Just In
- 17 min ago
మరో బిగ్ బడ్జెట్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ
- 19 min ago
‘ఆచార్య’ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్: స్పెషల్ డేను లాక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
- 33 min ago
దీప్తి సునయన అలాంటిది కాదు.. నోయల్ సెన్సేషనల్ కామెంట్స్
- 44 min ago
పవన్ కల్యాణ్ పేరిట సరికొత్త రికార్డు: ఏకంగా 90 గంటల నుంచి హవాను చూపిస్తూ సత్తా!
Don't Miss!
- News
అమానవీయం : దళిత జంటకు ఆలయ ప్రవేశం నిరాకరణ.. రూ.2.5లక్షలు జరిమానా...
- Automobiles
కస్టమర్ల ఇంటి వద్దకే డీజిల్ డెలివరీ; ఐడియా బాగుంది కదూ..!
- Lifestyle
ఈ హార్మోన్ల సమస్య ఉన్న మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం...!
- Finance
Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్‌కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
- Sports
చరిత్ర సృష్టించిన భారత్.. బ్రిస్బేన్ టెస్టులో ఘన విజయం!! టెస్ట్ సిరీస్ టీమిండియాదే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మారుతి సినిమా నుంచి ఆ హీరో తప్పుకున్నాడా? రెమ్యునరేషన్ వల్లే..
సాధారణంగా హిట్ వచ్చిన దర్శకులు ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు. మిడియమ్ సినిమాలను తెరకెక్కించే దర్శకులైతే కమిట్మెంట్స్ కారణంగా వీలైనంత త్వరగా షూటింగ్స్ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే చాలా కాలం తరువాత దర్శకుడు మారుతి కూడా తన నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో లేట్ చేయాల్సి వస్తోంది. గత ఏడాది ప్రతి రోజు పండగే సినిమాతో సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే.
అసలైతే ఈ ఏడాది మార్చ్ లోనే మరో సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్నాడు దర్శకుడు మారుతి. కానీ అనుకోకుండా కరోనా లాక్ డౌన్ వల్ల ప్లాన్ మొత్తం క్యాన్సిల్ అయ్యింది. హీరోల డేట్స్ కూడా మారిపోయాయి. దీంతో అందుబాటులో ఉంటారనుకున్న హీరోలు కూడా ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఫైనల్ గా రవితేజతో ఇటీవల ఒక ప్రాజెక్టుకి ఒకే చెప్పినట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

అయితే రెమ్యునరేషన్ విషయంలో మాస్ రాజా కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా గాసిప్స్ వచ్చాయి. క్రాక్ తో హిట్టు కొట్టి అప్పుడు తన రేంజ్ కి తగ్గట్లు పారితోషికం తీసుకుంటానని మాస్ రాజా గట్టిగానే చాలెంజ్ చేశాడని కూడా టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు మాస్ రాజా వేరే సినిమాలతో బిజీ అవుతుండడం వలన ఆ ప్రాజెక్టు చేయలేనని డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. మారుతి లాంటి దర్శకుడికి మాస్ రాజా నో చెప్పడంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.