»   » పవన్‌ కల్యాణ్‌ ఇంటర్వూ : ఊహించని అంశాలు..హైలెట్స్

పవన్‌ కల్యాణ్‌ ఇంటర్వూ : ఊహించని అంశాలు..హైలెట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పవన్ కళ్యాణ్ ఇంటర్వూలకు చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన ఇంటర్వూలు సినిమాలు రిలీజప్పుడు అదీ రేర్ గా ఇస్తూంటారు. రీసెంట్ గా ఆన్‌లైన్ వీడియో ఛానల్ రిపోర్టర్, అలాగే ప్రఖ్యాత జర్నలిస్ట్ అనుపమ చోప్రా ....ఫిల్మ్‌ కాంపానియన్‌ కోసం పవన్‌ కల్యాణ్‌ను ఇంటర్వ్యూ చేయడానికి హైదరాబాద్‌ వచ్చారు.

Also Read: 'సర్దార్' ఇంట్రడక్షన్ సీన్ ఇదేనా! (లీక్ ఫోటోస్)


పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఆదర్శనీయమైన వ్యక్తని రచయిత, జర్నలిస్టు అనుపమ చోప్రా అన్నారు ఇంటర్యూ చేసిన అనంతరం ఆయనతో దిగిన ఒక ఫొటోను ఆమె ట్విట్టర్‌ ఖాతా ద్వారా పంచుకుంటూ... పవర్‌స్టార్‌పై తన అభిప్రాయాన్ని ట్వీట్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌తో మాట్లాడడం చక్కటి అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. ఆయన అందమైన, ఆదర్శనీయమైన వ్యక్తి అని కొనియాడారు.ఆమె ఈ ఇంటర్వూకు వెళ్లేముందు పవన్ అభిమానుల నుంచి ప్రశ్నలను సైతం ఆహ్వానించింది. రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలంలో పవన్ ఇచ్చిన ఇంటర్వూలు వేళ్లమీద లెక్క కట్టవచ్చు. ఆయన పొలిటికల్ కెరీర్ మొదలైన తర్వాత అయినా మీడియాతో తరుచుగా మాట్లాడాతారేమో అని చాలా మంది భావించారు. అయితే అదీ జరగలేదు. దాంతో ఈ ఇంటర్వూకు చాలా ప్రయారిటీ వచ్చింది.


పవన్ ఏం మాట్లాడారు. సినిమాల గురించా లేక రాజకీయాల గురించా, సినిమాల గురించి అయితే రిటైర్మెంట్ విషయమై వస్తున్న రూమర్స్ కు చెక్ చెప్తారా..అదే రాజకీయాలతే ఆయన పార్టీ వచ్చే ఎలక్షన్స్ కోసం ప్లానింగ్ ఏమిటి వంటి ఎన్నో విషయాలు ఈ ఇంటర్వూలో చర్చకు వస్తాయని భావిస్తున్నారు.


పవన్ ని ఇంటర్వ్యూలో హైలెట్స్ ఇవే...


సినిమాలు మానేస్తా

"సమాజంలో జరుగుతోన్న అన్యాయాలపై ఏ విధంగా ఫైట్ చేస్తున్నానో, ఇక నుండి నిజం జీవితంలోనూ నేను అలాగే ఫైట్ చేయబోతున్నాను. రాజకీయాల్లోకి ఇప్పటికే నేను ఎంట్రీ ఇచ్చాను. త్వరలోనే సినిమాలను పూర్తిగా మానేసి రాజకీయాలకే పరిమితం కావాలని చూస్తున్నా" అంటూ పవన్ సంచలన కామెంట్స్ చేశాడు.


నాలెడ్జ్ పెంచుకుంటూ.


షూటింగ్ లేకపోతే ఇంట్లో ఖాళీగా కూర్చోను... తీరిక లేకుండా నాలెడ్జ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటా.


గౌరవం ఉంది

గౌరవం ఉంది

చట్టం, న్యాయం అంటే గౌరవం ఉందని, నేను యాక్సిడెంటల్‌గా యాక్టర్ అయ్యానంటూ మనసులోని మాట చెప్పాడు.రైతు అవ్వాలనుకున్నా..

యాక్చువల్‌గా తనకు వ్యవసాయం చేయాలని ఉండేదని చెప్పుకొచ్చారు.ఫాలో కాలేకపోతున్నా

సినిమాల్లో చెప్పే భారీ డైలాగులు రియల్ లైఫ్‌లో ఫాలో కాలేకపోతున్నాని ఫీలవుతుంటాను.అందుకే పాలిటిక్స్

ఏదైనా చేయాలి... ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే పాలిటిక్స్‌లోకి ఎంటరయ్యాను


సర్వస్వం కాదు

సినిమాలే నాకు సర్వస్వం కాదు... వాటికంటే జీవితం ముఖ్యం.నెగిటివ్ షేడ్స్

నేను నిజయితీగా ఉంటాను.. రియల్ లైఫ్‌లో ప్రతివ్యక్తికీ కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉంటాయి.బట్ ..

నా వరకు బ్యాడ్ గై లా ఉండలేనని వెల్లడించాడు. బయటకు ఒకలా, లోపల మరోవిధంగా ఉండగలిగేంత గొప్పయాక్టర్ని కాదన్నాడు.అందుకే ఒపీనియన్

ఒక పని గురించి నిజమైన అభిప్రాయం రాబట్టడం చాలా కష్టం.. ఏ పని చేసినా పదిమంది ఓపీనియన్స్ తీసుకుంటానని తెలిపాడు.


అది తప్పు

చాలామందికి పెద్దగా కష్టపడననే అభిప్రాయ ఉంది... కానీ అది నిజం కాదుకష్టమైన పని

ఇండియాలో సినిమాలు చేయడం ఆడియెన్స్‌ను మెప్పించడం చాలా కష్టమైన పని అన్నాడు పవన్.


నాకోసం చేస్తా

నా అవసరాలు తీరాలంటే.. సినిమాలు చేయాలి. నా కోసం చేస్తానన్నాడు.రిటైర్ అవుతా

రిటైర్ అవుతా

అలాగే కొన్నేళ్లకు సినిమాల నుంచి రిటైరవుతానని బయటపెట్టాడు.రైటర్ గా కంటిన్యూ అవుతా

మూవీలు మానేసినా, రైటర్‌గా మాత్రం కంటిన్యూ అవుతానన్నాడు. రాయడం తనకు ఇష్టమని అన్నారు.పండోరా భాక్స్

నా దృష్టిలో రాజకీయాలు పండోరా బాక్స్ లాంటివని ఒక్కముక్కలో తేల్చేశాడు.


ఆపవేను

నాలోని ఇన్నర్ వాయిస్‌ను బయటకు రాకుండా ఆపలేను.సెలవే

సెలవే

అయితే ఒక్క విషయం. ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఇక చిత్రాలకు సెలవే!అదే నా మంత్రం

నీ పని నువ్వు చేయ్యి...పని అయిపోగానే వెళ్లిపో అనేది నా మంత్రం. అంతకుమించి తానేమీ ఆలోచించనంటూ ముగించాడు పవన్ కళ్యాణ్.ప్రస్తుతం

ప్రస్తుతం

పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. ఈ సినిమా కి అన్నీ తానే అన్నట్లుగా రాత్రింబవళ్లూ పనిచేస్తున్నారు.
English summary
Popular Journalist and Film Critic Anupama Chopra take an Interview with Pawan Kalyan and watch here exclusively. Anupama Chopra tweeted:"What an amazing experience! The #PowerStar PawanKalyan is both gracious & inspiring."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu