»   » సల్మాన్ ఖాన్ కి రేప్ విక్టిం బహిరంగ లేఖ

సల్మాన్ ఖాన్ కి రేప్ విక్టిం బహిరంగ లేఖ

Posted By:
Subscribe to Filmibeat Telugu

సల్మాన్ ఖాన్ రెండురోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. "సెట్ లో ప్రాక్టీస్ చేసిన ప్రతీసారి రేప్ కి గురైన స్ర్రీలా అనిపించేది" అంటూ సల్మాన్ చేసిన వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికే కేసులతో సతమత మైన సల్మాన్ కి ఇది ఇంకో పెద్ద దెబ్బే అనికోవాలి. ఇప్పటికీ సల్మాన్ క్షమాపనలు కూడా అడగకపోవటం.... అతని చర్యని సమర్థించే ప్రయత్నాలూ జరుగుతూండటం మరీ ధారునం.

ఈ నేపథ్యం లోనే సల్మాన్ కోసం ఒక రేప్ బాదితురాలు సల్మాన్ కి బహిరంగ లేఖ రాసారు. ఒక నాటి గ్యాంగ్ రేప్ బాదితురాలు "పద్మ శ్రీ" సునీతా కృష్ణన్ బహిరంగలేఖ పలువురిని ఆలోచింపజేస్తోంది. ఇమేజ్ ఉన్న హీరోలు బాధ్యతగా ప్రవర్తించాలని గుర్తుచేస్తోంది. గ్యాంగ్ రేప్ బాధితురాలైన సునీత..

ఆ షాక్ నుంచి తేరుకున్న తర్వాత తనలాంటి ఎందరో మహిళలను ఆదుకునేందుకు హైదరాబాద్ కేంద్రంగా ప్రజ్వల ఎన్జీవోను ప్రారంభించి, సేవలను విస్తృతం చేశారు. ఇటీవలే భారత ప్రభుత్వం ఆమెకు నాలుగో అత్యున్నత పురస్కారం 'పద్మశ్రీ' ని అందించిన సంగంతి తెలిసిందే. ఆమె రాసిన లేఖలో ఏముందంటే....

An Open Letter To Salman Khan Written By Sunitha Krishnan, A Rape Survivor

నేను అతని పేరు పలకడానికిగానీ, రాయడానికి గానీ ఇష్టపడట్లేదు. ఎందుకంటే అతణ్ని ఆ మాత్రమైనా గౌరవించడం నాకు ఇష్టంలేదు. 'నేను రేప్ కు గురయ్యాను' అంటూ అతను వెకిలిగా మాట్లాడి మాటలతో అత్యాచారంపట్ల తేలిక భావాన్ని సులువుగా వెల్లడించాడు. రూపం, అతి కొద్ది టాలెంట్ తో అతను స్టార్ గా ఎదిగాడు.

నిజానికి ఎంత గుర్తింపు వస్తే అంత బాధ్యత పెరుగుతుంది. కానీ అతను సమాజం పట్ల తన పాత్రను తేలికగా తీసుకుంటున్నాడు. వికృతబుద్ధి (పర్వర్ట్) ఉన్నవాళ్లే ఇలాంటివి వాగుతారు. ఇందుకు అతను సిగ్గుపడాలి. రేప్ ను ప్రోత్సహించకూడదని తెలిసి కూడా అతను..

సినిమాలో తాను అనుభవించిన బాధలు, గాయాలను రేప్ తో పోల్చడం దారుణం. మన చుట్టూరా రేప్ కల్చర్ ఉందన్నమాట పచ్చివాస్తవం. ఆ విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి' అంటూ సాగిన ఆ లేఖ. మనం అనాలోచితంగా అనే ఒక్క మాట ఎంతటి వేదన ఇవ్వగలదో. ఎందరిని మానసికంగా బాద పెట్ట గలదో అర్థం చేయించేలా ఉంది...

English summary
Sunitha Krishnan, a Padma Shri awardee, a social activist and a gang rape survivor wrote a scathing open letter to Salman Khan due to his comments on feeling like a ‘rape victim’ after his shooting his grueling action sequences in Sultan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu