»   » మరో స్టార్ హీరో వారసుడు వస్తున్నాడహో!

మరో స్టార్ హీరో వారసుడు వస్తున్నాడహో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోల్లో ఒకరైన అనిల్ కపూర్ వారసత్వాన్ని పునికి పుచ్చుకుని ఆయన కూతురు సోనమ్ కపూర్ ఇప్పటికే తెరంగ్రేటం చేసింది. తాజాగా అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తర్వాతి సినిమాలో హర్షవర్ధన్ తెరంగ్రేటం చేయబోతున్నాడు.

ఇటీవలే యూఎస్ నుంచి తిరిగొచ్చిన 21 సంవత్సరాల హర్షవర్ధన్ తనకు యాక్టింగ్‌పై ఇంట్రెస్టు లేదని స్టేట్ మెంట్ ఇచ్చాడు. తనకు సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే రైటింగ్ విభాగాల్లో రాణించడంపై చాలా ఆసక్తి ఉందని తెలిపారు. కానీ ఇప్పుడు నటుడిగా మారుతున్నాడు. అనురాగ్ కశ్యప్ తర్వాతి సినిమా బాంబే వాలెట్ మూవీతో పాటు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా తర్వాతి మూవీ మీర్జా సాహిబా చిత్రంలో నటించబోతున్నాడని తెలుస్తోంది.

Harshvardhan

మీర్జా సాహిబా చిత్రంలో హర్షవర్ధన్ మీర్జా పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రకు అనిల్ కపూర్ కొడుకు అయితేనే పర్ ఫెక్టుగా సూటవుతాడని రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా భావిస్తున్నాడట. ఈ విషయమై రాకేష్ మాట్లాడుతూ...'స్క్రిప్టు ప్రకారం కొత్త పేస్ అయితేనే బెటర్. హర్షవర్ధన్ అందుకు బాగా సూటవుతాడు. అతని కళ్లలో ఇన్నోసెంట్, సాఫ్ట్ నెస్ కనిపిస్తుంది' అని తెలిపారు.

ఇటీవల విడుదలైన 'భాగ్ మిల్కా భాగ్' చిత్రంతో సక్సెస్ సాధించిన రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా ఆ వెంటనే 'మీర్జా సాహిబా' సినిమాకు సిద్ధం అయ్యాడు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ...ఈ సబ్జెక్టు నా హార్టుకు చాలా దగ్గరగా ఉంటుంది. గుల్జార్ భాయ్ మూడు సంవత్సరాల క్రితం ఈ కథ రాసారు. లవ్ ట్రాజెడీ స్టోరీ. హృదయాలను హత్తుకునేలా ఉంటుంది' అని తెలిపారు.

English summary
Anil Kapoor's son Harshvardhan is going to make his acting debut in Rakeysh Omprakash Mehra's next film called Mirza Sahiba. Harshvarshan will be seen playing the role of Mirza.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu