»   » మేమెంత, మా బ్రతుకులెంత.... ఏమైనా అంటే అక్కడే కొట్టేవారు: యాంకర్ రవి ఆవేదన!

మేమెంత, మా బ్రతుకులెంత.... ఏమైనా అంటే అక్కడే కొట్టేవారు: యాంకర్ రవి ఆవేదన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో చలపతి రావు మహిళలను ఉద్దేశించి చేసిన నీచమైన కామెంట్స్ వల్ల ఆయనతో పాటు యాంకర్ రవిని కూడా ఇబ్బందుల్లో నెట్టిన0 సంగతి తెలిసిందే. చలపతి రావు అన్న కామెంటును యాంకర్ రవి సూపర్ అంటూ ప్రొత్సహించాడంటూ మహిళా సంఘాలు ఆయనపై కూడా ఫిర్యాదు చేసారు.

అయితే రవి మాత్రం..... నేను చలపతిరావును ప్రోత్సహించలేదని, ఆ సమయంలో ఆడియో సమస్య ఉండటంతో ఆయన ఏమన్నారో కూడా నాకు వినిపించలేదని వాదిస్తున్నాడు. నేను సూపర్ అన్నది చలపతిరావు కామెంటుకు కాదని.... సరిగా వినిపించక పోవడంతో యాంకర్ గీతపై పంచ్ పడిందని భావించానని, అందుకే సూపర్ అన్నానని వివరణ ఇచ్చుకున్నాడు.

చర్చా కార్యక్రమంలో యాంకర్ రవి అసహనం

చర్చా కార్యక్రమంలో యాంకర్ రవి అసహనం

ఇదే విషయమై బుధవారం ఉదయం ఓ టీవీ ఛానల్ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న రవి ఈ సందర్భంగా జరిగిన వాదనలో అసహనానికి గురయ్యాడు. మధ్యలోనే నిష్క్రమించాడు.

మేము ఆయన ముందు గింజ అంత... ఏమైనా అంటే అక్కడే మమ్మల్ని కొట్టేరకం

మేము ఆయన ముందు గింజ అంత... ఏమైనా అంటే అక్కడే మమ్మల్ని కొట్టేరకం

మీకు వినిపించలేదు సరే... మహిళా యాంకర్ కు కూడా చలపతిరావు అన్న మాటలు వినిపించలేదా? అక్కడే ఆయన మాటలను ఎందుకు ప్రతిఘటించలేదు? ఎందుకు నిలదీయలేదు? అని ప్రశ్నించగా.... రవి స్పందిస్తూ ‘ఒక వేళ వినిపించినా.... చలపతిరావు గారి లాంటి సీనియర్ నటుడు నీచమైన స్టేట్మెంట్ వాడినపుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఒక యాంకర్ గా మేము ఆయన ముందు చిన్న గింజ అంత. నాగార్జున గారు ఉన్నారు, నాగ చైతన్య గారు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్లు ఉన్నారు. మేము ఏం రియాక్ట్ అవ్వాలి? చలపతి రావుగారిని ఏమైనా అంటే వచ్చి కొట్టే రకం ఆయన. ఏరా ఏం చేస్తున్నావ్ అని కొట్టేరకం. కొందరి వల్ల కార్యక్రమానికి డిస్ట్రబెన్స్ వచ్చినపుడు ఒక యాంకర్ గా కార్యక్రమాన్ని వేరే డైరెక్షన్ వైపు తీసుకెళ్లాలి. మేము ఆ పాయింట్లోనే ఉండి మాట్లాడితే ఇంకా పెంట అవుతుంది, ప్రోగ్రాం స్పాయిల్ అవుతుంది కదా' అంటూ రవి చెప్పుకొచ్చారు.

పటాస్ కోసం క్యూ కడుతున్నారు: రవి

పటాస్ కోసం క్యూ కడుతున్నారు: రవి

మీరు హోస్ట్ చేస్తున్న పటాస్ కార్యక్రమంలో చాలా బూతులు ఉంటున్నాయని యాంకర్ అనడంతో రవి మరింత ఆగ్రహానికి గురయ్యాడు. తాను హోస్ట్ చేస్తున్న 'పటాస్' అనే టీవీ ప్రోగ్రాం ఇప్పుడు 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటోందని, ఆ ప్రోగ్రాంలోకి రావడానికి యూత్ క్యూ కడతున్నారని... అందులో చెడు ఉంటే అంత రెస్పాన్స్ ఎందుకు వస్తుంది? అని రవి ప్రశ్నించారు.

మహిళలను గౌరవిస్తాను, ఎవరి శరీరాల మీద కామెంట్ చేయలేదు

మహిళలను గౌరవిస్తాను, ఎవరి శరీరాల మీద కామెంట్ చేయలేదు

నేను మహిళలను గౌరవిస్తాను, నాకు ఫ్యామిలీ ఉంది. నేను ఎవరి శరీరాలమీదా కామెంట్లు చేయలేదని.... చలపతిరావు వ్యవహారంలో నేను చేయని తప్పుకు నన్ను బలిపశువును చేస్తున్నారని యాంకర్ రవి ఆవేదన వ్యక్తం చేసారు.

సమర్ధించలేదు... నాకు అమ్మ, చెల్లి అందరూ ఉన్నారు: యాంకర్ రవి

సమర్ధించలేదు... నాకు అమ్మ, చెల్లి అందరూ ఉన్నారు: యాంకర్ రవి

యాంకరింగ్ చేసేపుడు మాకు ఎన్నో కష్టాలు ఉంటాయి అంటూ మొదలు పెట్టిన రవి... ఆ రోజు అసలు ఏం జరిగింది, తాను సూపర్ అంటూ ఎందుకు స్పందించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Anchor Ravi Explosion on Actor Chalapathi Rao 'Women only fit for sex' Comments. Checkout full details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu