…
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu