»   » కొంత మనస్తాపం చెందిన మాట వాస్తవమే కానీ...అనుష్క

కొంత మనస్తాపం చెందిన మాట వాస్తవమే కానీ...అనుష్క

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆ తనిఖీలతో కొంత మనస్తాపం చెందిన మాట వాస్తవమే కానీ, షూటింగ్‌లకు దూరంగా వుండటం, బెంగళూరులో స్థిరపడటం అనే వార్తలు పూర్తిగా అవాస్తవాలని అనుష్క అంటోంది.ఇటీవల ఆదాయపు పన్ను శాఖ అనుష్క ఆస్థిపాస్తులను తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీలతో ఈ బెంగళూరు తార మనస్తాపం చెందారని, హైదరాబాద్ నుంచి తన మకాంను బెంగళూరుకు మార్చారని, కొన్నాళ్ళు షూటింగ్‌లకు కూడా దూరంగా వుండబోతున్నారని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అనుష్క వీటిని కొట్టి పారేస్తోంది.అలాగే ఇటీవల నాగార్జునతో నటిస్తున్న 'డమరుకం" చిత్రం షూటింగ్ నిమిత్తం స్విట్జర్లాండ్ వెళ్ళి సక్సెస్‌ఫుల్‌గా షెడ్యూల్‌ను పూర్తిచేసుకొని వచ్చామని కూడా అనుష్క అంటోంది. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తన పాత్ర అందరికి ఆశ్చర్యానికి గురిచేసే విధంగా వుంటుందని ఎంతో హుషారుగా చెప్పారు అనుష్క.

English summary
Anushka who made her name to resound with Arundhati movie is a top actress in Southern film industry. Currently she is working in prestigious projects both in Kollywood and Tollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu