»   » యోగా నా జీవితాన్ని మార్చేసింది: గతాన్ని గుర్తు చేసుకున్న అనుష్క!

యోగా నా జీవితాన్ని మార్చేసింది: గతాన్ని గుర్తు చేసుకున్న అనుష్క!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాల్లోకి రాక ముందు హీరోయిన్ అనుష్క యోగా టీచర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. ఈ యోగా కారణంగా ఏర్పడిన పరిచయాలతోనే ఆమె సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. తన అందం, అభినయంతో సౌత్ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టుతో అనుష్క నేషనల్ వైడ్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది.

ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అనుష్క సినిమాల్లోకి రాక ముందు తన యోగా టీచర్ లైఫ్ గుర్తు చేసుకున్నారు. యోగా నా జీవితాన్ని మార్చేసిందని చెబుతూ అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే విషెస్ తెలిపారు.


అనుష్క యోగా

‘నా జీవితంలో మర్చిపోలేని నిర్ణయం నేను యోగా టీచర్ అవ్వాలనే నిర్ణయం. నేనెు డాక్టర్లు, ఇంజినీర్ల కుటుంబం నుండి వచ్చాను. అలాంటిది నేను యోగా ఎంచుకోవడం సాహసోపేతమైన నిర్ణయం. నా జీవితంలో చోటుచేసుకున్న ఎన్నో మార్పులకు యోగానే కారణం. హ్యాపీ ఇంటర్నేషనల్‌ యోగా డే' అంటూ అనుష్క ఎఫ్‌బి పోస్టు చేసింది.


సినిమాల్లోకి రాక ముందు

సినిమాల్లోకి రాక ముందు

అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గా పని చేసింది. బెంగుళూరులోని ఈస్ట్‌వుడ్ పాఠశాలలో ఆమె పని చేశారు. అప్పుడు తన సహచర ఉపాధ్యాయులతో కలిసి దిగిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు.


అక్కినేని ఫ్యామిలీ ద్వారా

అక్కినేని ఫ్యామిలీ ద్వారా

నాగ చైతన్యకు అనుష్క యోగా పాఠాలు చెప్పింది. అలా అక్కినేని ఫ్యామిలీకి పరిచయం అవ్వడం, హీరోయిన్ గా సూటయ్యే ఫిజిక్ ఉండటంతో నాగార్జున హీరోగా రూపొందిన ‘సూపర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేయడం జరిగిపోయింది.


అందం, అభినయం

అందం, అభినయం

‘సూపర్' సినిమాలో గ్లామర్ రోల్ తో ఆకట్టుకున్న అనుష్క.... ఆ తర్వాత అందం మాత్రమే కాదు, అభినయం పరంగా కూడా ది బెస్ట్ అని నిరూపించుకుంది. రుద్రమదేవి, బాహుబలి చిత్రాలతో వీరనారి పాత్రలకు తనకు తానే సాటి అని నిరూపించుకుంది.English summary
"Most memorable moment in my Life is when I took the decision to teach Yoga. I come from a family of doctors and engineers. It was a brave decision on my side to go for yoga but It has totally changed my life and is responsible for everything now ❤️ Happy #InternationalYogaDay" Anushka said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu