»   »  కృష్ణ, మహేష్ బాబు, సుధీర్ వారసత్వంతో మరో నటుడు...

కృష్ణ, మహేష్ బాబు, సుధీర్ వారసత్వంతో మరో నటుడు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుని మహేష్ బాబు టాలీవుడ్లో పెద్ద నటుడిగా ఎదిగారు. ఆ తర్వాత కృష్ణ అల్లు సుధీర్ బాబు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడిప్పుడే నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరి సంగతి ఇలా ఉంటే వీరి తర్వాతి తరం కూడా సినిమాల్లోకి రాబోతోంది. ఇప్పటికే మహేష్ బాబు కొడుకు గౌతం ‘1-నేనొక్కడినే' చిత్రం ద్వారా బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా సుధీర్ బాబు తన పెద్ద కుమారుడు చరిత్ మానస్ ను బాల నటుడిగా వెండి తెరకు పరిచయం చేసారు. తాజాగా విడుదలైన మోసగాళ్లకు మెసగాడు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. సినిమా విడుదలయ్యే వరకు ఈ విషయాన్ని బయటకు పొక్కనీయలేదు.

Sudheer Babu elder son Charith Maanas

సినిమా విడుదల సందర్భంగా చరిత్ మానస్ నటిస్తున్న విషయాన్ని రివీల్ చేసారు. 'చరిత్ మాసన్ కు సినిమాలంటే చాలా ఇంట్రస్ట్, మావాడు చేసే జిమ్నాస్టిక్స్ లో కొన్నింటిని నేను కూడా చేయలేను. మామయ్య మహేష్ బాబు సినిమాలో సాంగ్స్ కు మూడు, నాలుగు గంటల పాటు అలిసిపోకుండా డాన్స్ కూడా చేస్తారు. ఇక స్కూల్ లో అన్నింటిలోనూ ఫస్టే' అని కొడుకు గురించి చెబుతూ సుధీర్ బాబు మురిసిపోతున్నారు.

‘మోసగాళ్లకు మోసగాడు' సినిమా విషయానికొస్తే...
జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా చిన్న చిన్న మోసాలు చేసి బ్రతికే చలాకీ యువకుడు క్రిష్ (సుధీర్ బాబు) . తన తెలివితేటలతో ఎదుటి వారిని మోసం చేస్తూ సరదాగా జీవితాన్ని గడిపుతూ...ఎలాంటి గోల్ లేకుండా బ్రతికే అతడి జీవితంలోకి అనుకోకుండా ఓ పెద్ద లక్ష్యం వచ్చి చేరుతుంది. అనుకోకుండా వచ్చిన ఓ సమస్య నుంచి బయటపడటానికి అతనికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. దాని కోసం అతను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న పరిస్థితులేమిటన్నదే చిత్ర ఇతివృత్తం. అదేమిటి? 12 శతాబ్దానికి చెందిన సీతారాముల విగ్రహాలతో అతనికి ఉన్న సంబంధమేమిటి? అన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది.

English summary
Another star kid is making his debut in Tollywood. This time, it’s Sudheer Babu’s elder son Charith Maanas, who will be seen in the upcoming film Mosagallaku Mosagadu.
Please Wait while comments are loading...