»   » సమర్ధించలేదు... నాకు అమ్మ, చెల్లి అందరూ ఉన్నారు: యాంకర్ రవి

సమర్ధించలేదు... నాకు అమ్మ, చెల్లి అందరూ ఉన్నారు: యాంకర్ రవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో మహిళలను ఉద్దేశించి నటుడు చలపతిరావు అసభ్యమైన కామెంట్స్ చేయడం, దానికి యాంకర్ రవి సూపర్ అంటూ సమర్థించడంపై వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయింది.

అయితే ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని, తనకు ఏ పాపం తెలియదని..... అపుడు చలపతిరావు ఏం మాట్లాడారో నాకు వినిపించలేదని, ఆయన అంత నీచమైన కామెంట్స్ చేసారని తర్వాత తెలిసిందని యాంకర్ రవి వాపోయారు.


మాకు ఎన్నో కష్టాలు ఉంటాయి

మాకు ఎన్నో కష్టాలు ఉంటాయి

ఆ రోజు అన్న పూర్ణ సెవెన్ ఏకర్స్‌లో ‘రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. నేను గీత యాంకరింగ్ చేస్తున్నాం. యాంకర్స్‌గా మేము స్టేజి మీద ఉన్నపుడు మాకు ఎన్నో కష్టాలు ఉంటాయి. డైరెక్టర్ మాకు ఇన్ ఇయర్ పీస్ ఇస్తాడు. తాను ఏమైనా ఇన్ స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటే దాని ద్వారా మాకు చెబుతాడు. అప్పుడప్పుడు ఎదురుగా ఉన్న మానిటర్స్ సరిగా పని చేయవు. జేఆర్సీ సెంటర్ లో, శిల్పకళా వేదికలో ఎప్పుడు చేసినా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ముందు నుండి ఆడియో ప్రాబ్లం ఉంది. ఈ విషయం టెక్నికల్ టీం వాళ్లకు తెలుసు, ఆర్గనైజర్లకు తెలుసు అని యాంకర్ రవి తెలిపారు.


ఆడవాళ్లు మనశ్శాంతికి హానికరం.... వాడుకోవాలనుకున్నాం

ఆడవాళ్లు మనశ్శాంతికి హానికరం.... వాడుకోవాలనుకున్నాం

స్టార్టింగ్ నుండి ట్రైలర్లో నాగ చైతన్య గారు ఓ మాట అన్నారు. ఆడవాళ్లు మనశ్శాంతికి హానికరం అని ఓ డైలాగ్ చెప్పడం జరిగింది. టీం మొత్తం ఆ వర్డ్ ను వాడుకోవాలని, అదే ఇంటరాక్టివ్ ఎంటర్టెనింగ్ గా ఫన్ గా సాగాలని చెప్పారు. అదే పాయింట్స్ అడగటం జరుగుతుంది. వరస్ట్ పార్ట్ ఏమిటంటే... స్టేజి మీద ఇద్దరు మాట్లాడితే పక్క వాయిస్ వినిపించేది కాదు. మానిటర్స్ పీడ్ బ్యాక్ టెక్నికల్లీ ఆడియో వెరీ బ్యాడ్ గా ఉంది అని రవి తెలిపారు.


ఇద్దరి మధ్య వార్

ఇద్దరి మధ్య వార్

యాంకర్ గీత వెళ్లి చలపతిరావును అడగటం జరిగింది. చలపతిరావు ఆ ఆన్సర్ చెప్పడం జరిగింది. సాడ్ థింగ్ ఏమిటంటే అక్కడ నేను గెలుస్తున్నానా? గీత గెలుస్తుందా? అనే వార్ నడుస్తుంది. ఆవిడేమో ఆడవాళ్లు గొప్ప అనే సపోర్ట్... నేనేమో ఆడవాల్లు మనశ్శాంతికి హానికరం అని చెబుతున్నాను. చలపతిరావుగారు ఆ మాట అన్నపుడు నాకు అర్థం కాలేదు. చలపతిరావు గారు ఏదో అన్నారు. ఈమె అ.. అంది జనాలు అరిచారు. అపుడు నాకు ఆ అమ్మాయికేదో పంచ్ పడ్డది సెటైర్ వేసారని అర్థమైంది. కానీ సరిగా వినపడలేదు. కానీ యాంకర్ గా నేను ముందుకు వెళ్లాలి కాబట్టి వహ్... సూపర్ సార్ ఏం చెప్పారు అని అన్నాను... అని రవి తెలిపారు.


నాకు అమ్మ, చెల్లి అందరూ ఉన్నారు

నాకు అమ్మ, చెల్లి అందరూ ఉన్నారు

ఆయన అలాంటి మాట ఒకటి అంటారని ఊహించలేదు. అంత నీచంగా అంటాడని ఊహించలేదు. లేకుంటే నేను సూపర్ అని ఎందుకంటాను? నాకు ఇంట్లో ఫ్యామిలీ ఉంది...అమ్మ, చెల్లి అందరూ ఉన్నారు. ఆ మాట అనే సరికి వినపడలేదు కాబట్టి... సూపర్ నువ్వు వచ్చేయ్ అని అన్నాను. తర్వాత బ్రేక్ లో నేను గీత దీని గురించి మాట్లాడుకుంటున్నాం. అప్పుడే అన్నపూర్ణ స్టూడియోలో పని చేసే చునియా అనే వ్యక్తి వచ్చి ఉస్కే పాస్ జానా నహి థా యార్ అన్నాడు. అప్పటికీ నాకు చలపతిరావుగారు ఏమన్నారో తెలియదు. అసలు ఆయన ఏమన్నాడు అని అప్పుడు అడిగితే... ఓ హో ఇలా అన్నాడని తెలిసింది. అప్పుడు నేను అనుకున్నాను నిజంగానే ఆయన వద్దకు వెళ్లకుండా ఉండాల్సింది అని. గీత ఒక అమ్మాయిగా.... అబ్బా నా మీద వచ్చింది ఇది ఎంత దరిద్రంగా ఉంటుంది అని ఆమె కూడా చాలా బాధ పడింది... అని యాంకర్ రవి తెలిపారు.


ఏమీ చేయలేం కాబట్టి

ఏమీ చేయలేం కాబట్టి

ఆయనే ఏదో అనేసారు... మనం ఇపుడు ఏమీ చేయలేం కాబట్టి మిగతా పార్టు కొనసాగించాం. దీనికి చాలా మంది వైబ్ సైట్ వాళ్లు చలపతిరావు కామెంట్స్... దాని తర్వాత నేను షాక్ అయ్యే రియాక్షన్ తీసేసారు డైరెక్ట్ గా ఎడిట్ చేసి సూపర్ అని పెట్టేసారు. ఇపుడు దీన్ని అందరూ రచ్చ చేసి ఏదో సీన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు.


చలపతిరావును సమర్థించడం లేదు

చలపతిరావును సమర్థించడం లేదు

చలపతిరావును నేను ఇప్పటికీ సమర్ధించడం లేదు. చలపతిరావు గారి వాయిస్ నాకు సరిగా వినిపించి ఉంటే ఆయనకు సెటైరో, పంచ్ వేసేవాడినేమో? నేను ఆడవారిని కించపరచడం, లేదా నీచంగా మాట్లాడటం ఎప్పుడూ చేయలేదు. నా కో యాంకర్ నా బాషతోని, నా బాడీలాంగ్వేజ్ తో కంఫర్టబుల్ గా ఉంది అనుకుంటేనే నేనంతా చనువుగా ఉంటాను, నా షోలు అంత ఎంటర్టెనింగ్ గా ఉన్నాయి అని యాంకర్ రవి చెప్పుకొచ్చాడు.


నేను ఎన్ని చెప్పినా మీరు అర్థం చేసుకోరు

నేను ఎన్ని చెప్పినా మీరు అర్థం చేసుకోరు

రవిని ఇండస్ట్రీని నుండి మహిష్కరించాలనే మహిళా సంఘాల డిమాండుపై స్పందిస్తూ..... నేను ఆ మాట అనుంటే నేనే తలొంచుకుని సిగ్గుపడే వాడిని. కానీ ఆ మాట ఉద్దేశ్యం అది కాదు. నేను ఎన్ని చెప్పినా మీరు అర్థం చేసుకోరు. అంత సౌండ్ వినపడలేదారా? అందరికి వినపడ్డది నీకు వినపలేదా? అని అనుకుంటారు. కానీ స్టేజి మీద కొన్ని మానిటర్స్ ఫీడ్ బ్యాక్ అని ఉంటుంది. అదే ఆడియో ఫంక్షన్లో నాగార్జున గారు మానిటర్స్ పెంచండి, ఏమీ వినపడటం లేదు అని లైవ్ లో చెప్పడం అంతా చూసారు.


చాలా హర్టయ్యా

చాలా హర్టయ్యా

చలపతిరావుగారు అన్న మాటకి మహిళా సంఘాలు హర్ట్ అయ్యారు. ఆ ప్లేసులో ఎవరున్నా హర్ట్ అవుతారు. ఆ మాట గీత రిసీవ్ చేసుకుందని తెలిసి నేను కూడా బాగా హర్ట్ అయ్యా. నేను గీత కలిసి పటాస్ చేసాం. మహిళలు అంటే మా అమ్మే గుర్తొస్తుంది. మహిళా సంఘాలు ఇలా రియాక్ట్ అవ్వడంలో తప్పులేదు. నిజం తెలుసుకుంటే...నేను చెప్పింది నమ్మితే మీకే అర్థమవుతుంది. ఇలాంటి చీప్ స్టేట్మెంట్లు నేనెప్పుడూ చేయలేదు, ఇలాంటివి ఎంకరేజ్ కూడా చేయను. నేను చెబుతున్నది మీరు నమ్ముతారా? లేదా? మీ ఇష్టం అని యాంకర్ రవి అన్నారు.English summary
Anchor Ravi Clarifies on his Controversy over his saying 'super' after Actor Chalapathi Rao vulgar Comments on Women. He said he didn't mean it because he didn't hear properly what Chalapati Rao said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu