»   » ఆ ప్రెజర్ తట్టుకోలేకే పవన్ కళ్యాణ్ సినిమా వదులుకున్నా... ఇన్నాళ్ళకి నోరు విప్పింది

ఆ ప్రెజర్ తట్టుకోలేకే పవన్ కళ్యాణ్ సినిమా వదులుకున్నా... ఇన్నాళ్ళకి నోరు విప్పింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం కోసం ప్రముఖ హీరోయిన్లు పోటీ పడుతుంటారు. అలాంటిది కేవలం ఒకే ఒక్క సినిమాలో నటించిన, అది కూడా సక్సెస్ కానీ సినిమా... అందులో నటించిన హీరోయిన్ పవన్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

అనీషా ఆంబ్రోస్‌

అనీషా ఆంబ్రోస్‌

ఆ అమ్మాయి ‘అలియాస్‌ జానకి' అనీషా ఆంబ్రోస్‌. అయితే అసలు ఎంపిక చేసారు అన్న న్యూస్ పక్కా అందరికీ చేరక ముందే ఆమెను తప్పించేసారు అన్న న్యూస్ కూడా వచ్చేసింది. అయ్యో పాపం అనుకున్నారు. ఆ తర్వాత అనీషా ప్లేస్ లో కాజల్ ని తీసుకోవటం, ఆ సినిమా పవన్ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలవటం తెలిసిందే.

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్

'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యిందనే న్యూస్ కారణంగా బాగా పాపులరైన అనీషా... ఆ తరువాత ఈ సినిమాలో బెర్త్ కోల్పోయినా మూవీ లవర్స్ మాత్రం ఆమెను గుర్తు పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఏదో ఒక సినిమాలో అనీషాకు అవకాశాలు వస్తున్నా, ఇప్పటివరకు ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గర హిట్ మాత్రం రాలేదు.

అలియాస్ జానకి

అలియాస్ జానకి

ఆ తరువాత 'అలియాస్ జానకి', రన్ వంటి సినిమాల్లో నటించినా అవన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఇంకా ఒక సరైన సక్సెస్ కోసం చూస్తూనే ఉంది... అయితే అసలు సర్దార్ లో తాను ఎందుకు లేదో రీసెంట్ గా చెప్పేసిందీ అమ్మాయి... ఇంతకీ విషయం ఏమిటంటే...

గోపాల గోపాల

గోపాల గోపాల

‘పవన్ కళ్యాణ్ గారు అతిథి పాత్ర చేసిన ‘గోపాల గోపాల'లో నేను చిన్న క్యారెక్టర్ చేశాను. ఆ సందర్భంగా నన్ను చూసిన పవన్ గారు.. ‘సర్దార్ గబ్బర్ సింగ్' కోసం ఆడిషన్ కు రమ్మన్నారు. నేను షాకైపోయాను. ఆడిషన్ అయిపోయాక నన్ను హీరోయిన్ గా ఓకే చేశారు.

విపరీతమైన ప్రెజర్

విపరీతమైన ప్రెజర్

ఆ క్షణం నుంచి నేను విపరీతమైన ప్రెజర్ ఎదుర్కొన్నాను. అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమ్మాయిగా.. పవన్ కళ్యాణ్ గారి లాంటి పెద్ద స్టార్ సరసన సినిమా చేయబోతున్న నాకు అప్పటి పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. జనాలు నా గురించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

నిమిషానికి 200-300 మెసేజ్ లు

నిమిషానికి 200-300 మెసేజ్ లు

నా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు.. నిమిషానికి 200-300 మెసేజ్ లు వచ్చి పడేవి. ఇదంతా చూస్తే నాకు భయమేసింది. చాలా పెద్ద భారాన్ని మోస్తున్నట్లు అనిపించింది. నన్ను కథానాయికగా ఎంపిక చేశాక ఇంకే కమిట్మెంట్ ఇవ్వొద్దని చెప్పారు. దీంతో 8 నెలల పాటు ఖాళీగా ఉండిపోయాను.

ఎలాంటి బాధ అనిపించలేదు

ఎలాంటి బాధ అనిపించలేదు

ఆ సమయంలో నా మీద ఉన్న ప్రెజర్ అలాంటిలాంటిది కాదు. దాన్ని తట్టుకోవడం చాలా కష్టమైంది. అదే సమయంలో నా బదులు కాజల్ అగర్వాల్ ను తీసుకున్నట్లు చెప్పారు. ఆ పాత్ర చేయడానికి ఆమే కరెక్ట్. నాకీ విషయంలో ఎలాంటి బాధ అనిపించలేదు'' అని అనీషా తెలిపింది.

English summary
Tollywood Beauty Anisha Ambros recently Open ups about Why she out from the Project Sardar Gabbar Singh with Powerstar Pawan kalyan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu