»   »  వెండితెరపై ‘అబ్దుల్‌ కలాం’ఫస్ట్ లుక్ ఇదిగో, అవన్నీ చూపిస్తారా సినిమాలో?

వెండితెరపై ‘అబ్దుల్‌ కలాం’ఫస్ట్ లుక్ ఇదిగో, అవన్నీ చూపిస్తారా సినిమాలో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన ఏపీజే అబ్దుల్‌ కలాం జీవితం ఆధారంగా 'డాక్టర్‌ అబ్దుల్‌ కలాం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీ ఫస్ట్ లుక్ ని టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర విడుదల చేశారు. ఇస్రో పీఎస్‌ఎల్వీ-సీ 37 రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించిన నేపథ్యంలో..అనిల్ సుంకర డాక్టర్ అబ్దుల్ కలాం మూవీ ఫస్ట్ లుక్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నారు.


సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఇంగ్లిషులో రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ఈ ఫస్ట్‌లుక్‌లో.. నింగిలోకి పీఎస్‌ఎల్వీ-సీ37ను ప్రవేశపెట్టి రికార్డు బ్రేక్‌ చేసినందుకు ఇస్రోకు శుభాకాంక్షలు అని రాసి ఉంది.

ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ లు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్‌ టైన్ మెంట్ పతాకంపై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కలాం సాధించిన విజయాలు,పోక్రాన్ అణు బాంబు ప్రయోగం, సిఐఎని ఎలా ఫూల్ చేసింది, పేపర్ బాయ్ రాష్ట్రపతి స్థాయికి ఎలా ఎదిగింది మొదలైన స్పూర్తి దాయక విషయాలను చూపించనున్నారు.

అనిల్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్స్ పనులు కొనసాగుతున్నాయి. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో అబ్దుల కలాం జీవితంలోని కొన్ని వేశేషాలను పరిశీలిద్దాం.

కొబ్బరి బొండాలతో

కొబ్బరి బొండాలతో

రామేశ్వరంలో పుట్టిన అబ్దుల్ కలాం తండ్రి సముద్రతీరంలోని గవ్వలు, శంఖాల్నీ సేకరించి అమ్మేవారు. పడవ యజమాని. వారికి కొద్దిపాటి కొబ్బరితోట కూడా ఉండేది. మత విశ్వాసాలు, అధ్యాత్మిక అంశాలపై కలాం తండ్రి మక్కువతో ఉండేవారు. కొబ్బరి తోటకు వెళ్లి కొబ్బరి బొండాలతో ఇంటికి చేరుకోవడం ఆయన దినచర్యగా ఉండేది.

ఘాటైన ఊరగాయ,కొబ్బరి పచ్చడి

ఘాటైన ఊరగాయ,కొబ్బరి పచ్చడి

కలాం ఎప్పుడు తన తల్లి హాజీ అమ్మాల్‌తో కలిసే భోజనం చేసేవారు. ఆమె కలాంకు అరిటాకులో సాంబారు, అన్నం, ఘాటైన వూరగాయలు, తాజా కొబ్బరి పచ్చడి వడ్డించేది. కలాంతో కలిసి ఏడుగురు పిల్లలతో ఆ కుటుంబం ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది.

ఎక్కువ అతిధులు

ఎక్కువ అతిధులు

రామేశ్వరం మసీదు వీధిలోని సున్నం ఇటుకలతో కట్టిన విశాలమైన ఇంట్లో ప్రతిరోజు వారి కుటుంబం సభ్యుల కంటే ఎక్కువగానే అతిథులు భోజనాలు చేస్తుండేవారు. ఓ పడవలో రామేశ్వరం నుంచి ధనుష్కోటికి యాత్రికులను తీసుకువేళ్లే పడవ నడుపుతూ కలాం తండ్రి మంచి వ్యాపారం చేస్తుండేవారు.

తన బావతో స్నేహం

తన బావతో స్నేహం

ఒకసారి వచ్చిన భారీ తుపాన్‌తో ఆ పడవ తునాతునకలు అయ్యింది. అప్పటి నుంచి కలాంకు తన సోదరి భర్త అహ్మద్‌ జలాలుద్దీన్‌తో స్నేహం కుదిరింది. కొద్దిపాటి ఇంగ్లీష్‌ చదువుకున్న అతనే కలాంను బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తు ఉండేవాడు. మరో బంధువు షంషుద్దీన్ కూడా కలాంను ప్రభావితం చేశారు.

పేపరుబోయ్ గా

పేపరుబోయ్ గా

షంషుద్దీన్‌ రామేశ్వరంలో వార్తా పత్రికల పంపిణీదారు. పాఠశాలలో చదువకునే రోజుల్లోనే కలాం అతనికి సహాయకుడిగా ఉంటూ ఇంటింటికి పత్రికలు వేస్తూ మొట్టమొదటగా వేతనాన్ని సంపాదించారు.జలాలుద్దీన్, షంషుద్దీన్‌లతో గడిపిన సమయమే తన బాల్యంలో అద్వితీయతకు, తన జీవితంలో మార్పుకీ, తన సృజనాత్మకతకు కారణమని కలాం చెప్పేవారు.

ఫ్రెండ్స్ బ్రాహ్మణ కుటుంబాలే

ఫ్రెండ్స్ బ్రాహ్మణ కుటుంబాలే

కలాంకు చిన్నతనంలో రామనాథశాస్త్రి, అరవిందం, శివప్రకాశన్‌ అనే మిత్రులుండేవారు. వారంతా సనాతన బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవారైనప్పటికీ కలాంతో అరమరికలులేని స్నేహం నెరిపేవారు. రామేశ్వరం పాఠశాలలోని సైన్స్‌ ఉపాధ్యాయుడు శివసుబ్రహ్మణ్య అయ్యర్‌ కలాంను ఎంతో అభిమానించేవారు. పలుమార్లు కలాంను తన ఇంటికి తీసుకువెళ్లి ఆయనే స్వయంగా వడ్డించి భోజనం పెట్టేవారు.

మద్రాస్ ఐఐటీలో

మద్రాస్ ఐఐటీలో

శివసుబ్రహ్మణ్య అయ్యర్‌ చెప్పే పాఠాలే కలాంకు పరిశోధనపై ఆసక్తి కలిగించాయి. కలాం ప్రాథమిక విద్యాభ్యాసం రామేశ్వరంలో పూర్తి కావడంతో ఉన్నత చదువు రామనాథపురం జిల్లా కేంద్రంలోని స్క్వారాట్జ్‌ పాఠశాలలో సాగింది. జైనులాబ్దీన్‌ తన కుమారుడిని కలెక్టరుగా చూడాలనుకునేవారు. రామనాథపురం హైస్కూల్‌ ఉపాధ్యాయుడు ఇయదురై సొలొమోన్‌ కలాంకు ఆదర్శ పథ నిర్దేశకుడయ్యారు. ఉన్నత పాఠశాల విద్య తరువాత కలాం 1950లో తిరుచినాపల్లిలోని సెంట్‌ జోసెఫ్‌ కళాశాలలో చేరారు. అక్కడే బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం మద్రాస్‌ ఐఐటీలో చేరారు.

బంగారు గాజులు ని తాకట్టు పెట్టి

బంగారు గాజులు ని తాకట్టు పెట్టి

ఆ సమయంలో కలాం సోదరి జొహరా తన బంగారు గాజులు, గొలుసు కుదువపెట్టి సహాయం చేసింది. మొదటి సంవత్సరం పూర్తయ్యాక కలాం ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ను ఎంచుకున్నారు. అక్కడ ప్రొఫెసర్‌ స్పాండర్, ప్రొఫెసర్‌ కేఏవీ పండలై, ప్రొఫెసర్‌ నరసింగరావులు కలాం ఆలోచనలను తీర్చి దిద్దారు. భారత జాతి గర్వించతగ్గ శాస్త్రవేత్తగా కలాంను మలిచారు. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా అందుకున్నాక బెంగళూరులో డీఆర్డీవోలో జూనియర్‌ శాస్త్రవేత్తగా కలాం ఉద్యోగ జీవితాన్ని ప్రారరభించారు. ప్రభుత్వ కీలక సలహాదారుగానూ ఉన్నారు.

ఎంత కోపం ఉన్నా

ఎంత కోపం ఉన్నా

ఒత్తిడిలో ఉన్నా చిరునవ్వే ఆయన సమాధానం. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా, నిరంతర పరిశోధకుడిగా ఆయన ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నా తన కోపాన్ని ఎదుటివారిపై ప్రదర్శించటం ఇంతవరకు చూడలేదని ఎంతోమంది చెబుతుంటారు. సమయపాలన పాటించకపోవడం, అప్పగించిన పని పూర్తి చేయకుంటే మాత్రం యూ ఫన్నీ ఫెలో అంటారంట. అలా అన్నారంటే ఆయన చాలా కోపంలో ఉన్నారని అర్ధం.

ఇవీ కలాం ప్రత్యేకతలే

ఇవీ కలాం ప్రత్యేకతలే

దేశానికి తొలి బ్రహ్మచారి రాష్ట్రపతి. తొలి శాస్త్రవేత్త రాష్ట్రపతి. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని రాష్ట్రపతి. భారతరత్న పొందిన మూడో రాష్ట్రపతి. ఇవన్నీ కలాం ప్రత్యేకతలే. ఒక రాష్ట్రపతి ఎలా ఉండాలని ప్రజలు ఆశిస్తారో తన వేషభాషలు, నడవడిక, జీవనశైలి ద్వారా నిర్దిష్టంగా చేసి చూపారు.

వద్దన్నారు

వద్దన్నారు

రాష్ట్రపతిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి భవన్‌కు ఆయన బంధువులు అతిథులుగా వచ్చి కొన్నాళ్లు గడిపి వెళ్లగా అందుకైన ఖర్చంతా ఆయన వ్యక్తిగతంగా భరించుకున్నారు. పదవి చేపట్టాక ఒకట్రెండు సూట్‌కేసులతో రాష్ట్రపతి భవన్‌కు వచ్చిన కలాం.. మళ్లీ అంతే నిరాడంబరంగా బయటికి సాగారు. 2007లో రెండోసారి పదవిని అధిష్టించేందుకు ముందుగా అసక్తి కనబరిచినా, కొన్ని పక్షాలు మద్దతు ఇవ్వకపోవడంతో నిర్ణయం మార్చుకున్నారు.

రాజకీయవర్గాల్లో సంచలనం

రాజకీయవర్గాల్లో సంచలనం

రాష్ట్రపతి రబ్బర్ స్టాంపు కాదని తన పదవీకాలంలో రుజువు చేశారు. లాభదాయక పదవుల బిల్లును తిరస్కరించారు. ఊహించని ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌, భాగస్వామ్య వామపక్షాల్లో ఒకింత ఆందోళన కలిగించింది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ స్వయంగా వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కొన్ని విషయాల్లో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.

ఆలస్యం ఎందురు చేసారు

ఆలస్యం ఎందురు చేసారు

21 క్షమాభిక్ష పిటిషన్లలో 20ని అపరిష్కృతంగా వదిలేశారన్న విమర్శలున్నాయి. తన పదవీ కాలంలో ఒకే ఒక క్షమాభిక్ష పిటిషన్‌పై చర్య తీసుకున్నారు. అత్యాచారం కేసులో దోషి ధనంజయ ఛటర్జీ దరఖాస్తును తోసిపుచ్చారు. అఫ్జల్‌గురు క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడంపై తలెత్తిన విమర్శలకు ఆయన తర్వాత సమాధానమిస్తూ.. ప్రభుత్వం నుంచి తనకెలాంటి పత్రాలు రాలేదని చెప్పారు. 2005లో బిహార్‌లో రాష్ట్రపతి పాలన నిర్ణయానికి విదేశాల నుంచే సమ్మతి తెలుపడంపైనా విమర్శలు తలెత్తాయి.

అవే పేదల జీవితాల్లో

అవే పేదల జీవితాల్లో

హైదరాబాదులో రెండు అద్భుతమైన వైద్య ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి విజయవంతం చేశారు. అవి ఎందరే పేదల జీవితాల్లో వెలుగులు నింపాయి. ఇందులో అతి తక్కువ రకం కరోనరీ స్టంట్ ఒకటి అయితే, మరొకటి పోలియో రోగుల కోసం తయారు చేసిన తక్కువ బరువు పరికరం.

మిసైల్ మ్యాన్

మిసైల్ మ్యాన్

కలలు కనండి.. నిజం చేసుకోండి అంటూ పిల్లలకు, యువతకు అబ్దుల్ కలాం స్ఫూర్తినిచ్చారు. మిసైల్ మ్యాన్ కలాం ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. భారతరత్న సహా కలాం ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి.

English summary
Producer Anil Sunkara took up the challenge to bankroll the biopic of India's greatest scientist, former president and highly respected personality, Mr. APJ Abdul Kalam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu