»   » గుండు మీద ముద్దు.. ప్లేట్‌లో అన్నం ముద్ద.. డిఫరెంట్‌గా బర్త్‌డే

గుండు మీద ముద్దు.. ప్లేట్‌లో అన్నం ముద్ద.. డిఫరెంట్‌గా బర్త్‌డే

Posted By:
Subscribe to Filmibeat Telugu

విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ అపూరమైన రీతిలో తన 61వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. జన్మదినం రోజున అనుపమ్‌కు తన తల్లి ప్లేట్‌లో అన్నం వడ్డించి ప్రేమగా తినిపించారు. మరీ మరీ అడిగి బర్త్ డే విషెస్ చెప్పించుకొన్నారు.

నున్నటి గుండుపై ముద్దుపెట్టి..

నున్నగా ఉన్న గుండుపై ముద్దుపెట్టి తన ప్రేమను వ్యక్తం చేశారు. తల్లి పంచిన ప్రేమకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో అనుపమ్ ఖేర్ షేర్ చేశారు.

తల్లి తర్వాతే మిగితా ప్రపంచం

తల్లి తర్వాతే మిగితా ప్రపంచం

గత రాత్రి 12 గంటలకు స్వయంగా తన తల్లి దీవెనలు అందించారు. కానీ మధ్నాహ్నం భోజనం సమయంలో ఇంటికి వచ్చి అన్నం తినిపించారు. ఇది తల్లి ప్రేమకు నిదర్శనం. తల్లి తర్వాతే తనకు మిగితా ప్రపంచమని ఆయన వీడియోలో చెప్పారు.

పిల్లలతో అనుపమ్ సంతోషంగా..

పిల్లలతో అనుపమ్ సంతోషంగా..

అలాగే జన్మదినాన్ని పురస్కరించుకొని ముంబైలోని దిల్‌కుష్ స్కూల్‌ను సందర్శించారు. అనాధ పిల్లల శుభాకాంక్షలు అందుకోవడం కంటే సంతోషమేమి ఉంటుంది. నా ప్రపంచాన్ని పిల్లలు సుసంపన్నం చేశారు.

తాప్సీ చేతుల మీదుగా కేక్ కట్

అనుపమ్ ఖేర్ జన్మదిన వేడుకలను నామ్ షబానా షూటింగ్‌లో ఘనంగా జరిగాయి. తాప్సీ చిత్ర యూనిట్ సభ్యులు అనుపమ్ ఖేర్‌తో కేక్ కట్ చేయించారు. ఆయనతో కలిసి కేక్ తినడం గొప్పగా ఉంది అని తాప్సీ ట్వీట్ చేశారు.

English summary
Anupam Kher is celebrating his 61st birthday today. The actor has played a quite a long innings in Bollywood. He spends his time with his mother across the dinning table.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu