»   » తెలుగు సినిమా నాకు జీవితాన్నిచ్చింది: బాలీవుడ్ స్టార్ హీరో, మళ్ళీ ఆ సంగతులని గుర్తుచేసాడు

తెలుగు సినిమా నాకు జీవితాన్నిచ్చింది: బాలీవుడ్ స్టార్ హీరో, మళ్ళీ ఆ సంగతులని గుర్తుచేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చాలామంది బాలీవుడ్, టాలీవుడ్ జనాలకి తెలియని విషయం ఒకటుంది. నమ్మటానికి కూడా ఆశ్చర్యం అనిపించే ఆ విషయం ఏమిటంటే బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్ తెరంగేట్రం జరిగింది బాపూ గారు తీసిన తెలుగు సినిమా "వంశవృక్షం". ఔను..! అనీల్ కపూర్ తన నటనా ప్రస్థానం మొదలు పెట్టింది తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే...

అనీల్ కపూర్

అనీల్ కపూర్

అప్పట్లో బాలీవుడ్ లో అనీల్ కపూర్ చాలా ట్రై చేసినా మొదటి అవకాశం మాత్రం టాలీవుడ్ ఇచ్చింది... అఫ్ కోర్స్ అప్పటికి టాలీవుడ్ అన్న పదం ఇంకా పుట్టలేదనుకోండి. మొత్తానికి తెలుగు సినిమా అనీల్ కపూర్ అనే ఒక నేషనల్ స్థాయి నటుడిని తొలి అడుగు వేయించింది.

కోతి కొమ్మచ్చి లో

కోతి కొమ్మచ్చి లో

చాలామందికే తెలియని విషయాన్ని ఆ మధ్య దివంగత ముళ్ళపూడి వెంకటరమణ రాసుకున్న కోతి కొమ్మచ్చి లో కూడా ప్రస్తావించారు... మళ్ళీ ఇన్నాళ్ళకి స్వయంగా అనీల్ కపూర్ ఆ రోజులని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాడు.... బాపూగారితో తన అనుభవాలని మళ్ళీ ఒక సారి గుర్తు చేసుకున్నాడీ నడివయస్సు బాలీవుడ్ స్టార్ హీరో.

తెలుగు చిత్రపరిశ్రమే జీవితాన్ని ఇచ్చింది

తెలుగు చిత్రపరిశ్రమే జీవితాన్ని ఇచ్చింది

తనకు తెలుగు చిత్రపరిశ్రమే జీవితాన్ని ఇచ్చిందని బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ గుర్తు చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్ సంస్థ డ్రీమ్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న అనిల్ కపూర్ సోమవారం ఆ సంస్థ హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు.

బాపు గారి వంశవృక్షం

బాపు గారి వంశవృక్షం

ఈ సందర్భం లోనే ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్న అనీల్ కపూర్ ముంబైలో ఏ దర్శక నిర్మాతా బ్రేక్‌ ఇవ్వని కాలంలో తెలుగు సినీపరిశ్రమ తనను నటుడ్ని చేసిందన్నారు. లెజండరీ దర్శకుడు బాపు దర్శకత్వం వహించిన వంశవృక్షం తన కెరీర్‌కు పునాది వేసిందంటూ ఆ మహాదర్శకుడు లేకపోయినప్పటికీ తనను నటుడిగా మార్చిన ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేనంటూ బాపు ని గుర్తు చేసుకున్నాడు.

హైదరాబాద్‌ తో అనుబందం

హైదరాబాద్‌ తో అనుబందం

హైదరాబాద్‌ తో అనుబందం గొప్ప ఊరట అనీ, ఇక్కడికుఇ రావటం ఎప్పుడూ ఒక గొప్ప అనుభూతినిస్తుందని చెప్పిన అనీల్ తెలుగులో సినిమా చేయడానికి తాను సిద్దం అంటూ సిగ్నల్స్ ఇచ్చాడు. బాహుబలి చిత్రం తర్వాత మొత్తం ముంబై హైదరాబాద్‌ వైపుచూస్తోందని గొప్ప టెక్నిషియన్లు ఇక్కడ ఉన్నారని.. హాలీవుడ్‌లో సైతం సత్తా చాటగలిగిన వీరితో సినిమా చేయడానికి తానూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ టాలీవుడ్ లో నటించాలన్న కోరికను బయట పెట్టాడు.

కోరికను చెప్తూనే

కోరికను చెప్తూనే

అలా తన కోరికను చెప్తూనే తాను ఓ బ్రాండ్‌కు లేదంటే ఓ దర్శకునితో అనుబంధం ఏర్పరుచుకునే ముందు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుంటానంటూ ఇంకో మెలిక పెట్టటం లో ఆంతర్యం మాత్రం ఎవరికీ అర్థం కాలేదు.. ఇంతకీ తెలుగులో నటిస్తాడా? లేక ఏదో హైదరాబాద్ వచ్చాను కాబట్టి ఓమాట చెప్పేస్తే సరిపోతుందనుకున్నాడా..?

English summary
In Hyderabad to unveil Dream India Group’s Greek style villas real estate project, Anil Kapoor said Telugu film industry has a lot of potential
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu