»   »  ఎడ్ల బళ్లు కట్టుకుని, ఆ ఊరంతా కలిసి ‘ఖైదీ నంబర్ 150’ సినిమాకి వెళ్ళారు

ఎడ్ల బళ్లు కట్టుకుని, ఆ ఊరంతా కలిసి ‘ఖైదీ నంబర్ 150’ సినిమాకి వెళ్ళారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టీవీలు గట్రా లేని పూర్వకాలం రోజుల్లో ఓ సినమా హిట్టైందంటే... ఆ సినిమా ఆడుతున్న సిటీ దగ్గరలోని గ్రామ ప్రజలు ...బళ్లు కట్టుకుని వచ్చి చూస్తూండేవారు. ఇప్పుడు రోజులు మారాయి. యుట్యూబ్ లో వీడియో సైతం మారుమూల విలేజ్ లలో వాళ్లు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే బళ్లు కట్టుకుని వచ్చి సినిమా చూసే పరిస్దితి అసలు లేదు. ప్రయాణ సాధానాలు మారాయి. కానీ చిరంజీవి తాజా 'ఖైదీ నంబర్ 150' చిత్రం చూడటానికి ఓ పల్లె జనం మాత్రం బళ్లు కట్టుకుని వచ్చి చూసారు. ఆ విశేషం ఇప్పుడు అంతటా చర్చనీయాశంగా మారింది. 

An entire village watches Khaidi No.150

వివరాల్లోకి వెళితే..గుంటూరు జిల్లాలోని తక్కెళ్ళపాడు గ్రామవాసులంతా చిరంజీవిపై తమకున్న అభిమానాన్ని చూపాలన్న ఉద్దేశంతో తమ ఎడ్లబండ్లను కట్టుకొని నారాయణపురం అనే పక్కనే ఉండే ఊర్లోని అలంకార్ థియేటర్‌కు 'ఖైదీ నంబర్ 150' చిత్రం చూడటానికి వెళ్ళారట. ఊరంతా కలిసి ఇలా ఈ కాలంలో ఒక సినిమా చూడడం అన్నది విశేషంగా చెప్పుకుంటన్నారు.

సోషల్ మీడియాలో చిరు అభిమానులు ఈ విషయాన్నే ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు. 9 ఏళ్ళ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి చిరు చేసిన 'ఖైదీ నంబర్ 150', రికార్డులన్నీ తిరగరాసి ఆయన స్టామినాను మళ్ళీ పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.


కలెక్షన్స్ విషయానికి వస్తే...గత రెండు మూడేళ్లుగా టాలీవుడ్ సినిమాల మార్కెట్ భారీగా పెరిగిపోయింది. పెద్ద స్టార్స్ సినమాలు ఇప్పుడు మినిమం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్నాయి. కిందటేడాది నుంచి ఈ పోటీ మరీ పెరిగింది. కొన్ని నెలల కిందట ఉన్న కలెక్షన్స్ రికార్డును ఓవర్ కమ్ చేసి కొత్త సినిమాలు దూసుకెడుతున్నాయి. ఈ సంక్రాంతికి రిలీజైన ఖైదీ నంబర్ 150 కలెక్షన్స్ లో న్యూ రికార్డ్ క్రియేట్ చేసిందని టాక్.

English summary
A group of villagers hailing from a small village named Takkellapadu in Dachepalli mandal, Guntur, emptied their village and headed to Alankar Theater in the nearby Narayanapuram village to watch Khaidi No.150 on Saturday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu