»   » వామ్మో..!! హీరోయిన్ కే పదిహేను కోట్లా..!? అసలు సుందర్ 350 కోట్ల సినిమా సంగతేమిటి?

వామ్మో..!! హీరోయిన్ కే పదిహేను కోట్లా..!? అసలు సుందర్ 350 కోట్ల సినిమా సంగతేమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సుందర్ సి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీతెనాండల్ ఫిల్మ్స్ సంఘమిత్ర పేరుతో భారీ చారిత్రక చిత్రానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణపనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో జయం రవి, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించనున్నారని వార్తలొస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులతో ఈ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా కోసమే మహేష్ బాబుని హీరోగా నటింపజేయటానికి 30 కోట్ల ఆఫర్ తో వచ్చాడు సుందర్. కానీ రెండేళ్ళు వరుస డేట్లు ఇవ్వాలి అనేసరికి వెనక్కి తగ్గాడట మన ప్రిన్స్ .

బాహుబలి టాలీవుడ్ నుంచి వచ్చిన ఈ సినిమా ఒక్క సారి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఒక్క కుదుపు కుదిపింది. అన్ని వుడ్ ల సినీ జనాలూ ఉలిక్కి పడ్డారు రాజమౌళి అన్న పేరు తలవని సినిమా మనిషి లేడనే చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయిలోనూ భారత్ వంటి దేశం లో వచ్చిన ఒక ప్రాంతీయ భాషా చిత్రం పై అనేక చర్చలు చోటు చేసుకున్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కొచ్చి పడింది లెండి అదీ మనకు కాదు లెండి. తమిళ ఇందస్ట్రీకి బాహుబలి వచ్చిన దగ్గర్నుంచీ పాపం కోలీవుడ్ కి కంటినిండా నిద్ర కరువయ్యింది. ఎలా అయినా బాహుబలి ని బీట్ చేసే సినిమా తీసేయాలనే పట్టుదల తో ఉన్నారు.

Another period film for Deepika padukone to star in Sundar C’s next?

అయితే ఇప్పుడు ఇంకో హాట్ న్యూస్ ఏమిటంటే మహేష్ కి ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ కే కళ్ళు బైరు కమ్ముతుంటే ఈ సినిమా హీరోయిన్ కోసమే 15 కోట్లు ఆఫర్ చేసాడట సుందరుడు. ఇంతకీ అంత క్రేజీ హీరోయిన్ ఎవరంటే బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా సత్తా చాటుతోన్న బెంగళూరు సుందరి దీపికాపదుకునే ప్రస్తుతం ఆమె హాలీవుడ్ చిత్రం ట్రిపులెక్స్‌లో నటిస్తోంది.

ఈ సినిమాలో దీపికాపదుకునేను కథానాయికగా నటింపచేసేందుకు చిత్ర బృందం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఆమెకు 15కోట్లకు పైగా పారితోషికాన్ని ఆఫర్ చేశారని తెలిసింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా దీపికాకున్న పేరు ప్రఖ్యాతుల్ని దృష్టిలో పెట్టుకొని ఆమెకు కథానాయికగా తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే డేట్స్ సమస్య వల్ల ప్రస్తుతానికి ఈ సినిమా విషయంలో తన నిర్ణయాన్ని దీపికా వాయిదా వేసుకుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌మీదకు వెళ్లనుంది.

English summary
Latest buzz is that Deepika padukone who is bollywoood actress as turned now Hollywood, oferd 15crores to act sundar.c's next Movie "Sanghamitra"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu