»   » దేనికైనా సై అంటున్న రవితేజ హీరోయిన్

దేనికైనా సై అంటున్న రవితేజ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆఫర్స్ లేకపోతే ఎంతకయినా దిగజారటానకి బాలీవుడ్ నుంచి దిగుమతి అవుతున్న భామలు సిద్దమవుతున్నారు.తాజాగా రవితేజ సరసన 'డాన్ శీను'లో ప్రియ పాత్రలో కనిపించిన అంజనా సుఖాని తనకు సినిమా ఆఫరే ముఖ్యమని,అందుకోసం ఎలాంటి ఎక్సపోజింగ్ కైనా రెడీ అని స్టైట్మెంట్ ఇచ్చేసింది. ఆమె మాట్లాడుతూ... "సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ తప్పనిసరని నేను అనుకోవట్లేదు. ఏదేమైనా, పాత్ర డిమాండ్ చేస్తే స్కిన్ షో చేయడానికి అభ్యంతరపెట్టను. పాత్రకి తగ్గట్లు మనం ఉండకపోతే, మనం ఓ ఫూల్ కిందే లెక్క. అప్పుడు మనం సరైన దార్లో లేనట్లే. 'డాన్ శీను', అదివరకు బాలీవుడ్ మూవీ 'సలామ్-ఎ-ఇష్క్'లో నేను షార్ట్ స్కర్టులు, స్లీవ్‌లెస్ టాప్స్ ధరించానంటే కారణం పాత్రకి అవి అవసరం కాబట్టి'' అని ఆమె తెలిపింది.

ప్రస్తుతం ఆమె రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న బెజవాడ రౌడీలు చిత్రంలో ఓ ఐటం సాంగ్ చేస్తున్నట్లు వినికిడి. ఆ విషయమై మాట్లాడుతూ.."నిజాయితీగా చెప్పాలంటే, ఐటమ్ సాంగ్స్ చేయడానికి నాకెలాంటి ఇబ్బందులూ లేవు. చక్కని ప్రొడక్షన్ విలువలతో సినిమా తీసే పెద్ద బేనర్ ఏదైనా నాకు ఐటమ్ సాంగ్ ఆఫర్ చేస్తే తప్పకుండా చేస్తా. ఆ సినిమాలో పెద్ద పెద్ద స్టార్లుంటే మరీ మంచిది'' అంది.మరి పాపం ఇంతలా ఆమె ఎదురు ఆఫర్స్ ఇస్తూంటే ఎందుకునో టాలీవుడ్ మాత్రం ఆమెకు ఆఫర్స్ ఇవ్వటం లేదు.

English summary
Anjana Sukhani has acted in Ravi Teja’s 'Don Seenu' movie as Priya . She said “If any actress comes to film industry with certain limitations regarding her costumes, then I say she is a fool, because one should mold herself to suit her character and wear costumes according to it and shouldn't ask for the character that suits her personal interests.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu