కమల్‌తో నటించడం కొత్త అనుభూతి.. నట శిక్షణాలయం.. ఆండ్రియా

By Rajababu

విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన విశ్వరూపం2 చిత్రం ఆగస్టు 10న రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ చిత్రంలో ఆండ్రియా జెర్మియా, పూజాకుమార్ జంటగా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో విశ్వరూపం2 ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి యూనివర్శల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌, హీరోయిన్స్‌ ఆండ్రియా, పూజా కుమార్‌, సంగీత దర్శకుడు జిబ్రాన్‌, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, ఎ.పి. ఫిల్మ్‌ చాంబర్‌ ప్రెసిడెండ్‌ వీరినాయుడు, తెలుగు ఫిలిం చాంబర్‌ కార్యదర్శి ముత్యాల రామదాసు, ప్రముఖ నిర్మాత ఠాగూర్‌ మధు, ఏషియన్‌ ఫిలింస్‌ అధినేత నారాయణ్‌ దాస్‌, టి.ఎమ్‌.టి. ఎండి సుమన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 'విశ్వరూపం-2' ఆడియో సీడిలను యూనివర్శల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌ రిలీజ్‌ చేశారు.

ఈ వేడుకలో హీరోయిన్‌ ఆండ్రియా మాట్లాడుతూ - ''విశ్వరూపం2 సినిమా ఇన్‌క్రెడిబుల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది. కమల్‌హాసన్‌గారితో వర్క్‌ చేయడం నా అదృష్టం. ఆయనొక నట శిక్షణాలయం. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. చాలా క్రమశిక్షణతో కూడుకొన్న మహావ్యక్తి.

Andrea jeremiah: Kamal Haasan is a Acting Institute

విశ్వరూపం2 చిత్రంలో మిలటరీ ఆఫీసర్‌గా నటించాను. ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్‌ చేయడం గర్వంగా ఫీలవుతున్నాను. ఈ సినిమాని ఆడియన్స్‌ తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు'' అన్నారు.

మరో హీరోయిన్‌ పూజా కుమార్‌ మాట్లాడుతూ - ''విశ్వరూపం-2' చిత్రం కోసం నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తున్నాను. కమల్‌హాసన్‌గారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం గర్వంగా భావిస్తున్నాను'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X