twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూ.100 కోట్లతో రూపొందించా:నాగార్జున

    By Srikanya
    |

    వంద కోట్లు పెట్టుబడి పెట్టి తమ అన్నపూర్ణ స్టూడియోని మరింత మోడ్రన్ గా మార్చామని అక్కినేని నాగార్జున చెప్పుకొచ్చారు. అలాగే తమ స్టూడియో ఇక నుంచి బాలీవుడ్,హాలీవుడ్ అవసరాలు తీర్చటం తమ టార్గెట్ అన్నారు. అందుకోసం ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసానని చెప్పుకొచ్చారు. తమ స్టూడియోను హాలీవుడ్ వారు సైతం ఆశ్చర్యపోతారని ఆయన అన్నారు. ఈ విశేషాలను తెలపటానికి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

    నాగార్జున మాటల్లోనే...మూడు దశాబ్దాల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ ఆరంభమైంది. ఇప్పుడీ స్టూడియోని ఆసియాలోనే 'మోడర్న్ స్టూడియో'గా మలచడం జరిగింది. ఇక్కడ వేలాదిమందికి ఉపాధి కూడా దొరుకుతుంది. మా తొలి టార్గెట్ బాలీవుడ్. ఈ స్టూడియోలో తాజాగా ఏర్పాటు చేసిన సౌకర్యాలు ముంబయ్‌లో అతి కొద్ది స్టూడియోస్‌లో మాత్రమే ఉన్నాయి. బాలీవుడ్ తర్వాత హాలీవుడ్‌ని టార్గెట్ చేయబోతున్నాం. అతి తక్కువ వేతనానికి కార్మికులను, జూనియర్ ఆర్టిస్టులను సమకూర్చడం జరుగుతుంది. స్టూడియో రెంట్ తక్కువగా ఉంటుంది. వచ్చే ఏడాది చివరికల్లా 45 నుంచి 50 కోట్ల రూపాయల టర్నోవర్ వస్తుందని అంచనా వేస్తున్నాం అని చెప్పారు.

    ఇక 22 ఎకరాల విస్తీర్ణం గల అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇప్పటికే ఐదు ఫ్లోర్లు ఉన్నాయి. వీటిని అత్యంత అధునాతన సౌకర్యాలతో రూపొందించారు. వంద కోట్ల రూపాయల పెట్టుబడితో, అంతర్జాతీయ స్థాయి విలువలతో ఈ స్టూడియోస్‌ని మలిచారు. ఇక ప్రస్తుతం నాగార్జున చేసిన ఢమురకం త్వరలో విడుదల కానుంది. అలాగే మరో ప్రక్క షిర్డీసాయిగా నాగార్జున ..రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో రెడీ అవుతున్నారు. ఈ రెండింటి తర్వాత ముళ్ళ పూడి వీరభద్రం దర్సకత్వంలో భాయ్ చిత్రం చేయటానకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    నాగార్జున హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో కె.అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్.ఆర్. మూవీ మేకర్స్‌పై వెంకట్ నిర్మిస్తున్న చిత్రం 'డమరుకం". భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ సమ్మర్ లోనే విడుదల కానుందని సమాచారం. ఇక ఈ చిత్రం పై నాగార్జున బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన ఈ చిత్రం గురించి చెప్తూ..'సోషియో ఫాంటసీ చిత్రం చేయాలన్న నా కోరిక ఆర్.ఆర్. మూవీ మేకర్స్ ద్వారా నెరవేరుతోంది. శ్రీనివాసరెడ్డి చెప్పిన కథ బాగా నచ్చింది. ఇందులో నాలుగు రకాల గెటప్స్‌లో కనిపిస్తాను. నా పాత్ర వెస్ట్ గోదావరి స్లాంగ్ మాట్లాడుతుంది. సరికొత్తగా, స్టయిలిష్‌గా ఉండే చిత్రం ఇది" అన్నారు.

    English summary
    Annapurna Studios, promoted by film actors Akkineni Nagarjuna and his father Nageswara Rao, has invested Rs 100 crore to develop one-lakh sq ft facility with international production and post-production facilities. “We are getting inquiries from global and Indian production houses. India has already caught the attention of international production houses as a cheaper destination. Rentals and compensation are lower,” Mr Nagarjuna, Managing Director of Annapurna Studios, said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X