»   » కొమరం పులి కోసం తిరుపతిలో జంతుబలి

కొమరం పులి కోసం తిరుపతిలో జంతుబలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాక రాక వచ్చిన తమ అభిమాన నటుడి సినిమా కొమరం పులి విజయం కావాలని కోరుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తిరుపతిలో జంతు బలికి పూనుకున్నారు. పెద్ద యెత్తున మేకలను బలి ఇచ్చారు. అయితే, తిరుపతిలోనూ కొమరం పులి విడుదల సాఫీగా జరగలేదు. బెనిఫిట్ షోకు రెవెన్యూ అధికారులు అనుమతించడం లేదు. నాలుగు ప్రదర్సనలను మాత్రమే అనుమతిస్తామని వారు చెబుతున్నారు. తిరుపతిలోని ఆరు సెంటర్లలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కాగా, పెద్ద యెత్తున బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో టికెట్ వేయి రూపాయలకు అమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu