»   » అల్లు అర్జునే కాదు..అంజలి కూడా

అల్లు అర్జునే కాదు..అంజలి కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోలు పాట పాడటం ఈ మద్యకాలంలో చాలా కామన్ విషయం అయ్యిపోయింది. ప్రతీ దర్శకుడు తమ హీరో చేత ఓ పాట పాడించటానికి ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో మొదలైన ఈ ట్రెండ్ నారా రోహిత్ తాజాగా పాడటం దాకా సాగింది.

అలాగే అదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ అల్లు అర్జున్ , అంజలి కూడా పాడేసారు. ఇద్దరు కలిసి పాడేరు అనుకునేరు. అలాంటిదేమీ లేదు. అల్లు అర్జున్ తన తాజా చిత్రం సరైనోడు కోసం పాడితే.. అంజలి తన కొత్త చిత్రం చిత్రాంగద కోసం పాట అందుకుంది. సెల్వ గణేష్ సంగీత దర్శకత్వంలో ఈ పాట ను పాడించారు.

'గీతాంజలి' వంటి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం తర్వాత హీరోయిన్ అంజలి టైటిల్‌ పాత్రలో నటిస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం 'చిత్రాంగద'. శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా పతాకంపై పిల్ల జమీందార్‌ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రముఖ దర్శకుడు అశోక్‌.జి దర్శకత్వంలో గం గపట్నం శ్రీధర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Anjali turns singer for Chitrangada

దర్శకుడు అశోక్‌. జి తెలియజేస్తూ..'' గీతాంజలి తర్వాత అంజలికి పలు లేడీఓరియెంటెడ్‌ చిత్రాల ఆఫర్లు వచ్చినా..ఆమె అంగీకరించ లేదు. మా కథ విన్న వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఓ విభిన్న మైన కాన్సెఫ్‌టతో పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందు తున్న థ్రిల్లర్‌ హారర్‌ కామెడీ చిత్రమిది.

కథ డిమాండ్‌ మేరకు అమెరికాలోని ఏడు రాష్ట్రాల్లోని పలు అందమైన లోకేషన్లలో 80 శాతం షూటింగ్‌ జరిపాము. పలువురు హాలీవుడ్‌ టెక్నిషీయన్‌స కూడా ఈ చిత్రానికి పనిచేశారు. తప్పకుండా ఈ చిత్రం అంజలి కెరియర్‌లో కలకాలం గుర్తుండేలా ఉంటుంది..'' అన్నారు.

నిర్మాత గంగపట్నం శ్రీధర్‌ మాట్లాడుతూ..''గీతాంజలి తర్వాత అంజలికి పలు ఆఫర్లు వచ్చినా..దర్శకుడు అశోక్‌ చెప్పిన కథతో పాటు ఆయన ప్రతిభ మీద నమ్మకంతో అంజలి ఈ సినిమా అంగీకరించింది. ఎక్కడా రాజీపడకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తు న్నాడు.

అమెరికాతో పాటు, బెంగళూర్‌, వైజాగ్‌, హైదరాబాద్‌లలోని పలు లోకేషన్‌లలో చిత్రీకరణ జరిపాము. బ్యాలెన్స్ గా ఉన్న పాటను త్వరలోనే చిత్రీకరించనున్నాము. తప్పకుండా ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధిస్తుందని నమ్మకం ఉంది..'' అన్నారు.

English summary
Actress Anjali has also sung a song for her forthcoming movie 'Chitrangada'. She recorded the song on Saturday in Chennai under the music supervision of Selva Ganesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X