»   » అనుష్క కి నచ్చిన ఆ ఆరు, లావెక్కిందని సీన్స్ కట్, రాజమౌళి ఎలా మేనేజ్ చేస్తారో

అనుష్క కి నచ్చిన ఆ ఆరు, లావెక్కిందని సీన్స్ కట్, రాజమౌళి ఎలా మేనేజ్ చేస్తారో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అంటే గ్లామర్ పాత్రల్లో మెరిసే ఓ బొమ్మ అన్న ఆలోచన తెలుగు పరిశ్రమలో ముమ్మరంగా ఉండి ఆ తరహా పాత్రలే సృష్టిస్తున్న సమయంలో ఓ సునామీలా ప్రవేశించి.. ఆ ఆలోచనను పటాపంచల్ చేసి హీరోయిన్ అంటే ఇదిరా అంటూ సరైన నిర్వచనం చెప్పింది అనుష్క శెట్టి అలియాస్ స్వీటి.

ఓ అరుంధతి, ఓ సరోజా, ఓ దేవసేన, ఓ రుద్రమదేవీ ఇలా పాత్ర ఏదైనా పరాకాయ ప్రవేశం చేసి అందులో లీనమైపోయి జీవించేస్తుంటుంది. అందుకే తన తోటి హీరోలకు కూడా ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె క్రేజ్ ఎంత పెరిగిందంటే ఒక రోజు తేడాలో సింగం 3, ఓం నమో వెంకటేశాయ చిత్రాలు రిలీజ్ అయితే , ఈ రెండు పెద్ద సినిమల్లోనూ ఆమె ఉంది. అయితే ఆమె శరీరంపై నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఈ రెండు సినిమాల్లోనూ అనుష్క మైనస్ అయ్యిందని రివ్యూల్లో వచ్చాయి.

హీరోయిన్ అంటే పాటలూ, నృత్యాలకే పరిమితం కాదు, అప్పుడప్పుడూ సాహసోపేతమైన పాత్రలు చేయాలి. అప్పుడే గుర్తింపు. అసుష్క ఇప్పుడు రూ.50 కోట్ల హీరోయిన్ గా పేరు తెచ్చుకొందంటే కారణం.. అదే. అనుష్క కెరీర్‌ని 'అరుంధతి'కి ముందూ, ఆ తరవాత అని విభజించి చూసుకోవచ్చేమో..? సూపర్‌, విక్రమార్కుడు, మహానందిలాంటి సినిమాల్లో అందాల పాత్రలకే పరిమితమైన అనుష్క... 'అరుంధతి'తో తనలోని మరోకోణాన్ని బయటపెట్టింది.


ఓవైపు తెలుగుతోపాటు తమిళంలో కూడా వరుసబెట్టి సినిమాలు చేస్తూ అగ్రతారగా దూసుకెళ్తుంది అనుష్క. గ్లామర్ తోపాటు అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకోవటంలో ఆమె దిట్ట. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన బాహుబలిలో దేవసేన పాత్రలో డీగ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. పదేళ్ల ప్రయాణంలో దాదాపుగా 30 చిత్రాల్లో నటించింది. అందులో తన మనసుకు బాగా దగ్గరైన సినిమాల గురించి ఇలా చెప్పుకొచ్చింది.

 ‘అరుంధతి'ముందైతే

‘అరుంధతి'ముందైతే


నా సినీ జీవితం గురించి చెప్పేటప్పుడు ఏ సినిమా గురించి ప్రస్తావించినా, ప్రస్తావించకపోయినా.. ‘అరుంధతి' గురించి తప్పకుండా చెప్పాలి. నా ఆలోచనల్ని పూర్తిగా మార్చేసిందీ సినిమా. అసలు అంత బరువైన పాత్రని నేను చేయగలనా, లేదా? అనిపించింది. అప్పటికి హీరోయిన్ గా ఎంతో అనుభవం లేదు. ఆ తరహా పాత్ర చేసిందీ లేదు. అయినా సరే నాపై నమ్మకం ఉంచారంటే.. అదంతా దర్శక నిర్మాతల చలవే. ఈ సినిమా కోసం నేను చేసిందేం లేదు. వాళ్లేం చెబితే అది చేశా. జేజమ్మగా నాకు పడిన మార్కులన్నీ వాళ్ల కష్టార్జితమే

 ‘రుద్రమదేవి'గురించైతే

‘రుద్రమదేవి'గురించైతే


కొన్ని సినిమాలు బ్యాంకు బ్యాలెన్సు పెంచుతాయి. ఇంకొన్ని గౌరవాన్ని తీసుకొస్తాయి. అలాంటి అరుదైన చిత్రం ‘రుద్రమదేవి'. ఏ సినిమాకీ పడనంత కష్టం ‘రుద్రమదేవి' కోసం పడ్డా. అయినా ఏదో తెలియని సంతృప్తి. ఓ గొప్ప వీరనారి పాత్ర పోషించే అవకాశం, అదృష్టం నాకు దక్కింది. చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం తెరకెక్కించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. చరిత్రను వక్రీకరించకుండా, కమర్షియల్‌ సూత్రాలకు అనుగుణంగా కథ చెప్పాలి. గుణశేఖర్‌ ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు

 ‘సూపర్‌'తోనే మొదలు

‘సూపర్‌'తోనే మొదలు

నా ప్రయాణం ‘సూపర్‌'తోనే మొదలైంది. ఈ సినిమాకి ముందు స్వీటీ అంటే... సున్నా. ఈ రంగం గురించి ఏమాత్రం అవగాహన లేదు. సినిమాల్లో నేను కూడా పనికొస్తాను అనే నమ్మకం కలిగించిన చిత్రమిది. సెట్లో ఉన్న ప్రతీ క్షణం.. ప్రతీ రోజూ ఏదో ఒకటి నేర్చుకొనే అవకాశం దక్కింది. తొలి రోజుల్లో తడబడిపోయేదాన్ని. కెమెరా ముందు ఎలా నడుచుకోవాలో అర్థమయ్యేది కాదు. పూరి జగన్నాథ్‌, నాగ్‌ సార్‌ దగ్గరుండి అన్నీ నేర్పించారు. నా తొలి గురువులు వాళ్లు

ఇలాంటి సినిమాలో చేస్తే చాలు

ఇలాంటి సినిమాలో చేస్తే చాలు


ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎన్ని గొప్ప సినిమాల్లో నటించామన్నదే కీలకం. ‘బాహుబలి' లాంటి ప్రాజెక్టులో నాకూ భాగముంది అని భవిష్యత్తులో గొప్పగా చెప్పుకొంటా. నటీనటులకు, సాంకేతిక నిపుణులకూ ‘ఇలాంటి ఒక్క సినిమాలో పనిచేస్తే చాలు' అనే కల ఉంటుంది. అలాంటి కల ‘బాహుబలి'తో తీరింది. జాతీయ స్థాయిలో నాకు గుర్తింపు తెచ్చిన చిత్రమిది. ‘బాహుబలి' తొలి భాగంలో నా పాత్ర పరిధి తక్కువన్న అసంతృప్తి ఏం లేదు. ఆ సినిమాలో ఒక్క ఫ్రేమ్‌లో కనిపించినా చాలు అని భారతీయ సినీ పరిశ్రమలోని హేమాహేమీలు ఎదురుచూస్తున్నారు

 నా నమ్మకం వేరు

నా నమ్మకం వేరు


వేశ్య పాత్రేంటి? నువ్వు చేయడం ఏంటి? అని ‘వేదం'లో నటిస్తున్నప్పుడు చాలామంది అడిగారు. అయితే ఆ పాత్రపై, కథపై నాకున్న నమ్మకం ముందు ఆ మాటలేం పనిచేయలేదు. నా మనసుకు బాగా దగ్గరైన పాత్రల్లో సరోజ ఒకటి. నా బాడీ లాంగ్వేజ్‌, డైలాగుల్ని పలికే విధానం చాలా కొత్తగా ఉంటాయి. పోలీస్‌ స్టేషన్‌ నేపథ్యంలో సాగే సీన్స్ నాకు బాగా నచ్చాయి. నాతో బరువైన, పదునైన సంభాషణలు చెప్పించారు

 అలాంటి టైమ్ లోనే

అలాంటి టైమ్ లోనే

రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో నటించాలన్నది ప్రతీ హీరోయిన్ కల. నేనూ ఆ అవకాశం కోసం చాలా కాలం నుంచీ ఎదురుచూస్తున్నా. ఇక నాకు ఆ ఛాన్స్‌ లేదేమో అనుకొంటున్న సమయంలో ‘ఓం నమో వేంకటేశాయ'లో అవకాశం వచ్చింది. నా పాత్ర ఏంటని కూడా అడక్కుండా ఓకే చేసేశా. ఎందుకంటే అదంతా రాఘవేంద్రరావుగారిపై నమ్మకం. కృష్ణమ్మగా అత్యంత భక్తిభావాలు కలిగిన పాత్ర దక్కింది. ఈ తరహా పాత్రలో నన్ను నేను చూసుకొంటానని ఎప్పుడూ అనుకోలేదు

 కట్ చేసేసారు

కట్ చేసేసారు

వరసగా ఒక రోజు తేడాలో రిలీజైన సింగం 3, ఓం నమో వెంకటేశాయ చిత్రాలు చూసిన వాళ్లందరూ అనుష్క లావెక్కిన విషయం గురించే మాట్లాడుతున్నారు. ఆ రెండు చిత్రాల్లో అనుష్క ని చూసి షాకై, ఇంత లావు గా ఉందేంటని ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయమై నెగిటివ్ టాక్ రావటంతో.. సింగం 3 చిత్రంలో ఆమె పాత్రని నిర్దాక్ష్యణంగా కట్ చేసారని తెలుస్తోంది.

 మరి బాహుబలిలో

మరి బాహుబలిలో


సైజ్ జీరో చిత్రం కోసం అనుష్క లావు కాగా ఆ లావు తగ్గడానికి నానాపాట్లు పడినప్పటికీ అనుకున్న రేంజ్ లో మాత్రం లావు తగ్గలేదు దాని ఫలితం ఇతర సినిమాలపై కూడా పడుతోంది . అనుష్క లావుగా కనిపించే సరికి బాహుబలి 2 లో అనుష్క లావుగానే ఉండబోతుందని అంటున్నారు సినీ జనాలు. కానీ ఆ మాత్రం తెలివిలేదా రాజమౌళికు ఆయన ఆ లావుని ఎలా కవర్ చేయాలో అలా చేస్తారని కొందరంటున్నారు.

 హఠాత్తుగా పోస్టర్ పై స్లిమ్

హఠాత్తుగా పోస్టర్ పై స్లిమ్


రీసెంట్ గా ..బాహుబలి - 2 పోస్టర్ విడుదల అయిన తర్వాత ఆ పోస్టర్ లో విల్లు ఎక్కుపెట్టిన అనుష్క ఇంత స్లిమ్ గా ఎలా ఉందో అని అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి రాజమౌళి సూచించిన విధంగా ఆమె బరువు తగ్గలేక పోయింది. మొన్నమొన్నటి వరకు కూడా అనుష్క ఏ ఫంక్షన్లో చూసినా కొంచెం లావుగానే కనిపించింది. అయితే కొద్ది రోజుల క్రితం బాహుబలి టీమ్ విడుదల చేసిన పోస్టర్ లో మాత్రం అనుష్క చాలా స్లిమ్ గా కనిపించింది.

 సన్నగా చూపించటానికే కష్టం

సన్నగా చూపించటానికే కష్టం


అలాగే రీసెంట్ గా ‘షో టైం' మూవీ ఆడియో లాంచ్ కు అనుష్క హాజరయ్యింది. ఆ కార్యక్రమానికి వచ్చిన బాహుబలి పోస్టర్ లో చూపిన దానికి పూర్తి భిన్నంగా ఇంకా కొంచెం బొద్దుగానే కనిపించింది. దీంతో అందరూ బాహబలి - 2 పోస్టర్ ను గ్రాఫిక్ లో డిజైన్ చేసారని ఫిక్స్ అయిపోతున్నారు. రాజమౌళి గ్రాఫిక్స్ ద్వారా ఆమెను సన్నగా చూపిస్తారని అంటున్నారు. ప్రస్తుతం భాగమతి తప్ప మరే ఏ చిత్రానికి అనుష్క సైన్ చేయలేదని తెలుస్తుంది.

 ఫిటెనెస్ ఫీల్డ్ లో నే

ఫిటెనెస్ ఫీల్డ్ లో నే

మంగుళూర్‌లో పుట్టిన అనుష్క పాఠశాల, కళాశాల విద్య అంతా బెంగుళూర్‌లోనే జరిగింది. ఈమె మాతృభాష తుళు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, సన్నిహిత స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు. బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్‌ కార్మెల్‌ కళాశాల నుండి బి.సి.ఏ పట్టా పొందింది. అయితే కంప్యూటర్‌ రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ లేదని, ఫిట్‌నెస్‌ రంగంలో పనిచేయాలని ఈమె అభిలాష. సినీ నటుడు నాగార్జున ఈమెను సినీరంగానికి పరిచయం చేశాడు

 భూమిక భర్త దగ్గరే

భూమిక భర్త దగ్గరే

స్వీటీ శెట్టి అనే అసలు పేరు గల అనుష్క మంగుళూర్‌లో నవంబర్‌ 7, 1981న జన్మించింది. ఈమె తల్లిదండ్రులు ఎ.ఎన్‌.విఠల్‌ శెట్టి, ప్రఫుల్లా. ముగ్గురు సంతానంలో ఈమె అమ్మాయి ఒక్కతే. కంప్యూటర్స్‌ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసింది. భూమిక భర్త భరత్‌ ఠాగూర్‌ వద్ద ఈమె కొంతకాలం యోగా పాఠాలు నేర్చుకుంది. తరువాత ఈమె కూడా కొంత కాలం యోగా పాఠాలు చెప్పింది.

ఆ సినిమాలతోనే

ఆ సినిమాలతోనే

2005లో పూరి జగన్నాథ్‌ సూపర్‌ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యారు అనుష్క. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. ఆ తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకుంది. తమిళంలో మాధవన్‌ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైంది. బాండ్‌ గర్ల్‌గా వచ్చిన అవకాశాన్ని నిరాకరించి అనుష్క ఫెవికాల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఒప్పందం కుదుర్చుకుందట.

 గ్రేటంటే గ్రేట్

గ్రేటంటే గ్రేట్

కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్‌. శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా ఈమె సినిమాల్లో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి, జేజమ్మ పాత్రలను పోషించింది. 13 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించి 68 కోట్లను వసూలు చేసింది. అందులో 10 కోట్లు తమిళనాడు నుండే వసూలయ్యాయి. ఈ సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్‌ చేసి విడుదల చేశారు.

 వెనక్కి తిరిగి చూడలేదు

వెనక్కి తిరిగి చూడలేదు

సూపర్ తర్వాత అస్త్రం, చింతకాయల రవి, స్వాగతం,ఒక్క మగాడు వంటి చిత్రాలు చేసినా రాని బ్రేక్ రాజమౌళి విక్రమార్కుడుతో వచ్చింది. అందులో క్లైమాక్స్ లో జింతాత అంటూ ఆమె చేసే అభినయానికి ప్రేక్షకులు నీరాజనం పట్టారు. తొలి చిత్రం సూపర్‌ చిత్రం ప్లాప్ అయినా స్టార్‌ డమ్‌ తీసుకొచ్చింది మాత్రం విక్రమార్కుడు అని చెప్పాలి. ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన నటి పాత్రల్లో అద్భుతంగా నటించింది. ఈ సినిమాతో అనుష్క వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అఫర్లు విపరీతంగా వచ్చి పడ్డాయి. అన్ని చిత్రాలను ఒప్పుకోకుండా కథా ప్రాముఖ్యం, అందులో తన పాత్రకు ఉన్న విలువ ఆధారంగా పాత్రలు ఎంపిక చేసుకునేది.

 అనుష్క గురించి సింగం3 రివ్యూలో చదవండి

అనుష్క గురించి సింగం3 రివ్యూలో చదవండి

తమిళ సూపర్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ సీరీస్ సింగం. రేసీ స్క్రీన్ ప్లే, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఓ బ్రాండ్ గా మారిందంటే అతిశయోక్తి కాదు. ఈ సీరీస్ లో ఇప్పటికే రెండు భాగాలు ఘనవిజయం సాధించగా.., ఇప్పుడు మూడో భాగం ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఇందులో అనుష్క హీరోయిన్ గా చేసింది...ఇక్కడ ఆ రివ్యూ (సూర్య ‘సింగం 2' సారీ.... ‘సింగం3'(రివ్యూ)

 అనుష్క ఎంత స్లిమ్ గా ఉందో చూసారా..

అనుష్క ఎంత స్లిమ్ గా ఉందో చూసారా..

ఈ మధ్యకాలంలో ఎక్కువ చర్చనీయాంశంగా మారింది బాహుబలి 2 కి చెందిన పోస్టర్. ఈ పోస్టర్ లో తప్పుని పట్టుకున్నారు నెట్ జనులు. అదేంటో మీరూ చూడండి.

'బాహుబలి-2' కొత్త పోస్టర్ లో పెద్ద మిస్టేక్..మీరు గమనించారా, ఇదే చర్చ అంతటా

 ఈ రివ్యూలో అనుష్క గురించి ఏం రాసారో చూసారా

ఈ రివ్యూలో అనుష్క గురించి ఏం రాసారో చూసారా

నాగ్, రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో వచ్చిన ఓం నమో వెంకటేశాయ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రంలో అనుష్కకు మాత్రం మైనస్ మార్కులు పడ్డాయి. ఎందుకో మీరు ఈ రివ్యూలో చదివి తెలుసుకోవచ్చు.

భక్తులకు పండగయా!!(‘ఓం నమో వేంకటేశాయ' రివ్యూ)

English summary
Anushka happy with her latest movies Singam 3 and Om namo venkatesaya result. Singham 3 and Om Namo Venkatesaya are released in a gap of one day and Anushka is looking fat in both of these films. It is said that her role is cut down drastically in Singham 3.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu