»   » ఎవ్వరికీ చెప్పాల్సిన పని లేదు..! అనసూయ ఇంత కోపంగా చెప్పేసింది

ఎవ్వరికీ చెప్పాల్సిన పని లేదు..! అనసూయ ఇంత కోపంగా చెప్పేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాయిధరమ్‌ తేజ్‌ 'విన్నర్‌' సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ చేసిన హాట్‌ యాంకర్‌ అనసూయను ఓ విషయంలో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అనసూయ నర్తించిన 'సూయ సూయ' సాంగ్‌ ఇటీవలె విడుదలైన విషయం తెలిసిందే. ఆ పాటలో బుద్ధుడి విగ్రహం ముందు అనసూయ డ్యాన్స్‌లు వేసింది. ఇప్పుడు దీనిపైనే నెటిజన్లు విమర్శలు చేసారు,

ఎప్పుడో 'అత్తారింటికి దారేది' సినిమాలోనే ఆమెకు 'ఐటమ్‌' ఆఫర్‌ వచ్చింది. కానీ, ఆమె దాన్ని తిరస్కరించింది. అప్పట్లో అదో పెద్ద రచ్చ అయ్యింది. అఫ్‌కోర్స్‌, అనసూయ.. 'సోగ్గాడే చిన్న నాయనా' సినిమాలో చేసిందీ ఐటమ్‌ సాంగేననుకోండి.. అది వేరే విషయం. ఇప్పుడిలా 'విన్నర్‌' సినిమాలోనూ ఐటమ్‌ సాంగ్‌ చేసేసింది అనసూయ. విన్నర్' చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయడం ద్వారా మళ్లీ హాట్ టాపిక్ అయింది.

ఇటీవల ఈ సాంగ్ యూట్యూబ్ ద్వారా విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ పాటలో నటించినందుకుగాను అనసూయ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుందట అంటూ మరికొన్ని విమర్శలు. ఇకైలాంటి వ్యాఖ్యలకు అడ్డుకట్త వేయాలనుకుందిఓ ఏమో గానీ అన్నిటికీ కలిపి ఒకే ఆన్సర్ ఇచ్చేసింది అనసూయ...

అయితే ఇప్పుడు అనసూయ ఇటువంటి క్రిటిసిజంపై తనదైన రీతిలో సెటైర్ వేసిందా అంటే అవుననే చెప్పాలి. ''నీకు నువ్వు సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది. భూమ్మీద ఉన్న ప్రతీ ఒక్కరికీ సమాధానం చెప్పక్కర్లేదు'' అంటూ తన సోషల్ మీడియా పేజీలో పేర్కొంది అనసూయ. దీని బట్టి చూస్తుంటే.. ఆ సాంగ్ వలన ఏమైనా ప్రయోజనం ఉందా లేదా.. లేదంటే ఆ పాటకు ఎందుకు నర్తించానో.. వంటి అంశాలపై అనసూయ కేవలం అనసూయకు మాత్రం ఆన్సర్ చెప్పుకుంటుంది కాని.. ఆ పాట ఎలా ఉన్నా ఎవ్వరికీ ఏమీ చెప్పదన్న మాట. తను చేసే పని తప్పో, ఒప్పో, సరైందో కాదో తనకు మాత్రమే సంబందించిన విషయం కదా...

English summary
"Be able to answer just yourself..not everyone under the sun #beUnapologeticallyYou" Anasuya Posted on Her Facebook Wall
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu