»   » హీరోయిన్ అంజలి చెల్లికి కూడా సినీరంగంలోకి...

హీరోయిన్ అంజలి చెల్లికి కూడా సినీరంగంలోకి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా రంగంలో హీరోయిన్ రేంజికి ఎదిగి ప్రస్తుతం సంతృప్తికర స్థాయిలో కెరీర్ కొనసాగిస్తున్న తెలుగు భామల్లో హీరోయిన్ అంజలి ఒకరు. తెలుగు, తమిళంలో అమ్మడు మంచి మంచి అవకాశాలతో దూసుకెలుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో అంజలి చెల్లి కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అంజలి కజిన్ ఆరాధ్య వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

తెలుగులో మహానంది, శివరామరాజు, సింహరాశి తదితర చిత్రాల దర్శకుడు సముద్ర.. ‘వైభవం' పేరుతో తెలుగు, తమిళంలో ద్విబాషా చిత్రం ప్లాన్ చేస్తున్నాడని, కొత్త వారితో ఈ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్న ఆయన తన సినిమాలో ఆరాధ్యను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటాని, అందులో ఆరాధ్య కూడా ఒకరని తెలుస్తోంది.

Anjali cousin sister to make her silver screen debut

ప్రస్తుతం ఆరాధ్య క్లాసికల్, వెస్ట్రన్ డాన్సింగులో శిక్షణ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అంజలికి ఏ మాత్రం తీసిపోని అందచందాలు, టాలెంట్ ఆరాధ్య సొంతమని, ఆమె కూడా అంజలి స్థాయిలో తెలుగు, తమిళంలో రాణిస్తుందని అంటున్నారు.

English summary
As per the latest reports, actress Anjali will soon be introducing her cousin sister, Aaradhya, to Telugu film industry.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu