»   » హీరోయిన్ అంజలి రెమ్యూనరేషన్ వింటే షాకే...

హీరోయిన్ అంజలి రెమ్యూనరేషన్ వింటే షాకే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అంజలి... ప్రస్తుతం ఆమె టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ కాక పోయినా రెమ్యూనరేషన్ మాత్రం భారీగానే వసూలు చేస్తోందని టాక్. మీడియం, స్మాల్ బడ్జెట్ సినిమాల్లో స్పెషల్ సాంగులు, గెస్ట్ రోల్ష్ ఇలా అంజలికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. తనకు డిమాండ్ పెరగడంతో రెమ్యూనరేషన్ కూడా బారీగానే వసూలు చేస్తోంది.

నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘శంకరాభరణం' మూవీలో అంజలి గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మంచు విష్ణు ‘సరదా' మూవీలో కూడా గెస్ట్ రోల్ చేసే అవకాశం దక్కించుకుంది. తొలుత నిర్మాతలు అమలా పాల్, కేథరిన్ లాంటి హీరోయిన్లను తీసుకుందామనుకున్నారు. అయితే అంజలి అయితేనే ఆ పాత్రకు సూటవుతుందని భావించి ఆమెనే ఖరారు చేసారట.

Anjali quoted 50 lakh rupees for Sarada

ఈ సినిమాకు సైన్ చేయడానికి అంజలి రూ. 50 లక్షలు చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె షూటింగ్ 10 రోజుల్లో పూర్తవుతుందట. తాను ఇచ్చిన డేట్స్ కంటే ఒక్క రోజు ఎక్కువైనా రూ. 5 లక్షలు అదనంగా చార్జ్ చేస్తానని తేల్చి చెప్పిందట. అంటే రోజుకు రూ. 5 లక్షల చొప్పున చార్జ్ చేస్తోంది అంజలి.

రోజుకు ఐదు లక్షల రెమ్యూనరేషన్ అంటే స్టార్ హీరోయిన్లు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సోనారిక నటిస్తోంది. కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం అంజలి బాలయ్య హీరోగా నటిస్తున్న ‘డిక్టేటర్' మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

English summary
After considering various names like Amala Paul and Catherine makers of Sarada decided to go with Anjali as she would add value to the movie. Anjali quoted 50 lakh rupees for this film and didn’t agree upon any discounts on it.
Please Wait while comments are loading...