»   » అక్కినేని స్మృతికి స్టాంపు (ఫోటో)

అక్కినేని స్మృతికి స్టాంపు (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సీనీ నటుడు, దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు(1924-2014) పేరట పోస్టల్ స్టాంపు రిలీజ్ అయ్యింది. వివిధ రంగాలలో సేవలందించిన ప్రముఖులు, చారిత్రక ప్రదేశాల స్మృతికి చిహ్నాంగా స్టాంపులు విడుదలచేయనున్నట్లు తపాలా శాఖ ప్రతినిధి తెలిపారు. ఐదు రూపాయల స్టాంప్ విడుదల చేసారు. ఈ స్టాంప్ ని కృష్ణా యూనివర్శిటీ కౌన్సిలర్ ఉన్నం వెంకయ్య గుడివాడలో విడుదల చేసారు. కాలేజీ ఏన్సివర్శరీ పంక్షన్ లో భాగంగా ఈ పోస్టల్ స్టాంప్ ని విడుదల చేసారు.

తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒకరైన అక్కినేని కృష్ణా జిల్లా నందివాడ మండలం వెంకటరాఘవపురంలో 1924 సెప్టెంబర్ 20న వెంకటరత్నం-పుణ్ణమ్మకు జన్మించారు. 1949 ఫిబ్రవరి 18న అన్నపూర్ణను వివాహం చేసుకున్న అక్కినేనికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

ANR postage stamp

1940లో ధరపత్ని సినిమాతో అక్కినేని తెరగేట్రం చేశారు. బాలరాజు, కీలుగుర్రం, లైలామజ్నూ, దేవదాసు, దొంగరాముడు, మహాకలి కాళిదాసు, తెనాలిరామకృష్ణుడు, మాయాబజార్, బాటసారి, అనార్కలి, ప్రేమ్‌నగర్, భక్త తుకారాం, మూగమనుసులు, దసరాబుల్లోడు, ప్రేమాభిషేకంతో పాటు 256 చిత్రాల్లో అక్కినేని నటించి అశేష ప్రజాభిమానాన్ని సంపాదించారు. 240 చిత్రాల్లో అక్కినేని హీరోగా నటించారు. నవరాత్రి సినిమాలో 9 పాత్రలు పోషించిన ఏకైక తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు. మట్టి మనుషులు, ఒకే ఒక్కడు టీవీ సీరియల్స్‌లో సైతం ఏఎన్నార్ నటించారు.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మవిభూషన్, రఘుపతి వెంకయ్య, కాళిదాస్ సమ్మాన్ అవార్డు, ఎన్టీఆర్‌జాతీయ పురస్కారం, రాజ్‌కపూర్ స్మారక అవార్డు సహా పలు ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అక్కినేని వరించాయి. దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసు వారిచే డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డు అవార్డును అక్కినేని అందుకున్నారు. సుడిగుండాలు చిత్రానికి గాను ఏఎన్ఆర్‌కు మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి. అక్కినేని చివరి చిత్రం 'మనం'. కొడుకు నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలిసి నటించిన 'మనం' చిత్రం ఇంకా షూటింగ్ దశలో ఉంది.

English summary
By paying tribute to the late Legendary actor ANR Indian Postal Department has released a five rupees Postal Stamp on His name. The stamp bears his picture and it was released by Krishna University Vice Chancellor Unnam Venkaiah in Gudivada day before at College Annual Day function.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu