»   » ఏంజిల్ ఏంజిలీనా జోలీ పెళ్ళి జోధాపూర్ లో...

ఏంజిల్ ఏంజిలీనా జోలీ పెళ్ళి జోధాపూర్ లో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్వరలో హాలీవుడ్ జంట ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్‌లు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోనున్నారు. వివాహ బంధంతో తమ ప్రేమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఈ హాలీవుడ్ హాట్ కపుల్ నిర్ణయించుకుందని బ్రిటన్ మీడియా ప్రకటించింది. బ్రిటన్ నటి లిజ్ హర్లీ, అరుణ్ నాయర్‌ల వివాహం జరిగిన జోధ్‌పూర్‌లోనే ఈ జంట వివాహం చేసుకోనున్నారు. ఈ వివాహం 2011 ప్రారంభంలో వారి ఆధ్యాత్మిక గురువు రాంలాల్ సియాగ్ (84) పర్యవేక్షణలో జరగనుంది. జోధ్‌పూర్‌లోని ఆధ్యాత్మ విజ్ఞాన్ సత్సంగ్ కేంద్రానికి చెందిన రాంలాల్ సియాగ్ ఈ వార్తలపై ఎలాంటి ప్రతిస్పందనా వ్యక్తం చేయలేదు. ఆయన శిష్యులు కూడా ఎలాంటి వివరాలను వెల్లడించడానికి ఇష్టపడటం లేదు. జోలీ, పిట్‌ల బిజీ జీవితాల్లో శాంతి, సామరస్యాలను తెచ్చిన సిద్ధయోగ గురు రాంలాల్..వారిని హిందూ జీవన విధానం వైపు మళ్లించడానికి కృషి చేశారని బ్రిటన్ మీడియా తెలిపింది. రాంలాల్ వారికో మంత్రాన్ని ఉపదేశించారని..రోజు ఉదయం, సాయంత్రం జోలీ, పిట్‌లు దాన్ని మననం చేసుకోవాలని చెప్పారని పేర్కొంది. రాంలాల్ బోధనలు వారి బంధం మరింత బలపడటానికి ఉపయోగపడిందని ఈ జంట సన్నిహితులు వెల్లడించారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu