For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్యాడ్ ఇన్సిడెంట్: హీరోయిన్ అంజలి బాయ్ ఫ్రెండ్ అరెస్ట్

  By Bojja Kumar
  |

  'జర్నీ' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తమిళ నటుడు జై... కొంత కాలంగా హీరోయిన్ అంజలితో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉంటూ.... బాగా సెటిలైన తర్వాత పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

  ఇప్పటి వరకు గుడ్ బాయ్‌గా పేరున్న జై తాజాగా ఓ బ్యాడ్ ఇన్సిడెంటుతో వార్తల్లోకి ఎక్కారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కారు ప్రమాదానికి కారణమైన అతడిపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

  ఏం జరిదింది?

  ఏం జరిదింది?

  జై ఇటీవల తన కారు డ్రైవ్ చేసుకుంటూ తమిళనాడులోని మండవెల్లి నుండి అడయార్ బయల్దేరారు. అడయార్ సమపంలో అతడి కారు ఫ్లైఓవర్‌ను ఢీ కొట్టింది. సమీపంలోని శాస్త్రి నగర్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అతడిపై రెండు కేసులు నమోదు చేశారు.

  రాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్

  రాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్

  పోలీసులు అతడిపై రాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి జై కోర్టుకు కూడా హాజరు కావాల్సి ఉంటుందని తెలుస్తోంది.

  అంజలి-జై

  అంజలి-జై

  హీరోయిన్ అంజలి, తమిళ హీరో జై ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసిందే. షాపింగ్ మాల్ సినిమా సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. చాలా రోజుల వరకు రహస్యంగా, చాటు మాటుగా యవ్వారం సాగించిన ఈ ఇద్దరు కొన్ని రోజుల క్రితమే ఓపెన్ అయ్యారు. జై స్వయంగా అంజలితో ప్రేమలో ఉన్న విషయాన్ని అంగీకరించారు.

  ఆమె అంటే చాలా ప్రేమ

  ఆమె అంటే చాలా ప్రేమ

  ఇటీవల అంజలి పుట్టినరోజు సందర్భంగా .... తన ప్రేయసికి విషెస్ చెబుతూ హీరో జై సోషల్ మీడియాలో ఓ లవ్లీ పోస్టు పెట్టారు. అంజలిని ముద్దుగా అంజు అని సంభోదిస్తూ.... నువ్వు నాకు ఎంతో స్పెషల్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను నీ వెంటే ఉంటా, హ్యాపీ బర్త్ డే అంజు అంటూ ట్వీట్ చేయడం అంజలితో పాటు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

  జై ఫ్యామిలీతో అంజలి అనుబంధం

  జై ఫ్యామిలీతో అంజలి అనుబంధం

  జైతో మాత్రమే కాదు... జై ఫ్యామిలీకి కూడా అంజలి చాలా క్లోజ్. అంజలి చేసే వంట అంటే జై తండ్రికి చాలా ఇష్టమట. జై ముగ్గురు సిస్టర్స్ తో కూడా ఆమె చాలా క్లోజ్ గా ఉంటుంది. ఈ విషయాన్ని జై ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.

  ఇప్పట్లో లేదు

  ఇప్పట్లో లేదు

  పెళ్లి గురించి ఇంకా ఆలోచించలేదని... ఇండస్ట్రీలో తమకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారని, వారి పెళ్లిళ్లయ్యాక తమ పెళ్లి గురించి ఆలోచిస్తామని జై తెలిపారు. అంజలి, జై ఇద్దరూ పెళ్లి కంటే ప్రొఫెషనల్ గా ఎదిగేందుకే ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.

  English summary
  Tamil acor, Anjali's boyfriend Jai seems to be in a bad phase right now in both professional as well as personal lives. He got involved in a court case. Recently, Jai was traveling from Mandaveli to Adyar in his car. When he was near Adyar, his car hit the flyover. Sastri Nagar police immediately arrived at the location and filed two cases against this hero. The actor got arrested for rash driving on the public way and driving under the influence of alcohol.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X