అను ఇమ్మాన్యుయేల్ కనిపించడం లేదట.. ఫోన్ చేసినా నో రెస్పాన్స్!
Recommended Video

Anu Emmanuel Skipped The Movie Promotions
అందాల తార అను ఇమ్మాన్యుయేల్ టాలీవుడ్‌లో కలిసి రావడం లేదు. ఆమె నటించిన చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి. గతంలో అను నటించిన కిట్టూ ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్ల పడ్డాయి. ప్రస్తుతం ఆమె నటించిన నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో జతకట్టింది. ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది.
అయితే నా పేరు సూర్య చిత్ర ప్రమోషన్‌లో అను ఇమ్మాన్యుయేల్ ఎక్కడ కనిపించకపోవడంపై సినీ వర్గాల్లో చర్చానీయాంశమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొనేలా చేసేందుకు నిర్మాతలు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదట. దాంతో నిర్మాతలు, దర్శకులు, అల్లు అర్జున్ మాత్రమే ప్రమోషన్‌లో బిజీగా కనిపిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ ఇలా వ్యవహరించడంపై చిత్ర యూనిట్ ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం.

More from Filmibeat
vakkantam vamsi naa peru surya collections naa peru surya naa illu india cinema collections naa peru surya naa illu india nagababu allu arjun anu emmanuel boman irani arjun sarja nadhiya


Click it and Unblock the Notifications











