»   » పవన్ కళ్యాణ్ ను ఇంటర్వ్యూ చేయబోతున్న అనుపమ చోప్రా

పవన్ కళ్యాణ్ ను ఇంటర్వ్యూ చేయబోతున్న అనుపమ చోప్రా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీడియాకు, మీడియా ఇంటర్వ్యూలకు వీలైనంత దూరంగా ఉంటారు. దాదాపు రెండు దశాబ్దాల ఆయన సినీ కెరీర్లో మీడియాకు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చింది చాలా తక్కువ. జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్... మీడియాకు, ఇంటర్వ్యూలకు దూరంగానే ఉంటున్నారు.

అలాంటి పవన్ కళ్యాణ్ ను తాజాగా ఓ ప్రముక జర్నలిస్టు ఇంటర్వ్యూ చేయబోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎలా ఒప్పుకున్నాడో తెలియదు కానీ మొత్తానికి ఒప్పించారు. ప్రముఖ జర్నలిస్టు, రచయిత, సినిమా క్రిటిక్ అనుపమ చోప్రా పవన్ కళ్యాణ్ ను ఈ రోజు(మార్చి 7) హైదరాబాద్ లో ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు సమాచారం.

Anupama Chopra to interview Pawan Kalyan

పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఏమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే తనకు పంపాలని ఆమె ఇన్వైట్ కూడా చేసారు. అనుపమ చోప్రా తన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన విషయాలు ఏం కవర్ చేస్తారు? అనేది హాట్ టాపిక్ అయింది. ఆమె ఫోకస్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్, పాపులారిటీ మీదనే ఉంటుందని టాక్.

దీంతో పాటు పవన్ కళ్యాణ్ రాజకీయా అంశాలపై, వ్యక్తి గత అంశాలపై కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని అంటున్నారు. చూద్దాం మరి పవన్ కళ్యాణ్ తన ఇంటర్వ్యూలో ఏం చెప్పబోతున్నారో?

English summary
A popular Bollywood Film Critic managed to obtain the appointment of Pawan Kalyan at the time when he wasn't willing to entertain local media & meet any politicians.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu