»   » ఒకపక్క బీర్ ఒకపక్క కీటకాలు ఏంజిలినాజోలీ

ఒకపక్క బీర్ ఒకపక్క కీటకాలు ఏంజిలినాజోలీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ భామ ఏంజెలీనా జోలి ఆరు నెలల తర్వాత మళ్లీ జనంలోకి వచ్చింది. బ్రాడ్‌పిట్‌తో గొడవలు కారణంగా విడాకుల కోసం గత సెప్టెంబరులో కోర్టుకెక్కిన ఈ భామ అప్పటి నుంచి పబ్లిక్‌కి దూరంగా ఉంటూ.. ఎక్కువ సమయాన్ని ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకునేందుకు కేటాయిస్తోంది.గతంలో తరచూ పిల్లలను తీసుకుని షాపింగ్‌లకు వెళ్లే ఏంజెలీనా..

బ్రాడ్‌పిట్‌తో విడాకుల అంశం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వ్యక్తిగత విషయాలపై గోప్యం వహిస్తోంది. వివాహ బంధం చెదరడంతో మానసికంగా తాను చాలా దెబ్బతిన్నానని. కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని చెప్పిన ఏంజిలినా. చాలారోజుల పాటు పబ్లిక్ లోకి రాకుండానే గడిపేసింది. అయితే ఈమధ్యే నెమ్మదిగా బయటిప్రపంచం లోకి వచ్చిన ఏంజిల్ ఒక్కసారి కీటకాలను తింటూ కనిపించి అందర్నీ షాక్ కి గురి చేసింది. ఇంతకీ ఏంజిలినా కీటకాలని ఎందుకు తిందంటే...

 సిగరెట్లను ఒక వ్యసనంగా :

సిగరెట్లను ఒక వ్యసనంగా :


బ్రాడ్‌పిట్‌తో తో తన వివాహ బందం బద్థలవడంతో ఆ వేదనను భరించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై తిండి తిప్పలు మానేసి సిగరెట్లను ఒక వ్యసనంగా మార్చుకుందని ఓ ఆంగ్ల వెబ్ సైట్ పేర్కొన్నప్పుడె ఆమె అభిమానులు చాలానే వేదనకు గురయ్యారు.

 పలు సర్జరీలు :

పలు సర్జరీలు :


క్యాన్సర్ బారినపడకుండా ఇప్పటికే ఆమె పలు సర్జరీలు చేయించుకున్న ఏంజెలీనా తిండితిప్పలు మాని రోజుకు రెండు సిగరెట్ ప్యాకెట్లు తాగుతుండటాన్ని నమ్మలేకపోతున్నామని ఆమె త్వరగ ఆ భాదనుంచి బయట పడాలనీ కోరుకున్నారు.

 ఫస్ట్‌ దే కిల్డ్‌ మై ఫాదర్‌:

ఫస్ట్‌ దే కిల్డ్‌ మై ఫాదర్‌:


అయితే ఆమె తన తాజా చిత్రం "ఫస్ట్‌ దే కిల్డ్‌ మై ఫాదర్‌" ప్రమోషన్ కోసం బయటి ప్రపంచం లోకి అడుగుపెట్టారు. చిత్రం నేపధ్యం వివరాల్లోకి వెళితే.... కంబోడియాకి చెందిన ఖ్మేర్‌ రోజ్‌ కాలంనాటి సంఘటనల ఆధారంగా తీసిన ‘ఫస్ట్‌ దే కిల్డ్‌ మై ఫాదర్‌' ఈ చిత్రానికి ఏంజెలినానే దర్శకత్వం కూడా వహించింది.

 మాడక్స్‌ :

మాడక్స్‌ :


1970లో 17లక్షల మందికిపైగా ప్రజలను బలి తీసుకున్న కంబోడియా ప్రభుత్వ దురాగతాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. 2002లో కంబోడియాకు చెందిన మాడక్స్‌ అనే అనాథ బాలుణ్ని దత్తత తీసుకుంది జోలీ. ఆ తర్వాత ఏడాది 'మాడక్స్‌ జోలీ పిట్‌(ఎమ్‌జేపీ)' ఫౌండేషన్‌ను ప్రారంభించింది.

 పేదరికం కారణం:

పేదరికం కారణం:


కంబోడియాలో పేదరికం కారణంగా ఎదురవుతున్న సమస్యలను రూపుమాపేందుకు ఈ సంస్థ కృషిచేస్తోంది. తన అనంతరం ఫౌండేషన్‌కు మాడక్స్‌ సారథ్యం వహిస్తాడని జోలీ చెప్పింది. జోలి మాట్లాడుతూ.... ''మాడక్స్‌కు ఇప్పుడు 14 ఏళ్లు. అతడు నా కొడుకు మాత్రమే కాదు కంబోడియా పుత్రుడు కూడా. ఇప్పుడిప్పుడే తన మాతృదేశం గురించి తెలుసుకుంటున్నాడు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను తనే నడిపిస్తాడని చాలా సార్లే చెప్పింది ఏంజిలినా...

 కీటకాలతో తయారైన వంటకాలు:

కీటకాలతో తయారైన వంటకాలు:


అయితే ఆసినిమా ప్రచారం లో భాగంగానే కాంబోడియా చేరుకున్న ఆమె అక్కడి ప్రజల ఆహారపుటలవాట్లను కూడా గౌరవిస్తూ..కీటకాలతో తయారైన వంటకాలను తినేసింది. పిల్లలతో కలిసి నల్లులు, కీచురాళ్లు, సాలీళ్లు, తేళ్లు వంటి కీటకాలను వండుకొని తిన్నారు. ఈ వీడియోను సోషల్‌మీడియాలో చూసిన కొందరు అభిమానులు ఆశ్చర్యపోతుంటే.. మరి కొందరు నొసలు చిట్లించారు.

 అభిమానులకి ఆనందమే:

అభిమానులకి ఆనందమే:


తమ అభిమాన నటి అలాంటివి తింటుందంటే నమ్మలేక ఎవరి బలవంతంతోనో ఆమె అలా చేస్తున్నారన్న అనుమానం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఏంజెలీనా మాట్లాడుతూ.. ఇలాంటివి తినడం కంబోడియా ఆహారపుటలవాట్లలో భాగమేనన్నారు. యుద్ధ సమయంలో ఆకలిదప్పులకు ఓర్వలేక ఇలాంటివి తినే వారు బతికారని చెప్పింది కూడా. ఏదేమైనా తమ అభిమాన నటి మళ్ళీ ఇలా బయట కనిపించటం అభిమానులకి ఆనందంగానే ఉంది.

English summary
Actress Angelina Jolie has been filmed cooking and eating spiders in Cambodia as part of promotion for her new film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu