»   » ఆ నటి బెదిరించింది.. భయపెట్టింది.. పవన్‌ కల్యాణ్‌పై నమ్మకంతోనే.. అనూ ఇమ్మాన్యూయేల్

ఆ నటి బెదిరించింది.. భయపెట్టింది.. పవన్‌ కల్యాణ్‌పై నమ్మకంతోనే.. అనూ ఇమ్మాన్యూయేల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మజ్ను చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన అనూ ఇమ్మాన్యూయేల్ కొద్దికాలంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నది. రెండో చిత్రంలో గోపీచంద్, మూడో చిత్రంలో రాజ్ తరుణ్‌తో నటించిన ఈ ముద్దుగుమ్మ నాలుగో సినిమాలో ఏకంగా పవన్ కల్యాణ్ సినిమా అవకాశాన్ని సొంతం చేసుకొన్నది. దర్శకుడు త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో ఓ హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యూయేల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

త్రివిక్రమ్ నన్ను అప్రోచ్..

త్రివిక్రమ్ నన్ను అప్రోచ్..

ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మజ్ను సినిమాలో నా నటన నచ్చి తివిక్రమ్‌ నన్ను సంప్రదించారు. పెద్ద డైరెక్టర్‌, హీరో కావడంతో కథ, మిగితా విషయాల గురించి పట్టించుకోలేదు. కేవలం త్రివిక్రమ్ మీద ఉన్ననమ్మకంతోనే సినిమా చేస్తున్నాను అని అనూ చెప్పారు.

ఆమె భయపెట్టింది..

ఆమె భయపెట్టింది..

టాలీవుడ్‌లో తొలి అవకాశం వచ్చినప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ సీనియర్‌ నటి నన్ను బాగా భయపెట్టారు. టాలీవుడ్‌లో నిలదొక్కుకోవడం చాలా కష్టం. అనవసరంగా తెలుగు సినిమాలు చేసి సమయాన్ని వృథా చేసుకోకు బెదిరించారు. కానీ ఇక్కడకు వచ్చిన తరువాత తెలిసింది టాలీవుడ్ పరిశ్రమలో వ్యక్తులు మంచివాళ్లని. ఆ నటి ఎందుకు అలా చెప్పారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. తెలుగు సినిమాలు చేస్తుంటే నా మాతృభాషలో చేస్తున్నట్టే అనిపిస్తున్నది.

రాజ్ తరుణ్ సినిమా మరిచిపోలేను..

రాజ్ తరుణ్ సినిమా మరిచిపోలేను..

కిట్టుగాడున్నాడు జాగ్రత్త'లో హీరో రాజ్‌తరుణ్‌తో జతకట్టాను. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పటికీ మరిచిపోలేను. ఎందుకంటే ఆ సినిమాలో కనిపించే కుక్కల్లో చాలా మటుకు రాజ్‌తరుణ్‌ పెంపుడుకుక్కలే! వాటితో భలే కాలక్షేపం అయ్యేది. ఇక పవన్‌కల్యాణ్‌గారితో షూటింగ్‌ ఇప్పుడే మొదలయింది. ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత టెన్షన్‌గా ఫీలయ్యాను. షూటింగ్‌ ప్రారంభమయ్యాక అది తగ్గింది

అనూహ్యంగా యాక్టింగ్ అవకాశం..

అనూహ్యంగా యాక్టింగ్ అవకాశం..

మలయాళ సినీ పరిశ్రమలో మా నాన్న నిర్మాత. అయితే నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. కాకపోతే ఇంట్లో ఎప్పుడూ సినిమాల గురించి చర్చలు ఎక్కువగా నడిచేవి. తెర మీద కన్నా వెనుక ఉండాలని అనుకునేదాన్ని. యాక్టింగ్ అవకాశం అనూహ్యంగా వచ్చి పడింది.

జీవితం మలుపు తిప్పింది..

జీవితం మలుపు తిప్పింది..

సరదాగా ఓ సారి నా ఫోటోలతో కలిపి ఓ ప్రొఫైల్‌ వీడియో తయారు చేసుకున్నాను. ఆ వీడియో చూసిన మలయాళ దర్శకుడు నన్ను ‘బిజు'లో ఎంపిక చేశారు. ఆ సినిమా నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సినిమాలో నా నటన చూసి ‘మజ్నూ'లో అవకాశం వచ్చింది. ప్రస్తుతం యాక్టింగ్ కెరీర్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను అని అనూ ఇమ్మాన్యూయేల్ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

English summary
Anu Emmanuel is acting in Pawan Kalyan, Trivikram movie. Earlier she acted with Heros Nani, Gopichand, Raj Tharun. After Majnu, Oxygen, Kittu Unnadu jagratta movies, She grabs Pawan Kalyan movie. In this occassion, he revealed about her Tollywood entry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu