»   »  రేపిస్టులు టెర్రరిస్టులే...తీవ్రంగా స్పందించిన టీవీ యాంకర్

రేపిస్టులు టెర్రరిస్టులే...తీవ్రంగా స్పందించిన టీవీ యాంకర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Anchor Jhansi
హైదరాబాద్: రేపిస్టులపై టీవీ యాంకర్ ఝాన్సీ తీవ్రంగా స్పందించారు. అత్యాచారం అనేది టెర్రరిజం లాంటిదని ఆమె అభిప్రాయ పడ్డారు. ఇది కేవలం మహిళలపై జరుగుతున్న దాడిగా చూడొద్దని, సమాజంపై జరుగుతున్న దాడిగా పరిగణించాలని ఆమె అభిప్రాయ పడ్డారు.

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అభయపై ఇద్దరు క్యాప్ డ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై నిర్వహించి కొవ్వొత్తుల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా ముందు అబ్బాయిలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆమె అన్నారు. మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసారు.

గుంటూరు జిల్లాకు చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ గౌలిదొడ్డిలోని హాస్టల్‌లో ఉంటోంది. ఈ నెల 18వ తేదీ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఇనార్బిట్ మాల్‌లో షాపింగ్ చేసుకుని, హాస్టల్‌కు వెళ్లేందుకు నిలబడింది. ఆ సమయంలో లిఫ్ట్ ఇస్తానంటూ ఓ క్యాబ్ రావడంతో అందులో ఎక్కింది. క్యాబ్ డ్రైవర్ ఆ యువతిని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించి, తప్పించుకుని వచ్చింది.

కేసులో ఆధారాలు చాలా ఉన్నాయని సివి ఆనంద్ చెప్పారు. దర్యాప్తు సందర్భంలో చాలా లోపాలు తెలిశాయని, టోల్ గేట్ల నిర్వాహకులు వాహనం నెంబర్లు నోట్ చేయడం లేదని, పలు చోట్ల సీసీ కెమెరాలు సరిగా పని చేయడం లేదని ఆనంద్ అన్నారు. సిసిటీవి ఫుటేజ్‌లో రికార్డు అయిన కారు దృశ్యాల ఆధారంగా కేసును ఛేదించినట్లు ఆయన తెలిపారు.

English summary

 Rape is like domestic terrorism, says Anchor Jhansi. In our country, crime against women is not treated seriously by the police. Its prevention, investigation and prosecution are given low priority.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu