»   » అనసూయ ఐటం కాదు... చెర్రీ కి మరదలు, స్టోరీలైన్ ఇదే

అనసూయ ఐటం కాదు... చెర్రీ కి మరదలు, స్టోరీలైన్ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

బుల్లితెరపై సందడి చేస్తూ అనసూయ అందరి మనసులను గెలుచుకుంది. సినిమాల్లో వరుసగా అవకాశాలు వస్తున్నా, తనకి నచ్చిన పాత్రలని మాత్రమే చేస్తూ వెళుతోంది. అలా ఆమె సుకుమార్ - చరణ్ సినిమాలోను ఎంపికైందనే టాక్ వినిపించింది. దాంతో ఆమె ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయనుందేమో అనుకున్నారు. చిన్నపాటి పాత్ర ఏదైనా చేస్తుందేమోనని మరి కొంతమంది అనుకున్నారు.

మొదటి నుంచి చివరి వరకు

మొదటి నుంచి చివరి వరకు

ఈ సినిమాలో అనసూయ్‌ ఐటెం సాంగ్‌లో చేయడం లేదట. అలాగే స్పెషల్‌ క్యారెక్టర్‌ కూడా కాదట. ఈ సినిమాలో అనసూయ క్యారెక్టర్‌ పెద్దదేనట. ఏ ఒక్క పాటకో, సీన్‌కో మాత్రమే పరిమితం కాకుండా సినిమా మొదటి నుంచి చివరి వరకు అనసూయ కనిపిస్తుందట. మొత్తానికి అనసూయ మంచి క్యారెక్టరే పట్టేసిందన్నమాట.

 మంచి రొమాంటిక్ రోల్‌

మంచి రొమాంటిక్ రోల్‌

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో పవన్-బన్నీలతో సినిమాలు చేసిన స్యామ్.. ఫస్ట్ టైమ్ చెర్రీతో జోడీకట్టింది. ఇక ఈ చిత్రంలో.. చరణ్ మరదలుగా మంచి రొమాంటిక్ రోల్‌లో అలరించబోతోందట హాట్ యాంకర్ అనసూయ.

ఎంతో జోష్ ఫుల్‌గా

ఎంతో జోష్ ఫుల్‌గా

'సోగ్గాడే చిన్ని నాయనా' తరహాలో.. ఈ చిత్రంలోనూ ఎంతో జోష్ ఫుల్‌గా అనసూయ రోల్ ఉండబోతోందట. చెర్రీ-సుకుమార్ సినిమా కథపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమాయకుడైన ఓ పల్లెటూరి యువకుడు పట్నంలో అడుగుపెట్టాల్సి రావడం.. అక్కడ ఓ ప్రయోగశాలలో అతడిపై ఓ ప్రయోగం జరగడం..

సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో

ఆ తర్వాత అతని జీవితంలో చోటుచేసుకొన్న పరిస్థితులు.. వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే.. చరణ్ సినిమా కథాంశంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ కథలో అనసూయ పాత్ర కూడా కీలకంగా నే ఉంటుందని టాక్ లేడీ క్యారెక్టర్లను కూడా బలంగా చూపిస్తాడు సుక్కు.

చిన్న విషయం కాదు

చిన్న విషయం కాదు

అలాంటి డైరెక్టర్ సినిమాలో అనసూయకు అవకాశమంటే చిన్న విషయం కాదు. ఇది అనసూయ వ్యతిరేకులకు జీర్ణించుకోలేని విషయమే. ఆమెకు సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. వాళ్లందరూ ఇప్పుడు ఎలా రెస్పాండవుతారో చూడాలి.

మైత్రీ మూవీ మేకర్స్

మైత్రీ మూవీ మేకర్స్

మొత్తంమీద.. రామ్ చరణ్ వైవిధ్య పాత్రలో అలరించబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మరి.. ఊరమాస్ రోల్‌తో ఫ్యాన్స్ ను అలరించడానికి సిద్ధమైన మెగాపవర్ స్టార్‌కు సుకుమార్ ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి.

English summary
It is known that there were rumours in the media that Anasuya is appearing in a cameo and she is going to dance in an item number in the film. But the fact is that Anasuya role is not just a cameo but a full length role in the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu