»   » అనసూయ రేంజ్ ఇంతా..? రామ్‌చరణ్ సినిమాలో కీలకమైన ఫుల్ లెంత్ రోల్

అనసూయ రేంజ్ ఇంతా..? రామ్‌చరణ్ సినిమాలో కీలకమైన ఫుల్ లెంత్ రోల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బుల్లితెరపై సందడి చేస్తూ అనసూయ అందరి మనసులను గెలుచుకుంది. సినిమాల్లో వరుసగా అవకాశాలు వస్తున్నా, తనకి నచ్చిన పాత్రలని మాత్రమే చేస్తూ వెళుతోంది. అలా ఆమె సుకుమార్ - చరణ్ సినిమాలోను ఎంపికైందనే టాక్ వినిపించింది. దాంతో ఆమె ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయనుందేమో అనుకున్నారు. చిన్నపాటి పాత్ర ఏదైనా చేస్తుందేమోనని మరి కొంతమంది అనుకున్నారు.

మరో బంపర్ ఆఫర్

మరో బంపర్ ఆఫర్

బుల్లితెర నుంచి వెండితెరకు జంప్ కొట్టిన అనసూయ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. తాజాగా వస్తున్న పుకార్లు నిజమైతే ఆమె రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో చేయబోయే పాత్ర కీలకమైందనే టాక్ వినిపిస్తోంది. నిజంగా ఇది ఆమెకు పెద్ద బ్రేక్ పాయింట్ అవుతుంది.

చిన్న పాత్రలైనా

చిన్న పాత్రలైనా

ఎందుకంటే, సుకుమార్ సినిమాల్లో క్యారెక్టరైజేషన్లు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. దానికి తోడు చెర్రీతో చేస్తున్న సినిమా స్టోరీ కూడా ఎంతో విలక్షణమైంది. ఇలాంటి సినిమాలో కచ్చితంగా నటించడానికి ఆస్కారం ఉండే పాత్రలు దొరుకుతాయి. సుకుమార్ సినిమాలంటే అందులో చిన్న చిన్న పాత్రలైనా చాలా కీలకంగా ఉంటాయి.

చిన్న విషయం కాదు

చిన్న విషయం కాదు

లేడీ క్యారెక్టర్లను కూడా బలంగా చూపిస్తాడు సుక్కు. అలాంటి డైరెక్టర్ సినిమాలో అనసూయకు అవకాశమంటే చిన్న విషయం కాదు. ఇది అనసూయ వ్యతిరేకులకు జీర్ణించుకోలేని విషయమే. ఆమెకు సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. వాళ్లందరూ ఇప్పుడు ఎలా రెస్పాండవుతారో చూడాలి.

 దాదాపు హీరోయిన్‌ స్థాయి

దాదాపు హీరోయిన్‌ స్థాయి

ఈ చిత్రంలో హాట్ యాంకర్ అనసూయ చాన్స్ కొట్టేసిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో అనసూయది చిన్న పాత్ర అని కాకపోతే ఓ ఐటమ్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నాట్లు తర్వాత వార్తలు వచ్చాయి. కానీ నిజానికి ఈ సినిమాలో హీరో రాంచరణ్ కి పూర్తిగా సపోర్టింగ్ క్యారెక్టలో కనిపిస్తుందట అనసూయ. ఓ రకంగా చెప్పాలంటే.. హీరోయిన్‌ కాకున్నా దాదాపు హీరోయిన్‌ స్థాయి పాత్ర అంటూ చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

మంచి పెద్ద పాత్ర

మంచి పెద్ద పాత్ర

హాట్‌ యాంకర్‌ అనసూయకు ఈ స్థాయిలో మంచి పాత్ర ఇచ్చి చరణ్‌ అండ్‌ సుకుమార్‌ పెద్ద షాక్‌ ఇచ్చారట. ఇంత మంచి పెద్ద పాత్ర దక్కినందుకు ముద్దుగుమ్మ అనసూయ చాలా సంతోషంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో అనసూయ లిమిటెడ్‌ రోల్‌లోనే కనిపించింది. ఈ చిత్రంలో మాత్రం ఫుల్‌ లెంగ్త్‌ పాత్రలో కనిపించబోతుందన్నమాట.

English summary
Latest update is that Anasuya is now roped in for Ram Charan’s latest flick RC11 in which Ram Charan and Samantha are the lead pair and Anasuya is going to play an important role...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu