Just In
- 10 min ago
టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!
- 26 min ago
రాజమౌళి - మహేశ్ మూవీ నుంచి షాకింగ్ న్యూస్: ఎవరూ ఊహించని పాత్రలో సూపర్ స్టార్
- 1 hr ago
టబుకు సోషల్ మీడియాలో చేదు అనుభవం: ఆ లింకుల గురించి హెచ్చరిస్తూ హీరోయిన్ ఆవేదన!
- 2 hrs ago
అడ్డంగా బుక్కైన అఖిల్ సార్థక్: మోనాల్‌తో వాట్సప్ చాట్ లీక్.. బండారం బయటపెట్టిన యాంకర్!
Don't Miss!
- Automobiles
ఒక్క రోజులో 100 నిస్సాన్ మాగ్నైట్ కార్ల డెలివరీ; ఎక్కడో తెలుసా?
- Sports
ISL 2020 21: జంషెడ్‌పూర్‌పై నార్త్ ఈస్ట్ యునైటెడ్ విజయం!!
- News
Ayodhya:రామమందిరం నిర్మాణంకు కదిలిన అక్షయ్ కుమార్..భారీగా విరాళం ఎంతంటే..?
- Finance
నేటి నుండి IRFC ఐపీవో: ధర ఎంతంటే? ఎల్లుండి నుండి ఇండిగో పేయింట్స్
- Lifestyle
ఈ ఆరోగ్యకరమైన ఆమ్లెట్లను మీరెప్పుడైనా టేస్ట్ చేశారా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మిడిల్ క్లాస్ మెలోడీస్.. అంత కష్టంగా అనిపించలేదు, ఈజీగా చేసేశాం: ఆనంద్ దేవరకొండ
ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ మొత్తానికి ఓటీటీ ప్రపంచంలో ఒక మంచి హిట్ మూవీగా నిలిచింది. థియేటర్స్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోకుండా కరోనా కష్టకాలంలో అమెజాన్ లో విడుదల అయ్యింది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన రెస్పాన్స్ కి చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూలతో వారి ఆనందాన్ని చిత్ర విశేషాలను షేర్ చేసుకుంటున్నారు. ఇక ఇటీవల ఫిల్మీబీట్ కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో ఆనంద్ దేవరకొండ కొన్ని విషయాల గురించి మాట్లాడారు.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. సినిమాలో గుంటూరు స్లాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అయితే ఆ యాసలో మాట్లాడడానికి ముందుగానే కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. వర్క్ షాప్ లోనే ముందుగా అలవాటు పడడంతో సెట్ లో కొంచెం ఈజీగా అనిపించింది. అలాగే రియల్ లొకేషన్స్ లో సినిమా చేయడం కూడా హెల్ప్ అయ్యింది. అంత కష్టంగా అనిపించలేదు. ఈ సినిమా కథకు గుంటూరు నేపథ్యం ఎంచుకోవడానికి అసలు కారణం దర్శకుడు వినోద్ ఆలోచన. అతని సొంత ప్రాంతం కూడా అదే. ఆ ప్రాంతంలో ఒక నిజమైన ఎమోషన్ ఉంటుందని చెప్పాడు.

ఇక సినిమాలో బొంబాయి చట్నీ హైలెట్ చేయడానికి కారణం ఆ ప్రాంతంలో ఎక్కువగా బొంబాయి చట్నీఫేమస్. అదొక్కటి చేయడంలో బాగా అలవాటు పడ్డాను కూడా. ఎమోషన్స్ తో పాటు సినిమాలో కామెడీ సరదాగా ఉండాలని దర్శకుడు ముందే చాలా న్యాచురల్ గా డిజైన్ చేసుకున్నాడు. మిడిల్ క్లాస్ లైఫ్ లో ఉన్న చిన్న చిన్న ఉదహరణలను కూడా చాలా చక్కగా చూపించడం జరిగింది. సినిమా చూస్తే చాలా ఈజీగా అర్ధమవుతుంది.
మా హీరోయిన్ పాత్ర కూడా చాలా న్యాచురల్ గా వచ్చింది. నిజంగా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరు దాదాపు ఒకే వయసు కలిగిన వారు. ప్రొడ్యూసర్స్ అయితే చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఏ రోజు కూడా చిన్న కండిషన్ కూడా పెట్టలేదు. ఇక ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు కూడా సినిమాలో చాలా బాగా నటించారు.. అని ఆనంద్ దేవరకొండ వివరణ ఇచ్చాడు.