»   »  అమితాబ్‌ను తీసుకోవటం మిస్టేక్

అమితాబ్‌ను తీసుకోవటం మిస్టేక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా, రాసినా అందులో ఎంతో కొంత కాంట్రావర్శి తొంగి చూస్తూంటుంది. తాజాగా ఆయన రాసిన జీవిత చరిత్ర పుస్తకం కూడా అలాంటి వాటితోనే నిండిపోయింది. అందులో భాగంగా వర్మ ...అమితాబ్ గురించి ఆయన రాసిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

'ఆగ్‌', 'నిశ్శబ్‌'చితాల్లో మాత్రం అమితాబ్‌ పాత్రలకు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దీని గురించి తాజాగా తాను రాసిన'గన్స్‌ అండ్‌ థైస్‌' పుస్తకంలో వివరణ ఇచ్చారు వర్మ. అందులో 'మై లవ్‌ ఎఫైర్‌ విత్‌ అమితాబ్‌ బచ్చన్‌' పేరిట ఓ అధ్యాయంలో అమితాబ్‌తో తన అనుభవాలను పంచుకున్నారు.

Amitabh Bachchan was guilty of misplacing his trust in me for ‘Aag’

''అమితాబ్‌ను ఓ స్టార్‌గానే చూసిన నేను ఆయనలోని నటుణ్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయాలనుకున్నాను. అందుకే 'ఆగ్‌', 'నిశ్శబ్ద్‌'ల్లో ఆయన పాత్రలతో ప్రయోగం చేశాను. నాపై పూర్తివిశ్వాసంతో, అమితాబ్‌ ఆ పాత్రలు చేశారు. అలాంటి వాటికి అమితాబ్‌ను ఎంచుకోవడం తప్పని ఆ తర్వాతే అర్థమైంది. నటుడిగా అమితాబ్‌ ఎప్పుడూ విఫలం కాలేదు. ఆయనలోని ప్రతిభను సరిగా ఆవిష్కరించలేకపోయిన నా లాంటి దర్శకులదే తప్ప''ని రాసుకొచ్చారు వర్మ.

అమితాబ్‌ బచ్చన్‌ అంటే తనకు అభిమానమని ఎన్నో సందర్భాల్లో చెప్పారు రామ్‌ గోపాల్‌ వర్మ. 'సర్కార్‌', 'సర్కార్‌ రాజ్‌', 'డిపార్ట్‌మెంట్‌', 'రణ్‌' తదితర చిత్రాల్లో అమితాబ్‌ను శక్తిమంతమైన పాత్రల్లో చూపించాడు.

English summary
Ram Gopal Varma, believes casting the Amitabh Bachchan in “Nishabd” and “Aag” was a mistake.
Please Wait while comments are loading...