»   » రామ్ చరణ్ హీరోయిన్ బికినీ లో... (హాట్ ఫోటో)

రామ్ చరణ్ హీరోయిన్ బికినీ లో... (హాట్ ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బికినీలో హీరోయిన్స్ కనిపించటం వింతేమీ కాదు. సినిమా ఫీల్డ్ పుట్టిన నాటి నుంచి ఎంతో మంది కనిపించారు.అయితే కొందరు మాత్రం బికినీలో అదరకొడతారు. వారి గురించే జనం మాట్లాడుకుంటారు. ఇప్పుడు రామ్ చరణ్ తో ఎవడు చిత్రంలో చేసిన అమీ జాక్సన్ వంతు వచ్చింది. ఆమె బికినీ స్టిల్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. నెట్ లో ఈ ఫోటో వైరల్ గా దూసుకుపోతోంది.

ఇక ఎంతో కాలంగా రామ్‌చరణ్‌ అభిమానులు ఎదురుచూస్తున్న చిత్రం 'ఎవడు'. శ్రుతిహాసన్‌, అమీ జాక్సన్‌ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా...జనవరి నెలలో విడుదల కానుంది. ఈ మేరకు బిజినెస్ పూర్తి చేసారు నిర్మాత దిల్ రాజు. రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉండటంతో సినిమా బిజినెస్ కూడా బాగా జరిగినట్లు తెలుస్తోంది.

Amy Jackson

దిల్ రాజు మాట్లాడుతూ......మా బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ఎవడు. ఈ చిత్రానికి సంభందించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసాము. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన, శ్రుతి హాసన్, అమి జాక్సన్ అందాలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ,దర్శకుడు వంశీ పైడిపల్లి సూపర్బ్ టేకింగ్, ఈ చిత్రానికి హైలెట్స్ కాగా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు కాజల్ అగర్వాల్ పాత్రలు హైలెట్ గా నిలుస్తాయి. ఈ చిత్రం మెగా అభిమానులకు పండుగ వాతావరణం కల్పించటమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.


చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు. మగధీర తర్వాత ఆ రేంజి హిట్టయ్యే సినిమా 'ఎవడు' మాత్రమే. మగధీరకు ఏమాత్రం తీసి పోని సినిమా ఇది, మగధీర తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎవడు లాంటి సినిమా చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టమే. అభిమానులు ఏ రేంజిలో ఊహించుకున్నా ఆ రేంజిని అందుకునే సత్తా ఉన్న సినిమా ఎవడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

సహ నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్ మాట్లాడుతూ...'ఎవడు చిత్రం చాలా బాగుంటుంది. దేవిశ్రీ ఆడియో సూపర్ హిట్టయింది. రామ్ చరన్ నటన, బన్నీ అప్రియరెన్స్ అదిరిపోతుంది. కాజల్ చేసింది చిన్న పాత్రే అయినా గుర్తుండి పోతుంది. హీరోయిన్స్ శృతి హాసన్, అమీ జాక్సన్ చాలా అందంగా ఉన్నారు. రామ్ చరణ్ డాన్స్ అదిరిపోతాయి. ' అన్నారు.

జయసుధ, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, సాయి కుమార్, అజయ్, ఎల్బీ శ్రీరామ్, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వంశీ పైడిపల్లి, వక్కతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, కథ సహకారం: హరి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, యాక్షన్ : సెల్వం, ఆర్ట్: ఆనంద్ సాయి, సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

English summary
Ram Charan's most awaited movie 'yevadu' is slated for release for Pongal, 2014. Shruthi Haasan and Amy Jackson have romanced with Ram Charan in this film. Devi Sri Prasad has scored the music of the film while Vamsi Pydipally directed this movie. The movie was produced by Dil Raju on Sri Venkateswara Creations. Area wise distributors list of the movie is as follows.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu