»   » నోరు జారిన యాంకర్ ఝాన్సీ, ప్రముఖుడికి అవమానం, క్షమాపణ!

నోరు జారిన యాంకర్ ఝాన్సీ, ప్రముఖుడికి అవమానం, క్షమాపణ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్ ఝాన్సీ... తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో సీనియర్ యాంకర్. బుల్లితెర తో పాటు సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలకు ఎన్నో వందల ఎపిసోడ్లకు యాంకరింగ్ చేసిన అనుభవం ఉంది. అలాంటి ఝాన్సీ ఇటీవల ఓ ఆడియో వేడుక సక్సెస్ మీట్ లో నోరు జారారు.

ఇండియాలోనే ప్రముఖుడైన సినీ నేపథ్య గాయకుడు ఏసుదాసును ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్ అయ్యాయి. 'మనలో ఒక్కడు' అనే తెలుగు సినిమా ఆడియో సక్సెస్ మీట్ తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర సభ్యులు ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.

ఈ సన్మాన సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఝాన్సీ ఏసుదాసును పొగడ్తలతో ముంచెత్తే క్రమంలో నోటికి వచ్చిన పదాలు వాడేసింది. ఈ క్రమంలో ఆమెకు తెలియకుండానే ఆయన్ను అవమానించింది.

అలా అనడం పెద్ద తప్పు

అలా అనడం పెద్ద తప్పు

ఈ కార్యక్రమంలో ఝాన్సీ మాట్లాడుతూ.... ‘అమర గాయకుడు ఏసుదాసు గారు' అంటూ సంబోధించింది. ఝాన్సీ అలా అనడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. చనిపోయిన వారి విషయంలో మాత్రమే ‘అమరుడు' అనే పదం వాడతారు.

తప్పును గుర్తించని ఝాన్సీ

తప్పును గుర్తించని ఝాన్సీ

ఆమె అలా వ్యాఖ్యానించడంతో సభలో ఉన్నవారి ఎక్స్ ప్రెషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి, కొందరు సీరియర్ గా ఫేసు పెడితే, మరికొందరు నవ్వుకున్నారు. అయితే అప్పటికీ ఝాన్సీ తన తప్పును గుర్తించలేదు. అలాగే తన వ్యాఖ్యానం కొనసాగించింది.

క్షమాపణ

క్షమాపణ

అయితే సభ ముగిసిన తర్వాత ఆమె చేసిన తప్పును కొందరు ఆమెకు వివరించినట్లు సమాచారం. వెంటనే ఈ విషయమై ఆమె ఏసుదాసును కలిసి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. చిత్ర యూనిట్ సభ్యులు కూడా కొందరు ఆమెను ఈ విషయమై మందలించినట్లు సమాచారం.

ఆడియో సక్సెస్ మీట్ డిటేల్స్

ఆడియో సక్సెస్ మీట్ డిటేల్స్

ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన `మ‌న‌లో ఒక‌డు` ఆడియో ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రంలోని పాట‌ల‌కు చ‌క్క‌టి స్పంద‌న వ‌చ్చిన సంద‌ర్భంగా సోమవారం (సెప్టెంబర్ 19న) తిరుప‌తి వేదిక‌గా ఆడియో స‌క్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.

హీరో హీరోయిన్లు

హీరో హీరోయిన్లు

యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జగన్ మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆర్పీ ప‌ట్నాయ‌క్ కథానాయకుడు కాగా, 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా న‌టించారు.

రియల్ లైఫ్ స్టోరీ

రియల్ లైఫ్ స్టోరీ

`మ‌న‌లో ఒక‌డు` మీడియా నేప‌థ్యంలో సాగుతుంది. కృష్ణ‌మూర్తి అనే సామాన్య అధ్యాప‌కుడి క‌థ ఇది. కొన్ని య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా అల్లుకున్నాం, ప్ర‌స్తుత స‌మాజంలో మీడియా పాత్ర ఏంటో మ‌నందరికీ తెలుసు. సినిమా ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

రిలీజ్ ఎప్పుడు

రిలీజ్ ఎప్పుడు

ఈ నెలాఖ‌రున చిత్రాన్ని కూడా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నామని నిర్మాతలు తెలిపారు. సాయికుమార్‌, జెమిని సురేశ్ త‌దిత‌రులు న‌టించిన ఈ సినిమాకు కెమెరామేన్: ఎస్‌.జె.సిద్ధార్థ్‌, స‌హ నిర్మాత‌లు: ఉమేశ్ గౌడ‌, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, క్రియేటివ్ హెడ్: గౌత‌మ్ ప‌ట్నాయ‌క్‌, పాట‌లు: చైత‌న్య ప్ర‌సాద్‌, వ‌న‌మాలి, పుల‌గం చిన్నారాయ‌ణ‌.

English summary
A felicitation ceremony for Yesudas was held the other day in Tirupathi and Jhansi was handed the responsibility of anchoring. The senior anchor, in her excitement to use impeccable words to praise the legendary singer, uttered ‘Amara Gayakudu Yesudas garu’, right on the stage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu