Don't Miss!
- News
లోకేష్ యాత్ర కొత్త "టర్న్" - చంద్రబాబు వ్యూహాం: రంగంలోకి బాలయ్య - నందమూరి ఫ్యామిలీ..!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
చిరంజీవి సార్ తప్పు చేశారు.. అలా చేయకుండా ఉండాల్సింది: అమ్మ రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్
కొరియోగ్రాఫర్‌గా సినీ ఇండస్ట్రీకి పరిచయమై.. గోపీచంద్ హీరోగా చేసిన 'రణం'తో దర్శకుడిగా మారి సక్సెస్ అయ్యాడు అమ్మ రాజశేఖర్. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ దారుణమైన పరాజయాలను చవి చూశాయి. దీంతో చాలా కాలం పాటు కనిపించకుండాపోయారాయన. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగులో ప్రసారం అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. గ్రాండ్ ఫినాలేలో చీఫ్ గెస్ట్ చిరంజీవి ఆయన అడ్వాన్స్ సీక్రెట్ లీక్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్‌పై అమ్మ రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం!

తెలుగులోకి రీఎంట్రీ.. కామెడీ చేస్తూ
చాలా కాలం క్రితం టాలీవుడ్‌కు దూరం అయ్యాడు కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన బిగ్ బాస్ నాలుగో సీజన్ ద్వారా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చారు. పేరున్న కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ప్రవేశించిన ఆయన తన మార్క్ చూపించారు. ఈ క్రమంలోనే అందరిపై కామెడీ చేస్తూ నవ్వించారు. దీంతో చాలా మంది ఆయనకు బాగా దగ్గరైపోయారు.

గొడవలతో బ్యాడ్ నేమ్.. ఎలిమినేట్
అమ్మ రాజశేఖర్ కామెడీ ఎంత మంచి పేరు తెచ్చిందో.. అదే స్థాయిలో ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. దీంతో సహనం కోల్పోయిన ఆయన.. హౌస్‌మేట్లతో తరచూ గొడవలకు దిగేవారు. ఈ కారణంగానే పలుమార్లు నామినేట్ అయ్యారు. దీని నుంచి చాలా స్లార్లు తప్పించుకున్నప్పటికీ.. షో మధ్యలోనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో అసంతృప్తిగానే బయటకొచ్చేశారు.

ఆ పార్టీకి దూరం... ఫినాలేలో ఎంట్రీ
బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత అమ్మ రాజశేఖర్ బయట పెద్దగా కనిపించలేదు. అంతేకాదు, సీజన్ చివరి వారంలో జరిగిన రీయూనియన్ పార్టీకి సైతం ఆయన దూరంగా ఉన్నారు. అయితే, గత ఆదివారం ప్రసారం అయిన గ్రాండ్ ఫినాలేలో తళుక్కున మెరిశారు. ఆ సమయంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి రాజశేఖర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

అడ్వాన్స్ సీక్రెట్ లీక్ చేసిన చిరంజీవి
అమ్మ రాజశేఖర్ గురించి మాట్లాడుతూ.. ‘రణం సినిమా చేయడానికి చాలా ఏళ్ల ముందే ముందే రాజశేఖర్‌లో ఒక దర్శకుడు ఉన్నాడని గుర్తించాను. నాతో సినిమా చేయమని రూ.15 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాను. కానీ, ఇప్పటి వరకు ఆయన నాతో సినిమా మాత్రం చేయలేదు' అని సీక్రెట్ లీక్ చేశారు. దీనికి అమ్మ కూడా ఒప్పుకుని అనివార్య కారణాల వల్ల కుదరలేదని చెప్పారు.

ఆ సినిమాపై క్లారిటీ ఇచ్చిన అమ్మ
అదే స్టేజ్‌పై ఇప్పుడు అవకాశమిస్తే చిరుతో సినిమా తీస్తానని అన్నారు అమ్మ రాజశేఖర్. దానికి చిరు బదులిస్తూ.. ఇప్పుడు మళ్లీ అడ్వాన్స్ ఇవ్వనని.. అప్పుడిచ్చినదానికి వడ్డీ కలిపితే కోట్లవుతుందని.. అదే పారితోషకంగా తనతో సినిమా చేయమని చెప్పారు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆయన కోసం ‘గబ్బర్ సింగ్'లాంటి ఎంటర్‌టైనర్ కథ రెడీ చేశానన్నారు.

చిరుపై రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్
ఇదే ఇంటర్వ్యూలతో చిరంజీవిపై రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘చిరు గారు కొత్త కథలతో సినిమాలు చేయాలి. ఆయన లాంటి స్టార్ రీమేక్ చేయడం వల్ల లాభం ఉండదు. ఇప్పుడు ఓటీటీలు అందుబాటులో ఉండడం వల్ల అన్ని భాషల సినిమాలు ప్రేక్షకులు చూస్తున్నారు. దీని వల్ల రీమేక్‌లు అంతగా ఆడవు. ఈ విషయంలో చిరు కచ్చితంగా ధైర్యం చేయాలి' అని వివరించాడాయన.