»   » రాజుగాడు యమడేంజర్ : రాజ్ తరుణ్ పై నిర్మాత వ్యాఖ్యలు

రాజుగాడు యమడేంజర్ : రాజ్ తరుణ్ పై నిర్మాత వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక్కొక్క సినిమాకీ నటన తోపాటు రెమ్యున రేషన్ పెంచుకుంటూ పోతున్న యువ హీరో రాజ్ ఇప్పుడున్న యంగ్ హీరోల్లో కాస్త ప్రత్యేకంగానే కనిపిస్తాడు.అందుకే రేటు పెంచినా అవకాశాలు మాత్రం తగ్గటం లేదు. రాజ్ తరుణ్ అంటే ఇప్పుడు మినిమం గ్యారెంటీ హీరో. చిన్న నిర్మాతల పెద్దహీరో.

ఇప్పుడు తరుణ్ చేతిలో నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి.. అందులో రెండు సినిమాలను అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఆ రెండింటిలో ఒకటి దర్శకుడు మారుతితో కలిసి నిర్మించనున్నాడు. మారుతి కథ . . స్క్రీన్ ప్లే అందించే ఈ సినిమాకి సంజన దర్శకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు.

Anil Sunkara Maruthi to co produce Raj Tarun s film

తాజాగా ఈ సినిమాకి 'రాజుగాడు' అనే టైటిల్ ను ఖరారు చేసి, 'యమా డేంజర్' అనే ట్యాగ్ లైన్ ను పెట్టారు. ఈ రోజున ఈ సినిమా టీమ్ సెట్స్ పైకి వెళ్లింది. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ, కథకి .. రాజ్ తరుణ్ స్టైల్ కి ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని చెప్పారు.నిజానికి రాజ్ పైకి కనిపించేటంత అమాయకుడేం కాదనీ నవ్వుతూ చెప్పారు. కథ.. స్క్రీన్ ప్లే ను సిద్ధం చేయడంలో మారుతి సిద్ధహస్తుడని అన్నారు. ఆయనతో కలిసి ఈ సినిమాను నిర్మించడం ఆనందంగా ఉందని చెప్పారు. యూత్ ఆశించే స్థాయిలో ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు.

English summary
Now as per sources Raj Tarun next Movi Tittled as "Rajugadu Yama Danger". will be co-produced by Successful film Maker Maruthi and Anil Sunkara.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu