సిగ్గుగా లేదు.. అందరికీ చూపిస్తా.. మగవారికి లేనిది ఆడవాళ్ళకెందుకు..?: అనసూయ

Recommended Video

Anasuya Bharadwaj Message To All Her Followers || Filmibeat Telugu

యాంకర్ అనసూయ.. బుల్లితెర, వెండితెర, సోషల్ మీడియా అన్నింటా హావా సాగిస్తున్న మోడ్రన్ బ్యూటీ ఈమె. పెళ్ళై ఇద్దరు పిల్లలకు తల్లి అయినా ఆమె ఎప్పుడూ హాట్ హాట్ గానే కనిపిస్తుంటుంది. పైగా వృత్తి రిత్యా రంగుల ప్రపంచంలో ఉంది కాబట్టి అందరి కళ్ళు ఆమెపైనే ఉంటాయి. గ్లామర్ లుక్‌లో దర్శనమిస్తూనే ఎప్పటికప్పుడు తన భర్త, పిల్లలతో జాలీగా గడిపిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అనసూయ. అయితే ఎందుకు త్వరగా పెళ్లి చేసుకున్నావ్?, ఇలా చేయడం సరైంది కాదని ఆమెతో కొందరు అంటున్నారట. దానికి నా సమాధానం ఇదే.. అంటూ సోషల్ మీడియా వేదికగా మెసేజ్ పెట్టింది అనసూయ. ఆ వివరాలు చూస్తే..

నా వర్క్ ప్లేస్‌లో కొందరు

నా వర్క్ ప్లేస్‌లో కొందరు

మీరు ఎందుకంత తొందరగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కాకుంటేనా మీరు టాప్ హీరోయిన్ అయిపోయేవారు. పైగా భర్త, పిల్లలతో దిగిన ఫొటోలు ఎందుకలా షేర్ చేస్తావు. అలా చేస్తే మీకున్న డిమాండ్ తగ్గుతుంది.. అని నా వర్క్ ప్లేస్‌లో కొందరు వ్యక్తులు చెబుతుంటారు. అయితే సోషల్ మీడియాలో గానీ, పని ప్రదేశంలో గానీ ఇలా మాట్లాడే మీ అందరికీ సమాధానం చెప్పేందుకే మెసేజ్ అని పేర్కొంటూ సందేశం పోస్ట్ చేసింది అనసూయ.

సిగ్గుగా లేదు.. అన్నీ చూపించాలనుకుంటున్నా

నా జీవితంలో పొందినవన్నీ, సాధించినవన్నీ అందరికీ చుపించాలనేదే నా భావన. అంతేగానీ ఏదో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని నేనస్సలు సిగ్గు పడను, ఫీల్ కాను. నేను ఇప్పటివరకు పొందిన వాటన్నింటికంటే గొప్పది నా కుటుంబమే కదా!. అలాంటి కుటుంబంతో ఆనందంగా గడిపిన క్షణాలు పంచుకోవడంలో సిగ్గెందుకు? అని పేర్కొంది అనసూయ.

మగవారికి లేనిది ఆడవాళ్ళకెందుకు..?

మగవారికి లేనిది ఆడవాళ్ళకెందుకు..?

అయినా ఈ సమాజంలో మగవారికి లేని హద్దులు ఆడవారికెందుకు అని ప్రశ్నించింది అనసూయ. ఏదో ఈ విషయం మీ అందరితో పంచుకోవాలని అనిపించింది.. అందుకే చెబుతున్నా అని పేర్కొంటూ భర్త, పిల్లలతో దిగిన పిక్ షేర్ చేసింది అనసూయ. ఈ మేరకు మై స్ట్రెంగ్త్ ఈజ్ మై ఫ్యామిలీ అని ట్యాగ్ చేసి కుటుంబమంటే తనకు ఎంత ఇష్టమో చెప్పింది.

అనసూయ కెరీర్

అనసూయ కెరీర్

బుల్లితెర యాంకర్ గా బాగా ఫేమస్ అయిన అనసూయ.. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అలరించింది. ఆ తరవాత ఎఫ్ 2 సినిమా ద్వారా మెప్పించింది. వరుస సినిమా ఆఫర్స్ పట్టేస్తున్న ఈమె మరికొద్ది రోజుల్లోనే 'కథనం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X