twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోజాకు పుత్రికోత్సాహం.. బెస్ట్ ఆదర్ కేటగిరిలో కుమార్తెకు అవార్డు!

    |

    ఒకప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో ఇచ్చిన ఎమ్మెల్యేగా ఎంపికై ఇప్పుడు ఏకంగా మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమెకు తాజాగా పుత్రికోత్సాహం కలిగింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    ప్రేమించి వివాహం

    ప్రేమించి వివాహం

    చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీ లతా రెడ్డి చిన్న వయసులోనే సినిమాలు మీద ఆసక్తి పెంచుకున్నారు. రంగస్థల, సినీ నటుడు అయిన శివప్రసాద్ ప్రోత్సాహంతో సినీ ఎంట్రీ ఇచ్చిన ఆమె తన పేరు రోజాగా మార్చుకుని సినీ అవకాశాలు దక్కించుకున్నారు. వరుసగా తెలుగు తమిళ సినిమాల్లో అనేక పాత్రలు పోషించి ఆమె టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ స్థాయికి వెళ్లారు.

    తర్వాత కాలక్రమంలో కొత్త హీరోయిన్ల ఎంట్రీ తో ఆమె కాస్త ఫేడ్ అవుట్ అవుతున్నారు అనుకున్న సమయంలోనే తనకు తమిళంలో మంచి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన సెల్వమణి అనే ఆయనను ప్రేమించి వివాహం చేసుకున్నారు రోజా.

    అరుదైన గుర్తింపు

    అరుదైన గుర్తింపు

    ఆమెకు ఇద్దరు సంతానం. అందులో కుమార్తె పేరు అన్షు మాలిక కాగా కుమారుడు పేరు కౌశిక్. అన్షు మాలిక ఇప్పటికే రైటర్ గా కొన్ని పుస్తకాలు రాయడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది. తాజాగా ఈ విషయంలోనే ఆమెకు మరో అరుదైన గుర్తింపు దక్కింది ఈ విషయంలోనే రాజా సంతోషపడుతూ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నా బంగారు తల్లి అన్షు మాలిక రాసిన ఓ పుస్తకం జీ టౌన్ మ్యాగజైన్ సౌత్ ఇండియా నుంచి బెస్ట్ ఆధర్ కేటగిరీలో ఎంపికైంది.

    జబర్దస్త్ కు గుడ్ బై

    జబర్దస్త్ కు గుడ్ బై

    ఈ పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్ నటి సాజన్ చేతుల మీదుగా అందుకుంది. కలకత్తాలోని ఒక హోటల్లో ఆమె ఇయ్యి అవార్డు అందుకున్నారు అంటూ ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు ఇక రోజా గతంలో జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించేవారు. తర్వాత కాలంలో ఆమె మంత్రిగా ఎన్నిక కావడంతో ఆమె జబర్దస్త్ కు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. జబర్దస్త్ మాత్రమే కాక సినిమాలకు కూడా ఆమె పూర్తిస్థాయిలో దూరమయ్యారు.

    పునర్వ్యవస్థీకరణలో

    పునర్వ్యవస్థీకరణలో

    ప్రస్తుతానికైతే పూర్తిగా ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తున్నానని గతంలో ప్రకటించారు. ఇక నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన రోజా తొలుత మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ ఆమెకు మొదటిసారి మంత్రి పదవి దక్కలేదు కానీ మూడేళ్ల తర్వాత జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి రోజాకు మంత్రివర్గంలో చోటు దక్కింది.

    మంచి స్పందన

    మంచి స్పందన

    ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కేంద్రంతో కూడా చర్చలు జరుపుతూ ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిలా పని చేస్తున్నారు, ఇక రోజా కుమార్తె విషయంలో ఆమె చాలా ఆనందం వ్యక్తం చేస్తూ షేర్ చేసిన పోస్ట్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.

    English summary
    anshu malika wins best author from south india award from a bollywood actress.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X