twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంగీత దర్శకుడు అనిరుధ్ ఇంట విషాదం.. సీనియర్ డైరెక్టర్ మృతి

    |

    ఇటీవల కాలంలో సినీ రంగంలో వరుసగా విషాద సంఘనలు చోటుచేసుకుంటున్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తనువు చాలిస్తున్నారు. ఒకరి మరణ వార్త తర్వాత మరొకరి మరణం సినీ రంగాన్ని కలిచివేస్తుంది. కొందరు ఆరోగ్య సమస్యలతో కన్నుమూస్తుంటే మరికొందరు బలవన్మరణాలతో మరణిస్తున్నారు. ఈ మధ్యనే ఆగస్టు 28న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ తండ్రి మోన్ రావు కాలేయ వ్యాధితో కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తాత ఎస్వీ రమణన్ తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

    సోమవారం వేకువజామున..

    సోమవారం వేకువజామున..

    చిత్రసీమలో నెలకొంటున్న వరుస విషాద సంఘటనలు కలిచివేస్తున్నాయి. ఇప్పటికే సీనియర్​ హీరోయిన్​ మీనా భర్త విద్యా సాగర్ మరణించగా, ఆ వెంటనే ప్రముఖ సీనియర్ ఫిల్మ్​ ఎడిటర్​ గౌతమ్​ రాజు, అనంతరం నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్​, ఆర్​ నారాయణ మూర్తి తల్లి, డైరెక్టర్ బాబీ తండ్రి మోహన్ రావు మరణించారు.

    ఇక మొన్ననే ఆదివారం ప్రముఖ మలయాళ దర్శకుడు అశోకన్ తనువు చాలించిన విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఇంట విషాదం నెలకొంది. అనిరుధ్ తాత, సీనియర్ దర్శకుడు, రేడియో డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎస్వీ రమణన్ (87) సోమవారం అంటే సెప్టెంబర్ 26న వేకువజామున మరణించారు.

    వేలాది కార్యక్రమాలకు..

    వేలాది కార్యక్రమాలకు..

    వయసు భారం, పలు అనారోగ్య సమస్యల కారణంగానే ఎస్వీ రమణన్ చనిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. ఎస్వీ రమణన్ మరణంతో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

    సినీ బ్యాక్ గ్రౌండ్ కుటుంబం నుంచి వచ్చిన ఎస్వీ రమణన్.. రేడియో డబ్బింగ్ ఆర్టిస్ట్, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎస్వీ రమణన్ తండ్రి సుబ్రహ్మణ్యం.. 1930, 1940 దశకంలో పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక ఎస్వీ రమణన్ రేడియోలో వేలాది కార్యక్రమాలకు డబ్బింగ్ చెప్పారు.

    భక్తిరస డ్యాక్యుమెంటరీల చిత్రీకరణ..

    భక్తిరస డ్యాక్యుమెంటరీల చిత్రీకరణ..

    అంతేకాకుండా పలు లఘు చిత్రాలను రూపొందించారు ఎస్వీ రమణన్. భక్తిరస డ్యాక్యుమెంటరీలను చిత్రీకరించారు. 1983 సంవత్సరంలో ఊరువంగల్ మరాళం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు ఎస్వీ రమణన్. ఈ మూవీలో మహేంద్రన్, సుహాసినీ హీరోహీరోయిన్లుగా నటించారు.

    అంతేకాకుండా లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీ కాంత్ తోపాటు శివాజీ గణేశన్ అతిథి పాత్రల్లో మెరిశారు. తమిళ ఇండస్ట్రీలో రమణన్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎస్వీ రమణన్ కు ఇద్దరు కుమార్తెలు లక్ష్మీ, పార్వతి ఉన్నారు. లక్ష్మీ కుమారుడే సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్.

    ఇవాళే అంత్యక్రియలు..

    ఇవాళే అంత్యక్రియలు..

    తాత ఎస్వీ రమణన్ మరణంతో అనిరుధ్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన అంత్యక్రియనలు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో నిర్వహించనున్నట్లు కటుంబసభ్యులు పేర్కొన్నారు. ఇక తాత వారసత్వాన్ని అందుకున్న అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడో అందరికీ తెలిసిందే. తమిళం, తెలుగు భాషల్లో స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

    English summary
    Kollywood Popular Music Director Anirudh Ravichander Grand Father Senior Director And Dubbing Artist SV Ramanan Passed Away At Age 87 In Chennai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X