చలపతి-యాంకర్ రవి ఇష్యూ: విరుచుకుపడ్డ విజే శశి...... లాస్య సపోర్ట్!
ఒకప్పుడు యాంకర్ రవితో కలిసి పలు షోలు చేసిన యాంకర్ లాస్య..... చలపతిరావు, యాంకర్ రవికి వ్యతిరేకంగా విజే శశి చేసిన కామెంట్లను సమర్ధిస్తూ..... ఆ వీడియోను షేర్ చేసారు.
హైదరాబాద్: 'రారండోయ్ వేడుక చూద్దాం' చూద్దాం ఆడియో వేడుకలో మహిళలను ఉద్దేశించి సీనియర్ నటుడు చలపతి రావు నీచమైన కామెంట్స్ చేయడం, దీనికి యాంకర్ రవి సూపర్ అంటూ సమర్థించాడంటూ పెద్ద గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంపై విజే శశి ఫేస్ బుక్ లో పోస్టు చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో విజే శశి..... ఆ కామెంట్స్ చేసిన చలపతిరావుపై, సూపర్ అంటూ సమర్ధించాడంటూ యాంకర్ రవి మీద ఓ రేంజిలో విరిచుకు పడ్డారు.

వైరల్ అయిన వీడియో
విజే శశి.... వారిద్దరిపై విమర్శలు చేస్తున్న ఈ వీడియో ఫేస్ బుక్ లో వైరల్ అయింది. ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 8 లక్షల మంది వీక్షించారు.

సమర్ధిస్తూ షేర్ చేసిన లాస్య
ఒకప్పుడు యాంకర్ రవితో కలిసి పలు షోలు చేసిన యాంకర్ లాస్య..... చలపతిరావు, యాంకర్ రవికి వ్యతిరేకంగా విజే శశి చేసిన కామెంట్లను సమర్ధిస్తూ..... ఆ వీడియోను షేర్ చేసారు.
యాంకర్ రవితో లాస్యకు విబేధాలు
గతంలో యాంకర్ రవితో కలిసి లాస్య పని చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వీరి మధ్య విబేధాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లాస్య ఈ వీడియో షేర్ చేయడం హాట్ టాపిక్ అయింది.

రవితో విబేధాలపై
గతంలో ఓ ఇంటర్వ్యూలో లాస్య మాట్లాడుతూ....‘ రవితో విభేదాలు నెలకొన్నావన్న మాట నిజమే. సక్సెస్ తర్వాత ఇగో ప్రాబ్లెమ్స్ అందరిలోనూ వస్తుంటాయి. అలాగే మా మధ్య కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయి. రవికి, నాకు మధ్య అఫైర్ ఉందనే రూమర్ మీడియాలో విస్త్రతంగా ప్రచారమైంది. ఆ పుకార్లు నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందికి గురిచేసింది' అని లాస్య వివరించింది.

రవితో ఎప్పటికీ పని చేయను అని
'రవి నాకేదో జీవితాన్ని ప్రసాదించాడనే ఫీలింగ్‌తో ఉండేవాడు. ఆయన ప్రవర్తన చాలా ఇబ్బంది పెట్టింది. ఆ కారణంగానే రవితో కలిసి యాంకరింగ్ చేయకూడదని డిసైడ్ అయ్యాను. ఇక ముందు కూడా అతనితో కలిసి పనిచేయను' అని నిర్ణయించుకున్నట్లు లాస్య గతంలో ఇంటర్వ్యూలో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











