‘చిత్రాంగద’గా వస్తున్న అంజలి!
హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం చిత్రాంగద. తెలుగు తమిళంలో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తెలుగు హక్కులను అభిషేక్ పిక్చర్స్ సంస్థ దక్కించుకుంది. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా ఆమె జీవితం ఎలా చిక్కుల్లో పడింది. తన ఎదురైన సవాళ్లను ఎదర్కొనే క్రమంలో ఆమె ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసింది అనేది చిత్ర కథాంశం. ఈ చిత్రంలో అంజలి ఓ పాట కూడా పాడారు. ఈ నెలాఖరున ఆడియో విడుదల చేసి డిసెంబర్ మొదటి వారంలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











