»   » అంత సీన్ లేదు: ప్రభాస్ పెళ్లి గురించి అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్

అంత సీన్ లేదు: ప్రభాస్ పెళ్లి గురించి అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి ప్రాజెక్టు కోసం తన కెరీర్ ను పనంగా పెట్టిన హీరో ప్రభాస్.... ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పెళ్లికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా తమిళ వెర్షన్ ఆడియో రిలీజ్ వేడుక చెన్నైలో జరిగిన సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. దీనికి అనుష్క సమాధానం చెప్పింది.

అలాంటిదేమీ లేదు

అలాంటిదేమీ లేదు

అనుష్క మాట్లాడుతూ, ‘బాహుబలి' సినిమా పూర్తయ్యేంతవరకు పెళ్లికి దూరంగా ఉండాలని ప్రభాస్ నియమం ఏమీ పెట్టుకోలేదు, ఆ విషయంలో వచ్చిన వార్తలన్నీ పుకార్లే' అన్నారు. అనుష్క చెప్పింది నిజమే, అలాంటి నియమాలు ఏమీ పెట్టుకోలేదని ప్రభాస్ అన్నారు.

ప్రభాస్ పెళ్లి సంగతేమైనట్లు?

ప్రభాస్ పెళ్లి సంగతేమైనట్లు?

అయితే పెళ్లి ఎప్పుడు అనే విషయంలో ప్రభాస్ నుండి ఇంకా సరైన సమాధానం రాలేదు. ఈ సారి కూడా ఈ ప్రశ్నకు సమాధానం దాటవేసాడు ప్రభాస్.

వైజాగ్ అమ్మాయి?

వైజాగ్ అమ్మాయి?

బయట మాత్రం రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ప్రభాస్ కు తగిన అమ్మాయిని వెతికే పనిలో ఉన్న కృష్ణం రాజు అండ్ ఫ్యామిలీ చివరకు విశాఖపట్నంలో ప్రభాస్ హైటు, వెయిటు, అందానికి సరిజోడి అయిన అమ్మాయిని ఎంపిక చేసారట. ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త కుమర్తె అని ప్రచారం జరుగుతోంది. అయితే దీని గురించి ఇప్పటి వరకు ఎలాంటి అపీషియల్ సమాచారం లేదు.

ప్రభాస్ బిజీ జిబీ

ప్రభాస్ బిజీ జిబీ

వయసు 40కి చేరువ అవుతున్నా... ప్రభాస్ పెళ్లి గురించి ఆలోచింక పోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేకుండా తన తర్వాతి సినిమా సుజీత్ దర్శకత్వంలో చేస్తూ బిజీ అయిపోయాడు ప్రభాస్.

English summary
Anushka interesting comments about Prabhas marriage. "Prabhas marriage not link with Baahubali project" she said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu