»   »  మహేష్ హీరోయిన్: సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటోంది ఈ రోజే

మహేష్ హీరోయిన్: సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటోంది ఈ రోజే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: మహేష్ బాబు సరసన అతిథి చిత్రంలో హీరోయిన్ గా చేసిన అమృతారావు గుర్తుందా. ఆమె ఈ రోజు సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుంటోంది. సీక్రెట్ గా అంటే తన సన్నిహితులకు మాత్రమే పిలుస్తోంది అన్నమాట.

ఈ మధ్యకాలంలో కొందరు బాలీవుడ్‌ హీరోయిన్స్ ఎవరికీ తెలీకుండా రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో ఈ బాలీవుడ్‌ నటి అమృతా రావ్‌(అతిథి ఫేం) కూడా చేరింది.

అమృత ముంబయికి చెందిన రేడియో జాకీ అన్మోల్‌తో ఈరోజు వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఆన్మోల్‌, అమృతలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

Amrita Rao to tie the nuptial knot with RJ Anmol today!


ఇటీవల అమృత హాజరైన ఓ కార్యక్రమంలో చేతికిఉంగరం ఉండడం చూసి అమృత పెళ్లి విషయం కాస్తా బాలీవుడ్‌లో చక్కర్లు కొట్టింది. ఇది ఎంత వరకు నిజమో తెలీదు కానీ ఈరోజు వివాహమయ్యాక కొద్దిరోజుల తర్వాత అందరికీ గ్రాండ్‌గా రిసెప్సన్‌ ఇవ్వనున్నట్లు సన్నిహితులు తెలిపారు.

ఈరోజు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది.
అయితే అమృతా, అన్మోల్‌ల వివాహం కొన్ని నెలల క్రితమే అయిపోయిందని పెళ్లయ్యాక ఇద్దరూ విడిగా ఉంటున్నారని ఇంతకుముందువార్తలు వెలువడ్డాయి.


హిందీలో మై హూ నా, వివాహ్‌, ఇష్క్‌ విష్క్‌ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది అమృత. ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో తన సోదరి ప్రీతికా రావ్‌లాగే టీవీ సీరియళ్లలో నటిస్తోంది.

English summary
Bollywood gorgeous actress Amrita Rao is all set to get married to her beau RJ Anmol today. Yes, you heard that right, B-town is going to witness yet another grand wedding.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu